BIKKI NEWS (SEP. 09) : TODAY NEWS IN TELUGU on 9th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 9th SEPTEMBER 2024
TELANGANA NEWS
ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్పు.. వారి పదవులు ఉంటాయా.. ఊడుతాయా?
కాంప్రమైజ్ అయ్యారా? భయపడ్డారా? ఒవైసీ కాలేజీ కూల్చేందుకు బుల్డోజర్లు దొరుకుతలేదా?: ఎమ్మెల్యే రాజాసింగ్
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ ప్రభావం రాష్ట్ర ఖజానాపైనా పడింది. బుల్డోజర్లు, కూల్చివేతల భయానికి ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది.
జయభేరికేమో నోటీసులు.. పేదలపైకి బుల్డోజర్లు.. హైడ్రా ద్వంద్వ నీతి
రేవంత్ పాలన యమపాశం.. రుణమాఫీ కాకపాయె.. రైతుబంధు రాకపాయె: హరీశ్‌రావు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, రాగల 48 గంటల్లో తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురియవచ్చని, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కనికరం లేని కాంగ్రెస్ సర్కార్.. పేదల గూడును కర్కశంగా కూల్చివేస్తున్నది: కేటీఆర్
త్వరలో నిర్మించనున్న ఫోర్త్‌సిటీలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇండ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. అర్హులైన వారిని ఫ్యూచర్‌సిటీలో భాగస్వాములను చేస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిషరించడంలో సీఎం విఫలం అయ్యారని దుయ్యబట్టారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకొన్న సీఎం.. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో 20న కలెక్టరేట్ల ము ట్టడి చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, జా తీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు
ANDHRA PRADESH NEWS
బుడమేరుకు ఇంకా వరద నీరు వచ్చే అవకాశం ఉంది.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
విశాఖను వణికిస్తున్న వర్షాలు.. ఆ నాలుగు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
రెండు రోజులుగా రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతపులితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఏపీ లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
NATIONAL NEWS
‘భారత్‌లో చేరండి, మా సొంతంగా భావిస్తున్నాం’.. పీవోకే ప్రజలకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు
అస్సాంలో కొత్తగా ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) దరఖాస్తు రసీదు నెంబర్ (ఏఆర్‌ఎన్)ను సమర్పించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.
వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ వార్నింగ్
ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్ తొలి కేసు దేశంలో నమోదైనట్లు తెలుస్తున్నది. ఈ వైరస్ లక్షణాలున్న వ్యక్తికి ఎంపాక్స్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షకు పంపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ఆ పదవికి రాజీనామా చేశారు
గాలి నాణ్యత మెరుగుదలలో తెలంగాణలోని నల్గొండ సత్తా చాటింది. జైపూర్‌లో ‘స్వచ్ఛమైన గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవం’పై జరిగిన జాతీయ వర్క్ షాప్‌లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ -2024కు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ జాతీయ పరిశుభ్ర వాయు నగరాల అవార్డులను ప్రకటించింది.
INTERNATIONAL NEWS
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆ దేశానికి చెందిన ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్’ ఆదివారం ప్రకటించింది.
కార్గిల్ యుద్ధంలో తమ పాత్ర ఉందని పాకిస్థాన్ సైన్యం అంగీకరించింది. ఈ యుద్ధం జరిగిన 25 ఏండ్ల తర్వాత తొలిసారి పాక్ ఈ విషయంపై స్పందించింది.
టాప్ ఎండ్ యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల స్క్రీన్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నది. అయితే దీనిని పోలిన 6.74 అడుగుల పొడవైన నమూనాను భారత సంతతి యూట్యూబర్, టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ రూపొందించారు.
చైనాలోని పశువుల కొట్టాల్లో పెద్ద సంఖ్యలో వైరస్‌లు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉన్ని కోసం పెంచే జంతువుల్లో వైరస్‌ల జాడను కనుగొన్నారు. స్వీడెన్‌కు చెందిన పరిశోధకులు 2021 నుంచి 2024 మధ్య చైనాలో మరణించిన 461 జంతువుల నుంచి నమూనాలు సేకరించి, జన్యుపరమైన అధ్యయనం చేశారు. వీటిల్లో 412 జంతువులు పశువుల కొట్టాల్లో ఉన్ని ఉత్పత్తి కోసం పెంచేవి.
చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. వెట్‌ల్యాండ్ (WELV) అని పిలవబడే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు.
SPORTS NEWS
పారిస్ పారాలంపిక్స్ లో 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. వీటిలో 7 స్వర్ణాలు, 9 రజతాలు 13 కాంస్య పతకాలు ఉన్నాయి.
గత పారాలింపిక్స్ (టోక్యో)లో నెగ్గిన 19 పతకాలే ఇప్పటివరకూ అత్యధికం కాగా పారిస్‌లో మాత్రం అంతకంటే మరో పది పతకాలు ఎక్కువే సాధించింది.
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ అమ్మాయి అరీనా సబలెంక గెలుచుకుంది. ఫైనల్‌లో జెస్సికపై ఘన విజయం
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత హాకీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్ 3-0తో చైనాపై ఏకపక్ష విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది.
బంగ్లాదేశ్ తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్టు కోసం ఆదివారం బీసీసీఐ 16 మందితో కూడిన స్క్వాడ్‌ను వెల్లడించింది.
EDUCATION & JOBS UPDATES
పీఈసెట్‌లో రెండో దశ కౌన్సెలింగ్ ద్వారా 512 సీట్లు భర్తీ చేసినట్టు ప్రొఫెసర్ పీ రమేశ్‌బాబు ఆదివారం ప్రకటనలో తెలిపారు. బీపీఈడీ, యూజీడీపీఈడీ ప్రవేశాల్లో కన్వీనర్ కోటాలో 1,27 9 సీట్లకు 595 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, వారికి సీట్లు కేటాయించినట్టు తెలిపా రు.
సెప్టెంబర్ 22న ఏపీ టెట్ 2024 హల్ టికెట్లు విడుదల. అక్టోబర్ 3నుంచి పరీక్షలు
UGC NET 2024 ప్రిలిమినరీ కీ విడుదల
సీపీగెట్ తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ పై అస్పష్టత