TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 09 – 2024

BIKKI NEWS (SEP. 08) : TODAY NEWS IN TELUGU on 8th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 8th SEPTEMBER 2024

TELANGANA NEWS

ఆది, సోమ‌వారాల్లో తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది.

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత ముర‌ళీ మోహ‌న్‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం షాకిచ్చింది. హైద‌రాబాద్ న‌గ‌రంలోని జ‌య‌భేరి సంస్థ‌కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే మేమే కూల్చేస్తామని హైడ్రా త‌న నోటీసుల్లో పేర్కొంది.

తెలంగాణలోని ప‌లు ప్రాంతాల్లో శ‌నివారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. దీంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. మ‌ళ్లీ ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటెత్తింది. సాగునీటి జ‌లాశ‌యాల‌న్నీ నిండు కుండ‌లా మారాయి.

పారాలింపిక్స్ కాంస్య ప‌త‌క విజేత దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం.. రూ. కోటి న‌గ‌దు బ‌హుమ‌తి : సీఎం రేవంత్ రెడ్డి

పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త‌, బ‌హుభాషా కోవిదుడు, క‌వి, ర‌చ‌యిత‌, అనువాద‌కుడు న‌లిమెల భాస్క‌ర్‌ను వరించింది.

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌

వినాయక చవితి.. హైదరాబాద్‌లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

ANDHRA PRADESH NEWS

ప్రకాశం బ్యారేజ్‌ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై కేసు నమోదు

వరద విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రూ.6,880 కోట్లు నష్టం.. నివేదికను సిద్ధం చేసిన ప్రభుత్వం

ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ గేట్లను ఢీకొన్ని నాలుగు బోట్లు వైసీపీ నాయకులవేనని అనుమానం వ్యక్తం చేశారు.

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు జలాశయం 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు

NATIONAL NEWS

మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ చెల‌రేగిన హింస‌.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది.

పట్టాలు తప్పిన జబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌.. క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు

INTERNATIONAL NEWS

సునీతా విలియమ్స్‌ లేకుండానే.. భూమిని చేరిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌

BUSINESS NEWS

డిపాజిట్లు ఆకట్టుకోవడంలో బ్యాంకులు విఫలమవుతున్నాయి. ఒకవైపు రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇదే తరుణంలో డిపాజిట్‌ చేసేవారు తరిగిపోతున్నారు. దీంతో బ్యాంకింగ్‌ రంగం తీవ్ర సంక్షోభం నెదుర్కొంటున్నది.

SPORTS NEWS

పారిస్ పారా ఒలింపిక్స్‌లో భార‌త్ మొత్తం ప‌త‌కాల సంఖ్య 29కి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఖాతాలో 7 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 13 కాంస్యాలు ప‌డ్డాయి.

పారిస్ పారా ఒలింపిక్స్‌లో భార‌త్ మ‌రో స్వ‌ర్ణాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్‌-41లో న‌వ‌దీప్ స్వ‌ర్ణం ద‌క్కించుకున్నాడు.

పారా ఒలింపిక్స్‌లో మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ12లో సిమ్రాన్ శ‌ర్మ‌కు కాంస్యం ద‌క్కింది. 24.75 సెకండ్ల‌లో సిమ్రాన్ ల‌క్ష్యాన్ని చేరుకుంది.

ఇట‌లీ సంచ‌ల‌నం జ‌న్నిక్ సిన్న‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. తొలిసారి యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లో అడుగుపెట్టాడు. త‌ద్వారా ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఇట‌లీ దేశ‌స్థుడిగా సిన్న‌ర్ రికార్డు నెల‌కొల్పాడు.

మ‌రోవైపు అమెరికా సంచ‌ల‌నం టేల‌ర్‌కు కూడా ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్. దాంతో ఈసారి కొత్త చాంపియ‌న్‌ను చూడ‌డం ఖాయం.

EDUCATION & JOBS UPDATES

UPSC CGSE 2024 నోటిఫికేషన్ విడుదల

పదిలో ఉత్తీర్ణత సాదించని వారికి పాత సిలబస్ తోనే పరీక్షలు

SSC CGL అడ్మిట్ కార్డులు విడుదల

SSC స్టెనోగ్రాఫర్ , ట్రాన్స్‌లెటర్స్ పరీక్షలు డిసెంబర్ లో

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు