TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 07 – 10 – 2024

BIKKI NEWS (OCT. 07) : TODAY NEWS IN TELUGU on 7th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 7th OCTOBER 2024

TELANGANA NEWS

మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్‌పర్సన్‌గా సెర్ప్‌ సీఈవో, వైస్‌ చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ఎంఆర్‌డీసీఎల్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌తో కూడిన 14మంది సభ్యులను కమిటీలో నియమించింది.

అక్టోబర్ తొమ్మిదో తేదీన‌ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం ఏ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.

గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.

రాబోయే కొద్ది రోజుల్లో నూతన రెవెన్యూ చట్టం 2024 తీసుకురాబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్‌ సర్కారే కారణమని విమర్శించారు.

తెలంగాణలో రెండురోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

సింగూరు ప్రాజెక్ట్‌ రెండు గేట్లు ఎత్తివేత.. ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ANDHRA PRADESH NEWS

నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడు.

రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. భద్రత సిబ్బంది అలెర్ట్‌

ఆర్థిక లావాదేవీలే చిన్నారి హత్యకు కారణం.. వీడిన పుంగనూరు హత్య కేసు మిస్టరీ.

చంద్రబాబు పాలనలో మహిళలు, పిల్లలకు రక్షణ కరువు : మాజీ మంత్రి రోజా సెల్వమణి

ఊసరవెల్లి రాజకీయాల్లో చంద్రబాబు నెంబర్‌ వన్‌ : ఎంపీ విజయసాయి రెడ్డి

సెయిల్‌లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను విలీనం చేయాలని కార్మికుల మానవహారం

లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గ.. భక్తులతో రద్దీగా ఇంద్రకీలాద్రి

NATIONAL NEWS

చెన్నై మెరీనా బీచ్‌లో ఐఏఎఫ్‌ ఎయిర్‌ షోలో అపశ్రుతి.. తొక్కిసలాటలో నలుగురు దుర్మరణం..

వచ్చే దశాబ్దంలో అణ్వాయుధాల మాదిరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని, విదేశాంగశాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హెచ్చరించారు.

త్వరలోనే భారీ సౌర తుఫాను భూమిని తాకనున్నది. ఇది కమ్యూనికేషన్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది.

డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమంటే.. డబుల్‌ లూటీ.. బీజేపీపై కేజ్రీవాల్‌ విమర్శలు

గోవాలో ఉద్రిక్తత.. మతపరమైన వ్యాఖ్యలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్ నేతను అరెస్టు చేయాలని క్రైస్తవులు డిమాండ్

డ్రగ్స్‌ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్‌) అధికారులు రైడ్‌ చేశారు. రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్‌ నుంచి గోవాకు కొత్త రైలు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవదహనం

ఇకపై శబరిమల దర్శనానికి ఆన్‌లైన్‌ బుకింగ్‌ భక్తులకు మాత్రమే శబరిమలకు అనుమతి..

INTERNATIONAL NEWS

హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా గాజాలో మసీదుపై ఇజ్రాయెల్ దాడి.. 24 మంది దుర్మరణం

ఆయుధాలపై ఆంక్షలు సిగ్గుచేటు.. మాక్రాన్‌పై నెతన్యాహూ ఆగ్రహం. ఇజ్రాయెల్‌కు ఆయుధ విక్రయాలను నిలిపివేయాలంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

BUSINESS NEWS

ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు.. బ్యాంకు చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడి..

గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,74, 906.18 కోట్లు కోల్పోయాయి.

SPORTS NEWS

ఐసీసీ మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ 2024 భారత జట్టు పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించింది.

బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది.

నేష‌న‌ల్ క్రికెట్ లీగ్ ద్వారా అమెరికా క్రికెట్‌లో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు.

జ‌పావో ఐలాండ్‌ను ప్రఖ్యాత పుట్‌బాల్ ఆటగాడు నెయ్‌మర్ రూ.64 కోట్ల‌కు సొంతం చేసుకోబోతున్నాడని సమాచారం.

EDUCATION & JOBS UPDATES

ఏపీ కేజీబీవీలలో 1333 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ జారీ.

IBPS CLERK మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల

TG DSC 2024 యొక్క 1:1 జాబితాను విడుదల చేయనున్నారు.

అక్టోబర్ 9న సీఎం చేతుల మీదుగా డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

తెలంగాణ రాష్ట్రంలో పలు వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు వవ్యవసాయ వర్శిటీ నోటిఫికేషన్

NMMSE 2024 గడువు అక్టోబర్ 15 వరకు కలదు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు