BIKKI NEWS (NOV. 07) : TODAY NEWS IN TELUGU on 7th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 7th NOVEMBER 2024
TELANGANA NEWS
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే
సమగ్ర కుటుంబ సర్వే పై గవర్నర్ ను కలిసి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి
మరిన్ని నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభం – సీఎం రేవంత్ రెడ్డి
బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన పడవద్దు. రుణాలు మంజూరు చేయండి. – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నైరుతి బంగాళాఖాతంలో గురువారం సాయంత్రం మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం.
ఈ నెల 8లోపు డీఎస్సీ 2008 అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి, తుది జాబితాను తయారుచేసి పంపాలని పాఠశాల విద్యాశా ఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఉత్తర్వుల్లో ఆదేశించారు.
ANDHRA PRADESH NEWS
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సీఆర్డీఏ పరిధిని 8,352 చ.కి.మీ కు పెంపునకు ఆమోదం
2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు , ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ (ప్రోహిబిషన్)కు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రీఫెల్ బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణకు, ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదాకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది..
కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ లక్ష్యాల సాధనకు , పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల డీఎస్సీ ప్రకటనను వాయిదా వేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయినా పవన్ కళ్యాణ్
ఏపీ డ్రోన్ పాలసీ కి ఏపి కేబినెట్ అమోదం
విబేధాలు వస్తే తల్లికి కొడుకు కాకుండా పోతాడా.. జగన్‌కు అండగా వీడియో రిలీజ్ చేసిన విజయమ్మ
మద్దెల చెరువు సూరి హత్య కేసు.. చంచల్‌గూడ జైలు నుంచి భాను కిరణ్ విడుదల
NATIONAL NEWS
ప్రతిభగల విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించే పీఎం-విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. ఈ పథకం కింద ఎవరికైనా నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం లభిస్తే వారి కోర్సుకు అవసరమైన ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులకు అవసరమైన పూర్తి విద్యా రుణాన్ని ఎలాంటి హామీ లేకుండా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పొందవచ్చు
డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చరిత్రాత్మక విజయం పొందిన నా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై చర్చలు జరుపాలి.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం
ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. 358గా ఏక్యూఐ నమోదు
కాంగ్రెస్ కీలక నిర్ణయం.. హిమాచల్ ప్రదేశ్‌లో అన్ని విభాగాలు రద్దు
బీజేపీ పాలిత యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తప్పుబట్టింది. ఇష్టమొచ్చినట్టు పౌరుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది
డైరెక్ట్ టూ డివైజ్(డీ2డీ)’ సాంకేతికతను పరీక్షిస్తున్న బీఎస్ఎన్ఎల్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా సిమ్ కార్డుల అవసరం లేకుండా, మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్, మెసేజ్‌లు చేసుకోవచ్చు.
విధుల నిర్వహణలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ పబ్లిక్ సర్వెంట్లను ప్రాసిక్యూట్ చేయాలంటే, ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది.
INTERNATIONAL NEWS
అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక
జేడీ వాన్స్ అమెరికాకు ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు.
కొత్తగా యుద్ధాలు స్టార్ట్ చేయను అని, వాటిని ఆపుతానని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
తొట్టతొలిసారి జపాన్ శాస్త్రవేత్తలు కలపతో తయారు చేసిన శాటిలైట్ లిగ్నోశాట్ ను ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్‌లో నుంచి స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపారు.
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 80,378 (901)
నిఫ్టీ : 24,484 (271)
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.150 తగ్గి రూ.81,150 లకు చేరుకున్నది.
బిట్‌కాయిన్ మళ్లీ ఊపందుకున్నది. ట్రేడింగ్‌లో 75 వేల డాలర్ల మార్క్ అందుకున్నది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విక్టరీతో.. క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకున్నది.
ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ మారకపు రేటు మునుపెన్నడూ లేనివిధంగా 84.31 స్థాయికి దిగజారింది.
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఎఫెక్ట్.. 14 శాతం పెరిగిన టెస్లా షేర్లు..ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కీలక పాత్ర..
SPORTS NEWS
డేవిస్ కప్ ఫైనల్స్‌తో స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తన సుదీర్ఘ కెరీర్ ముగించనున్నాడు. అతడి ఆఖరి పోరును చూసేందుకు టెన్నిస్ స్టార్లు తరలి రానున్నారు.
కొద్దిరోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్.. తొలిసారి ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగులలో జో రూట్, కేన్ విలియమ్సన్ తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉండగా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఒక ర్యాంక్ దిగజారి 4వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. బౌలర్ల జాబితాలో రబాడా అగ్రస్థానంలో కొనసాగుతుండగా హెజిల్‌వుడ్, బుమ్రా, కమిన్స్, అశ్విన్, జడేజా టాప్-6లో ఉన్నారు.
EDUCATION & JOBS UPDATES
నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు.
ఓయూలో ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫలితాలపై రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం