BIKKI NEWS (DEC 05) : TODAY NEWS IN TELUGU on 5th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 5th DECEMBER 2024
TELANGANA NEWS
తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఉదయం 7.27 నిమిషాలకు.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతో భూకంపం సంభవించింది.
మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది: ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్టులు
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు తో లక్షల్లో ఉద్యోగాలు – సీఎం రేవంత్
ఈ నెల 9 నుంచి సమావేశాలు.. నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్
ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 2500 ఇవ్వాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తు కోసం యాప్ ప్రారంభం.
ANDHRA PRADESH NEWS
ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది.
చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన తేదీలను ఖరారు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేయాలని నాయకులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల బీమా పునరుద్దరణ, రూ. 20 వేల పెట్టుబడి సాయం, డిసెంబర్ 27న పెంచిన కరెంటు ఛార్జీలపై , జనవరి 3న ఫీజు రియింబర్స్‌మెంట్ అంశంపై ఆందోళనలు చేపట్టాలని సూచించారు.
NATIONAL NEWS
ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సును మార్చే ప్రతిపాదన ఏదీ తమవద్ద లేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
ఎల్‌ఏసీలో ఇంకా చైనాతో కొన్ని భూభాగాలపై విభేదాలు ఉన్నాయని.. ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామని జైశంకర్ పేర్కొన్నారు.
గూండా, సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కఠినంగా ఉందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.
దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో కలిసి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని కోరారు.
ప్రోబా3లో సాంకేతిక లోపం.. పీఎస్ఎల్వీ సీ59 ప్రయోగం నేటికీ వాయిదా
పంజాబ్ మాజీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై.. బుధవారం ఉదయం అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో కాల్పులు జరిపారు.
ప్రయాణికులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఇక నుంచి రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని ప్రకటించింది.
రైళ్ల రాకపోకలలో మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం జరిగినా, దారి మళ్లించినా ప్రయణికుడు కోరితే పూర్తి టికెట్ చార్జీలను వాపసు ఇస్తారు.
కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడం ప్రోబా-3 మిషన్ యొక్క లక్ష్యం.
‘ద స్కేలర్ థ్రెట్ ల్యాబ్జ్-2024’ తాజా నివేదిక ప్రకారం మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ టాప్‌లో నిలిచింది.
బీఫ్ వడ్డన, వాడకంపై నిషేధం విధించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది.
INTERNATIONAL NEWS
ఈశాన్య సెర్బియాపైకి గ్రహశకలం భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. కేవలం 27 ఇంచుల సైజులో, 70 సెంటీమీటర్ల వ్యాసంతో ఉన్న ఈ గ్రహశకలానికి కొవెప్‌సీ5గా నామకరణం చేశారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 80,956.33 (110.58)
నిఫ్టీ : 24,467.45 (10.30)
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు కోల్పోయి 84.75 వద్దకు పడిపోయింది
యూపీఐ లైట్ వాలెట్ పరిమితి రూ.5వేలకు పెంచిన ఆర్‌బీఐ
SPORTS NEWS
ఐసీసీ టెస్ట్ ర్యాంకులలో బౌలింగ్ విభాగంలో బుమ్రా, బ్యాటింగ్ లో జో రూట్ మొదటి స్థానంలో నిలిచారు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కొత్త బాధ్యతలు చేపట్టారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆసియాకప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇండియా-19 జట్టు 10 వికెట్ల తేడాతో యూఏఈ జట్టుపై విజయం సాధించింది
చెస్ ప్రపంచ చాంపియన్స్ షిప్ లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, దొమ్మరాజు గుకేశ్ మధ్య బుధవారం ఎనిమిదో రౌండ్ పోరు ఎలాంటి ఫలితం లేకుండానే డ్రాగా ముగిసింది.
EDUCATION & JOBS UPDATES
TGPSC జూనియర్ లెక్చరర్ బోటనీ, జువాలజీ, తెలుగు, హిందీ తుది ఫలితాలు విడుదల
కేంద్ర సాయుధ బలగాలలో లక్ష ఉద్యోగ ఖాళీలు
తెలంగాణ డీఈఈసెట్ రెండో విడత కౌన్సెలింగ్ నేటి నుండి ఆరంభం.
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 90 రోజుల ప్రణాళిక
డిగ్రీ కోర్సుల సిలబస్‌ను సమగ్రంగా మార్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది.
ENTERTAINMENT UPDATES
ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పుష్ప – 2 సినిమా
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మాక్స్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా నటించనున్నారు
‘నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్’ టైటిల్‌ను తెలంగాణకు చెందిన బాలిక హన్సిక నసనల్లి విజేతగా నిలిచింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్