BIKKI NEWS (NOV. 09) : TODAY NEWS IN TELUGU on 9th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 9th NOVEMBER 2024
TELANGANA NEWS
గ్రామకంఠం భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయో, ఆ భూములపై ఏ శాఖకు అధికారం ఉంటుందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టులో కేసుల విచారణ లైవ్ ప్రొసీడింగ్స్‌ను రికార్డింగ్ చేయరాదని హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేరొన్నారు. లైవ్ రికార్డింగ్ చేసి వాటిని మీడియాలో ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతా – సీఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్ట గా మార్పు – సీఎం
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయానికి బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు నవంబర్ 11 కి వాయిదా.
పీఆర్సీ, పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
ANDHRA PRADESH NEWS
బీజేపీకి ఊడిగం చేస్తున్న చంద్రబాబు, వైఎస్ జగన్ : వైఎస్ షర్మిల ఆరోపణ
చంద్రబాబు ఆ యముడ్ని కూడా తప్పు దారి పట్టిస్తాడేమో : ట్విటర్‌లో విజయసాయి రెడ్డి ఆరోపణ
నేడు శ్రీశైలం రానున్న సీఎం చంద్రబాబు.. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన నంద్యాల ఎస్పీ
ఏపీ ప్రభుత్వం భారీగా బదిలీలను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది..
షేర్ల వివాదంపై జగన్ వేసిన పిటిషన్ విచారణ ఈనెల 13 వ తేదీకి వాయిదా
తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది
ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. మహిళలపై దాడులు పెరిగాయని, లక్షన్నర లబ్ధిదారుల పింఛన్లు కట్ చేశారని ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, డీజీపీ అధికార పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు.
NATIONAL NEWS
టైలరింగ్ షాపుల్లో ఇక నుంచి మహిళల దుస్తుల కొలతలు పురుష టైలర్లు తీసుకోరాదని ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ ప్రతిపాదించింది.
దేశంలో నగదు చలామణి రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) మైనారిటీ హోదాపై విచారణ బాధ్యతను నూతన ధర్మాసనానికి సుప్రీంకోర్టు శుక్రవారం అప్పగించింది.
మణిపూర్‌లో గిరిజనుల ఇళ్లకు నిప్పు.. మంటల్లో కాలి మహిళ మృతి
నేను ఉండగా ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదు : ప్రధాని మోదీ
లాస్ట్ వర్కింగ్ డే.. వృత్తిపరంగా సంతృప్తిగా ఉన్నానన్న సీజేఐ డీవై చంద్రచూడ్
INTERNATIONAL NEWS
కెనడా ప్రధాని ట్రూడో రాజకీయ భవిష్యత్తుపై టెస్లా అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోయి, ప్రధాని పదవిని పోగొట్టుకుంటారని తెలిపారు
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులున్నది నిజమే. – ప్రధాని ట్రూడో
ప్రపంచంలోని సూపర్‌పవర్ దేశాల్లో ఇండియాను కూడా చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు
కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు.. వేలాది ఇండ్లు అగ్నికి ఆహుతి
కెనడా ప్రభుత్వం తన వీసా పాలసీని సవరించింది. 10 ఏండ్ల పాటు చెల్లుబాటయ్యేలా గతంలో అమలు చేసిన దీర్ఘకాలిక బహుళ ప్రవేశ పర్యాటక వీసాను జారీ చేసే విధానంలో మార్పు చేసింది.
పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్న సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది
BUSINESS NEWS
స్వల్పంగా నప్టపోయిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 79485 (-55) & నిఫ్టీ : 24248 (-51)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ నెల 20న స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.19,782 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 84.37 కి పడిపోయింది.
రూ.11 వేల కోట్ల వాటా విక్రయానికి సంబంధించి స్విగ్గీ సంస్థ జారీ చేసిన 16,01,09,703 షేర్లకుగాను 57,53,07,536 షేర్ల బిడ్డింగ్‌లు వచ్చాయి. షేరు ధరల శ్రేణిని రూ.371-390 స్థాయిలో నిర్ణయించింది.
SPORTS NEWS
సంజూ శాంసన్ సెంచరీతో కింగ్స్‌మీడ్ మైదానం వేదికగా సౌతాఫ్రికా తో జరిగిన తొలి టీ20లో భారత్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
అంతర్జాతీయ టీట్వంటీ లో భారత్ తరఫున రెండు శతకాలు చేసిన ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్ శాంసన్.
టీ20లలో వరుసగా రెండు శతకాలు చేసిన ఆటగాళ్లలో శాంసన్ నాలుగోవాడు. గుస్తవ్ మెక్‌కియోన్, రిలీ రూసో, ఫిల్ సాల్ట్.. సంజూ కంటే ముందున్నారు.
ప్రతిష్ఠాత్మక ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ టోర్నీలో భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
కొరియా మాస్టర్స్‌లో భారత యువ షట్లర్ కిరణ్ జార్జి సెమీస్ కు చేరుకున్నాడు.
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల.
నవోదయలో 9, 11 తరగతుల ప్రవేశాల దరఖాస్తు గడువు నవంబర్ 19 వరకు పెంపు.
UPSC 2025 రీవైజ్ఠ్ పరీక్షలు కేలండర్ విడుదల
పీజీ డిప్లొమా ఇన్ కలినరీ ఆర్ట్స్ పరీక్షా ఫలితాల విడుదల
SIDBI లో భారీ వేతనం తో 72 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకై ప్రకటన.