TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 06 – 11 – 2024

BIKKI NEWS (NOV. 06) : TODAY NEWS IN TELUGU on 6th NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 6th NOVEMBER 2024

TELANGANA NEWS

తెలంగాణ రాష్ట్రం లో కులగణన దేశానికే ఆదర్శం – రాహుల్ గాంధీ

11 నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లో 36 మంది రెసిడెన్షియ‌ల్ విద్యార్థులు మృతి : హ‌రీశ్‌రావు

నా తెలంగాణ కోటి రతనాల వీణ… అని నినదించిన తెలంగాణ కవి రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి సేవలను స్మరించుకున్నారు.

రాహుల్ గాంధీకి ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా? : బండి సంజయ్‌

తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ వాయిదా. నవంబర్ 7 న పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.

ఇందిరా పార్కు వద్ద ఆటో వర్కర్స్ ధర్నా – పాల్గొన్న కేటీఆర్

వరంగల్‌ భద్రకాళి ఆలయంలో నాణ్యతతో కూడిన ప్రసాదాల తయారీపై భారత ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థ ‘ఈట్‌ రైట్‌ ప్లేస్‌’ సర్టిఫికెట్‌ను ప్రదానం చేసింది.

జనవరి నుంచి అర్హులైన వారందరికీ సన్న బియ్యం పంపిణీ – మంత్రి ఉత్తమ్

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఏఎన్‌రెడ్డి కాలనీలో గల గ్రిల్‌ నైన్‌ మల్టీ కుజైన్‌ రెస్టారెంట్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురైన యువతి ఫూల్‌ ఖలీ బైగా మృతి చెందింది

ANDHRA PRADESH NEWS

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.

2028 మార్చి వరకు పోలవరం పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు. చంద్రబాబు

రాష్ట్రంలో సార్వత్రిక క్యాన్సర్ పరీక్షలు ప్రారంభించాలని సీఎం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ప్రధాని మోదీని కోరారు.

సోషల్‌మీడియా వారియర్స్‌ కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.. వైసీపీ కీలక నిర్ణయం

సరస్వతి సిమెంట్‌ భూములపై విచారణ చేపట్టాలి : పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు.

అర్చకుల కనీస వేతనం పెంపు

రాజకీయ ఒత్తిళ్లతో కాదు.. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం.. ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

పనన్ ఆగ్రహం ఎందుకో తెలుసు.. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు

నేడే ఏపీ మెగా డీఎస్సీ . మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది.

NATIONAL NEWS

నవంబర్ 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. ప్రకటించిన కేంద్రం

ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనం కుదరదు.. చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన ‘సుప్రీం’..

యూపీ మదర్సా చట్టం రాజ్యంగబద్దమే – సుప్రీం కోర్టు

భారత్ బ్రాండ్ గోధుమ పిండి కిలో 30 రూపాయలకే అందుబాటులోకి

గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రారంభం. 43 నుంచి 28 కి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య

ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం.. అత్యవసరమైతే బయటకు రావొద్దని సూచన..

కచ్చితత్వంలేని సమాచారం.. వికీపీడియాకు కేంద్రం నోటీసులు

ముడా స్కామ్‌లో లోకాయుక్త నోటీసులు.. విచారణకు హాజరవుతానన్న సీఎం సిద్ధరామయ్య

INTERNATIONAL NEWS

ప్రశాంతంగా ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు. కౌంటింగ్ ప్రారంభం.

భారతీయ అమెరికన్‌ ఆస్ట్రోనాట్‌తో సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌విల్మోర్‌, నిక్‌ హేగ్‌, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్రూ క్రాఫ్ట్‌లో ఉన్నారు. ఈ నలుగురు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమిపైకి చేరుకోనున్నారని అంచనా

BUSINESS NEWS

లాభాపడిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 79,477 (694)
నిఫ్టీ : 24,213 (218)

టాటా సన్స్‌లోకి అడుగుపెట్టిన నోయల్‌ టాటా.. అధికారికంగా ప్రకటించిన బోర్డు

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.200 వృద్ధితో రూ.81,300లకు చేరుకుంది.

SPORTS NEWS

న‌వంబ‌ర్ 24, 25వ తేదీల్లో 18వ సీజన్ ఐపీఎల్ వేలం జెడ్డా వేదికగా జ‌రుగ‌నుంది.

ఆఫ్రో – ఆసియా క‌ప్ భార‌త్, పాకిస్థాన్ క్రికెట‌ర్లు ఒకే జ‌ట్టు త‌ర‌ఫున ఆడే వీలున్న ఈ క‌ప్‌ను నిర్వ‌హించేందుకు ఆఫ్రికా క్రికెట్ సంఘం సిద్ధ‌మ‌వుతోంది.

భార‌త‌ ఫుట్‌బాల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ క‌ల‌క‌లం.. మిజోరం ప్రీమియ‌ర్ లీగ్‌ లో 24 మందిపై నిషేధం.

ఒలింపిక్స్ క్రీడల నిర్వ‌హ‌ణ‌కు మేము సిద్ధం అంటూ ఐఓసీకి భార‌త ఒలింపిక్ సంఘం లేఖ.

EDUCATION & JOBS UPDATES

నేడే ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల & దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ ఇంట‌ర్ ఎగ్జామ్ ఫీజు తేదీలను ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు విద్యార్థులు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు.

తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ వాయిదా. నవంబర్ 7 న పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.

ఓయూలో ఎంబీఏ(టీఎం), ఎంబీఏ (ఈవినింగ్‌) ప్రవేశాల గడువు పొడగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ లో 606 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కి ప్రకటన, విజయవాడ, కర్నూలు జోన్ లలో భర్తీ.

CAT 2024 అడ్మిట్ కార్డులు విడుదల

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు