BIKKI NEWS (SEP. 04) : TODAY NEWS IN TELUGU on 4th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 4th SEPTEMBER 2024
TELANGANA NEWS
ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ విద్యా కమిషన్’ను ఏర్పాటు చేసింది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా సిటీ ఉన్నదో లేదో చెప్పాలని, దీనిపై 6 లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది
ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ర్టానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు.
నాన్ రెగ్యులర్ స్టాఫ్, అదనపు స్టాఫ్, పార్ట్‌టైమ్, గెస్ట్ ఫ్యాకల్టీతోపాటు గౌరవ వేతనం కింద సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే తొలగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి వర్షిణి ఆదేశించారు.
రాష్ట్రంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాసటగా నిలిచారు. ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామని ఉద్యోగుల జేఏసీ సంఘాలు మంగళవారం ప్రకటించాయి.
రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసిన విధంగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున అందించాలని కేటీఆర్ గుర్తుచేశారు.
రాష్ట్రంలో వర్షాల వల్ల 32 జిల్లాల్లో 587 రహదారులకు భారీగా నష్టం జరిగింది. ఒక వంతెన సహా 82రోడ్లు వరదలకు కొట్టుకుపోయాయి.
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఔటర్ పరిధిలోని 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ కాంగ్రెస్ సర్కారు ఆర్డినెన్స్.
ఆకేరు వాగుపై వంతెన నిర్మిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
ANDHRA PRADESH NEWS
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది.
ఏపీలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. కృష్ణా నది వరదలు కూడా తగ్గింది. దీంతో బుడమేరు ఉధృతికి నీట మునిగిన సింగ్‌నగర్ ప్రాంతంలో మూడు అడుగల మేర వరద ఉధృతి తగ్గింది. దీంతో ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు వస్తున్నారు.
ఎవరి శక్తి మేర వాళ్లు బాధితులకు సాయం చేయండి.. ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు
NATIONAL NEWS
మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదను అరికట్టడానికి యూపీలోని యోగి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది.
ఆర్‌జీ కర్ దవాఖానలో పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారంతో దేశమంతా అట్టుడుకడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్’ను శాసనసభలో ప్రవేశపెట్టింది.
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) మరోసారి గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. క్రోమ్ బ్రౌజర్‌లో భారీగా బగ్స్ ఉన్నాయని.. వాటితో యూజర్లు హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా బగ్‌ల బారినపడకుండా ఉండేందుకు పలు సూచనలు చేసింది.
కర్ణాటక డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్నది. ఈ క్రమంలో డెంగ్యూని ఎపిడెమిక్‌గా ప్రకటించింది. దీంతో పాటు కర్ణాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020ని సవరించేందుకు నియమాలను రూపొందించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు దుర్గేష్ పాఠక్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 11న విచారణ జరుగనున్నది.
INTERNATIONAL NEWS
రష్యా సైన్యం వరుస క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నది. ఉక్రెయిన్ తూర్పు మధ్య ప్రాంతంలోని పోల్టావా పట్టణంపై రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని రష్యా తాజాగా ప్రయోగించింది.
72 మంది అపరిచితులతో తన భార్య(72)పై పదేండ్లపాటు లైంగిక దాడి చేయించిన ఓ భర్త అకృత్యం ఫ్రాన్స్‌లో కలకలం రేపుతున్నది. సోమవారం ఈ కేసు విచారణ ప్రారంభమైంది
భూమి నుంచి చూసే వారికి 2025 మార్చి నాటికి శనిగ్రహం చుట్టూ ఎలాంటి వలయాలు కనిపించవని తెలిపారు. మూడు దశాబ్దాలకు ఒకసారి జరిగిన ఖగోళ మార్పు వల్ల ఈ వలయాలు కనిపించకుండా పోతాయని చెప్పారు
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో జైలును బద్దలు కొట్టి తప్పించుకునేందుకు యత్నం.. తొక్కిసలాటలో 129 మంది ఖైదీలు మృతి
7000 కార్లు ఉన్న బ్రూనే సుల్తాన్.. ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పేందుకు రెఢీ
షేక్ హసీనాపై మరో ఐదు హత్య కేసులు నమోదు
BUSINESS NEW
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 82555 (-4)
నిఫ్టీ : 25280 (-1)
కర్నాటకకు వెళ్తున్న కేన్స్ కంపెనీని ఒప్పించి తెలంగాణకు వచ్చేలా చేస్తే.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడుకోలేకపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి ఐదు కొత్త గనులు.. ఇకపై రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి.
గృహస్తుల సేవింగ్స్ పెరుగుతున్నాయ్.. ఆర్బీఐ డిప్యూటీ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో 7 శాతం వృద్ధి.. వరల్డ్ బ్యాంక్ తాజా అంచనా
ఇక జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ట్రాఫిక్ ట్రాకింగ్..! ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం..
ఆర్బీఐ రిపోర్ట్ – భారీగా పెరిగిన పర్సలోన్స్..! హౌసింగ్ లోన్స్‌కు తగ్గిన డిమాండ్..!
ఐఐటీ బాంబే విద్యార్ధులకు బంపర్ ఆఫర్ : 22 మందికి రూ కోటికి పైగా వేతన ప్యాకేజ్
SPORTS NEWS
రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు ఐదో రోజు ఆటలో పర్యాటక జట్టు విజయానికి 143 పరుగులు (లక్ష్యం 185) అవసరం ఉండగా బంగ్లా బ్యాటర్లు 56 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చారిత్రాక విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో 2- 0 తేడాతో సిరీస్ గెలుచుకున్నారు.
యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్స్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), డేనియల్ మెద్వెదెవ్ (రష్యా) క్వార్టర్స్‌లో తలపడబోతున్నారు.
యూఎస్ ఓపెన్‌లో భారత ఆటగాడు బోపన్న మిక్స్‌డ్ డబుల్స్‌లో సుజియాదితో కలిసి సెమీస్ చేరాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త సెలెక్టర్‌గా అజయ్ రాత్రా ఎంపికయ్యాడు.
ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ అక్టోబర్ 18న మొదలు కానుంది.
పారాలింపిక్స్‌లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ కాంస్యం సాదించింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెం(టీ20)లో దీప్తి.. 55.82 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో సత్తా చాటింది.
EDUCATION & JOBS UPDATES
పోలీసు అకాడమీలో 12 నెలలపాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 547 మంది ఎస్సై అభ్యర్థులకు 9న పాసింగ్ ఔట్ పరేడ్‌ను నిర్వహించనున్నారు.
డిగ్రీ ఫస్టియర్‌లోని ఖాళీ సీట్ల భర్తీకి స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేశారు. కౌన్సెలింగ్ బుధవారం నుంచే ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు
ENTERTAINMENT UPDATES
తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. రూ.కోటి విరాళం ప్రకటించిన ఎన్టీఆర్
బాలకృష్ణ వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు
మహేష్ బాబు వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.