BIKKI NEWS (DEC 06) : TODAY NEWS IN TELUGU on 6th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 6th DECEMBER 2024
TELANGANA NEWS
రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించింది.
పంచాయతీల విలీనంపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ
మధ్యాహ్న భోజనం వికటించిన పాఠశాలల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని పెట్టితీరాలని తేల్చి చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నది.
బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావారణశాఖ వెల్లడించింది.
ANDHRA PRADESH NEWS
అవినీతి విచ్చలవిడిగా పెరిగింది.. బాబు పాలనపై మాజీ సీఎం జగన్ విమర్శలు..
బియ్యం అక్రమ రావణాపై సీఐడీ విచారణ
ఏపీ హైవేలపై 18 ప్లైఓవర్ల నిర్మాణం – గడ్కారీ
1200 మంది MPHA లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 1 నుండి పరీక్షలు
NATIONAL NEWS
ప్రోబా-3 మిషన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ59 వాహకనౌక ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది
ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన వంద నగరాల జాబితా-2024లో భారత్ నుంచి ఢిల్లీ స్థానం పొందింది.
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం.. డెప్యూటీ సీఎంలుగా షిండే, పవార్
రోడ్డు ప్రమాదాల్లో ఏడాదిలో 1.68లక్షల మంది దుర్మరణం.. నితిన్ గడ్కరీ
ఢిల్లీలో మెరుగుపడిన గాలి నాణ్యత.. 165గా ఏక్యూఐ లెవల్స్
INTERNATIONAL NEWS
ఫ్రాన్స్ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని మిషెల్ బార్నియర్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు నెలల్లోనే కూలిపోయింది.
కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో అంతుచిక్కని ఓ వింత వ్యాధి దాదాపు 150 మందిని బలిగొంది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) చీఫ్‌గా ఎలాన్ మస్క్ వ్యాపార సన్నిహితుడు, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మన్‌ను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
8.5 లక్షల కోట్లతో ప్రైవేటు అంతరిక్ష కేంద్రం చేసే బాధ్యతను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ తీసుకుంది.
BUSINESS NEWS
ఐదో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 81,765.86 (809.53)
నిఫ్టీ : 24,708.40 (240.95)
బిట్‌కాయిన్ తాజాగా లక్ష డాలర్లకు చేరుకున్నది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని నేడు ప్రకటించబోతున్నది.
SPORTS NEWS
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి ఆడిలైడ్ లో భారత్ ఆసీస్ ల మద్య రెండో టెస్ట్ (డే/నైట్)
భారత్ కచ్చితంగా పతకాలు సాధిస్తుందనుకున్న షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, హాకీ లాంటి క్రీడాంశాలను యూత్ ఒలింపిక్స్ 2026 నుంచి తీసేశారు.
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో గురువారం డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, దొమ్మరాజు గుకేశ్ మధ్య జరిగిన తొమ్మిదో రౌండ్ కూడా డ్రాగా ముగిసింది.
చాంపియన్స్ ట్రోఫీ (2025) ని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమైంది.
EDUCATION & JOBS UPDATES
ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 1 నుండి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నది.
SSC CGLE టైర్ – 1 ర్యాంక్ కార్డులు విడుదల
RRB అసిస్టెంట్ లోకో ఫైలెట్ పరీక్ష కీ విడుదల
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్