TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 08 – 2024

BIKKI NEWS (AUG 05) : TODAY NEWS IN TELUGU on 5th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 5th AUGUST 2024

TELANGANA NEWS

వచ్చే ఏడాది మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్‌ ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి జరగాలి : భట్టి

నేటి నుండి స్వచ్ఛందనం – పచ్చదనం నిర్వహణ.

ఔషధ రంగం మొత్తం ఎగుమతుల్లో 32 శాతంతో తెలంగాణ రాష్ట్రం అన్నింటికన్నా ముందున్నట్టు ఆర్థిక సర్వే వెల్లడించింది.

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. శాసనసభలో ఇటీవలి పరిణామాలపై కేసీఆర్‌ ఆరా తీశారు.

వర్కింగ్ జర్నలిస్టులకు వేజ్‌బోర్డును పునరుద్ధరించాలన్న ఐజేయూ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

నేటినుంచి సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల.

ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్లు అన్ని తెలంగాణ వారికే.

ANDHRA PRADESH NEWS

మార్చికల్లా దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు.. కేంద్ర మంత్రి పెమ్మసాని.

ఏ షరతుకైనా కట్టుబడి ఉంటా.. బెయిల్‌ ఇవ్వండి.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిక్వెస్ట్‌.

నంద్యాల జిల్లాలో వైసీపీ నేత హత్య.. పోలీసుల వైఫల్యమే కారణమని ఆధారాలు బయటపెట్టిన వైసీపీ.

కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం.

NATIONAL NEWS

తప్పుడు కేసులో కేజ్రీవాల్‌ను జైలుకు పంపిన మోదీ : సునీతా కేజ్రీవాల్‌.

లాలూ, నితీష్‌, బీజేపీ నుంచి బిహారీలకు విముక్తి : జన్‌ సురాజ్‌ పార్టీ ఏర్పాటుపై ప్రశాంత్‌ కిషోర్‌

నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు.. బైక్‌పై పారిపోయిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.

లవ్‌ జిహాద్‌ కేసుల్లో యావజ్జీవ ఖైదు విధించేలా నూతన చట్టం : హిమంత బిశ్వ శర్మ.

దేశ మద్య, పశ్చిమ ప్రాంతాల్లో కుంభవృష్టి

INTERNATIONAL NEWS

వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం అంతం అయ్యే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని పరిశోధకులు హెచ్చరించారు. 2050 తర్వాత వచ్చే 6 వేల ఏండ్లలో వరుస విపత్తులు ఎప్పుడైనా మొదలవ్వొచ్చని వారు వెల్లడించారు.

గత 24 గంటల వ్యవధిలో రష్యాపై దీర్ఘ శ్రేణి క్షిపణి దాడులు చేశామని, ఆ దేశానికి చెందిన ఒక జలాంతర్గామిని ముంచేశామని, ఓ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని ఉక్రెయిన్‌ సైనిక అధికారులు వెల్లడించారు.

వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో బ్రిటన్‌ అట్టుడుకున్నది.

బంగ్లాదేశ్‌లో ఆందోళనలు.. 100 మంది మృత్యువాత.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన సర్కారు..

బ్రహ్మపుత్ర నది పై చైనా భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సిద్ధం. భారత్ కు ప్రమాద ఘంటికలు.

BUSINESS NEWS

ఈ వారం స్టాక్ మార్కెట్ లో ఒడిదొడుకులకు ఎక్కువగా ఆస్కారం కనిపిస్తున్నది.

ఈవీ చార్జింగ్ సమస్యకు తెర పడినట్లే… కేవలం తొమ్మిది నిమిషాల్లోనే చార్జింగ్.. 1000 కి.మీ దూరం ప్రయాణం..

గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ గైడ్ వారెన్ బఫెట్ సారధ్యంలోని బెర్క్ షైర్ హాత్ వే సంస్థ.. గ్లోబల్ టెక్ జెయింట్ ఆపిల్’లో దాదాపు సగం వాటాను విక్రయించింది.

సఫారీ, హారియర్ కార్లపై టాటా మోటార్స్ డిస్కౌంట్లు.. రూ.1.65 లక్షల వరకూ ఆఫర్లు..

SPORTS NEWS

హాకీలో సెమీస్‌ చేరిన భారత్‌. క్వార్టర్స్‌లో బ్రిటన్‌పై సంచలన విజయం. షూటౌట్‌లో తేలిన ఫలితం.

పారిస్ ఒలింపిక్స్ లో 100 మీటర్ల పురుషుల పరుగులో నోవా లైల్స్ (అమెరికా) బంగారు పథకం సాదించాడు. అతను 9.79 సెకండ్ లలో గమ్యం చేరాడు.

ఒలింపిక్స్‌లో పురుషుల సెమీస్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా నిలిచిన లక్ష్యసేన్‌.. 20-22, 14-21తో విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్నార్క్‌) చేతిలో ఓడాడు. కాంస్య పథకం కొరకు నేడు పోరు.

క్వార్టర్స్‌లోనే లవ్లీనా బోర్గహైన్ నిష్క్రమణ.

పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌లో జొకోవిచ్‌ 7-6 (7/3), 7-6 (7-2)తో అల్కారజ్‌ను చిత్తు చేసి తన కెరీర్‌లో తొలిసారి ఒలింపిక్స్‌ పసిడిని ముద్దాడాడు.

రెండో వన్డే లో శ్రీలంక చేతిలో టీమిండియా ఘోర ఓటమి.

EDUCATION & JOBS UPDATES

రాష్ట్రంలో 423 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలుంటే వీటిలో ఫస్టియర్‌ సీట్ల సంఖ్య 1.75లక్షల పైమాటే. ఈ ఏడాది ఇప్పటివరకు 80వేల సీట్లు మాత్రమే నిండాయి.

పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీలో భాగంగా ఇంటర్నల్‌ స్లైడింగ్‌ ద్వారా సీట్లు మార్చుకున్న విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తుంది. ఆగస్ట్ 6,7 వ తేదీలలో పాలిటెక్నిక్ లో స్లైడింగ్ ఆప్షన్.

ఆగస్టు 8 నుంచి తెలంగాణ పాలిసెట్‌ స్పాట్‌ అడ్మిషన్లు.

ఏపీ టెట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు.. అక్టోబర్‌ 3 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు.

ఉపాధ్యాయులు పుస్తకాలలో తప్పులు ఉంటే చెప్పండి – NCERT

ENTERTAINMENT UPDATES

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్ సౌత్‌ 2024 లో ఉత్తమ చిత్రం బలగం, ఉత్తమ నటీనటులు నాని & కీర్తి సురేష్.

అగ్రనటుడు చిరంజీవి నటిస్తున్న సోషియోఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వంభర’ క్లైమాక్స్‌ విజువల్‌ వండర్‌గా వుండబోతున్నదని, ఈ సీక్వెన్స్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్‌ హైలైట్‌ కానున్నాయని వశిష్ఠ తెలిపారు.

వందేళ్ల క్రితం జరిగిన కథ ‘తంగలాన్‌’. ఇదొక అడ్వంచరస్‌ మూవీ. పా రంజిత్‌ తన ఆర్ట్‌ ఫామ్‌లో అందంగా తెరకెక్కించాడు – విక్రమ్

వయనాడ్ విషాదం.. రూ.1 కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్. బ‌న్ని త‌న వంతు సాయంగా రూ.25 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు.

భారతీయుడు – 2 నెట్‌ఫ్లిక్స్‌లో ఆగ‌ష్టు 09 నుంచి తెలుగు, తమిళం, మ‌లయాళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు