TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 08 – 2024

BIKKI NEWS (AUG 09) : TODAY NEWS IN TELUGU on 9th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 9th AUGUST 2024

TELANGANA NEWS

త్వరలోనే 11 వేల అంగన్వాడీ ఉద్యోగాలకై నోటిఫికేషన్ – మంత్రి సీతక్క

ఇసుక ధరలకు రెక్కలు. భారీ వర్షాలు కారణంగా లోడింగ్, అన్ లోడింగ్ తో ఆలస్యం.

ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల నియామకం ఇక ప్రత్యక్షంగా. జూనియర్ కళాశాలలో 320 పోస్టుల భర్తీ కి అవకాశం.

రేషన్ హెల్త్ కార్డుల జారీకై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు.

భూధాన్ బోర్డు రద్దు నిర్ణయం సబబే – హైకోర్టు

బదిలీలు, పదోన్నతుల సమస్యలు పరిష్కరించండి. – యూటీఎప్

ANDHRA PRADESH NEWS

ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి .. చంద్రబాబు పాలనపై వైఎస్‌ జగన్‌

ఏపీలో త్వరలో జన్మభూమి-2 ప్రారంభం.. టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం

బ్రెయిన్‌ డెడ్‌ అయి అవయవదానం చేసే జీవన్మృతులకు ప్రభుత్వం తరుఫున అంత్యక్రియలు జరుపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీకి 8 కుంకి ఏనుగులు ఇచ్చేందుకు కర్ణాటక అంగీకారం : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

40 ఏండ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని, ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్‌ ఎలా చేయాలో చూపిస్తున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

NATIONAL NEWS

సీబీఐకి చిక్కిన ఈడీ.. 20 లక్షలు తీసుకొంటూ అడ్డంగా బుక్కైన ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌.

బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్‌ నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య (80) కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన వృద్ధాప్య కారణాలతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

దేశంలో గత 10 ఏండ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 1,700 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంత భూమిని కోల్పోయామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది

INTERNATIONAL NEWS

జపాన్ లో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్ పై 7.1 గా నమోదు. సునామీ హెచ్చరికలు జారీ.

బంగ్లాదేశ్ ఘటనల్లో మొత్తం మృతుల సంఖ్య 560

బంగ్లాదేశ్ కు ఇది రెండో స్వతంత్రం – యూనిస్

న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

BUSINESS NEWS

ఈ ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటును 6.50 శాతం వద్దే యథాతథంగా ఆర్బీఐ ఉంచింది. దీంతో వరుసగా 9వ ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉన్నైట్టెంది.

ట్యాక్స్‌ పేయర్స్‌ సౌకర్యార్థం యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ద్వారా పన్ను చెల్లింపులకున్న పరిమితిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణనీయంగా పెంచింది. ఏకంగా రూ.5 లక్షలదాకా పెంచుతూ నిర్ణయం.

ఇకపై చెక్‌ క్లియరెన్స్‌లు కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే బ్యాంకులు పూర్తిచేయాలని ఆర్బీఐ గవర్నర్‌ దాస్‌ ద్రవ్యసమీక్ష సందర్భంగా ప్రతిపాదించారు.

హోమ్‌ లోన్లపై టాప్‌-అప్‌లు ఇస్తే ఎందుకు వినియోగిస్తున్నారన్నది ఆరా తీయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.

యూపీఐ ద్వారా డెలిగేటెడ్‌ చెల్లింపుల సదుపాయాన్ని ఆర్బీఐ కొత్తగా పరిచయం చేసింది. దీనివల్ల డిజిటల్‌ పేమెంట్స్‌ వినియోగం మరింత లోతుగా జరుగుతుందని చెప్పింది.

SPORTS NEWS

పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్‌ త్రో ఫైనల్‌లో నీరజ్‌ రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం విసిరి… రెండో స్థానంతో సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు.

విశ్వ క్రీడ‌ల్లో భార‌త పురుషుల హ‌కీ జ‌ట్టు అద్వితీయ విజ‌యంతో కాంస్యం కొల్ల‌గొట్టింది. 52 ఏండ్ల త‌ర్వాత ఒలింపిక్స్‌లో వ‌రుస‌గా రెండోసారి కంచు మోత మోగించింది.

అంత‌ర్జాతీయ ఒలింపిక్స్ సంఘం అంతిమ్‌పై ఏకంగా మూడేండ్ల నిషేధం విధించింది. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా భార‌త రెజ్ల‌ర్‌కు ఏఓసీ ఈ శిక్ష వేసింది.

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ సెమీస్‌లో అమ‌న్ షెరావ‌త్.

మరథాన్ స్విమ్మింగ్ స్వర్ణం వాన్ రావెండల్ (నెదర్లాండ్స్) గెలుచుకుంది.

400 మీటర్ల పరుగు పందెంలో క్విన్సీ హల్ (అమెరికా) స్వర్ణం గెలుచుకున్నాడు.

EDUCATION & JOBS UPDATES

నేడు CPGET 2024 RESULTS విడుదల.

పీజీఈసెట్ షెడ్యూల్ మార్పు.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 24 వరకు పొడిగింపు.

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ.

నిమ్స్ లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం.

ENTERTAINMENT UPDATES

హరిహర వీరమల్లు సినిమా లో అనుపమ్ ఖేర్

పుష్ప – 2 నుండి షెకావత్ పోస్టర్ ఆవిష్కరణ.

నాగచైతన్య – శోబిత లకు నిశ్చితార్థం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు