TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04 – 07 – 2024

BIKKI NEWS (JULY 04) : TODAY NEWS IN TELUGU on 4th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 4th JULY 2024.

TELANGANA NEWS

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. బదిలీలపై నిషేధం ఎత్తివేత. జూలై 20 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి అయ్యోలా షెడ్యూల్.

గ్రూప్ – 1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక – TGPSC

నేడు ప్రధానమంత్రి తో సీఎం రేవంత్ భేటీ కానున్నారు

ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉండాలి. – మాజీ సీఎం కేసీఆర్

మండల ప్రజా పరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ.

వివిధ కారణాలతో వీఆర్ఏలుగా మిగిలిపోయిన 154 మందికి వివిధ శాఖలలో ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ.

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ, పిసిసి పదవి భర్తీ, నామినేటెడ్ పోస్టులు భర్తీ ప్రస్తుతం లేనట్లే

వానకాలం సీజన్లో ఇప్పటికీ 46 లక్షల ఎకరాలలో సాగు ప్రారంభమైంది.


ANDHRA PRADESH NEWS

అమరావతి పై శ్వేత పత్రం విడుదల. అమరావతిని బంగారం చేస్తాం – సీఎం చంద్రబాబు

జగన్ పై కేసులను ఇక రోజు వారి విచారించాలని సిపిఐ కోర్టు కి హైకోర్టు ఆదేశం.

నేడు ప్రధానమంత్రి తో చంద్రబాబు భేటీ

NATIONAL NEWS

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ రాజీనామా.

బీహార్లో ఒకేరోజు 3 వంతెనలు కుప్పకూలాయి. దీంతో ఇలాంటి ఘటనలు గత 15 రోజుల్లో 9 కి చేరాయి.

త్వరలోనే విమానం తరహా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తాం. – కేంద్రమంత్రి గడ్కరి

హథ్రాస్ గతంలో మృతుల సంఖ్య 121 కి చేరింది. ఈ అంశంపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.

రాహుల్ గాంధీ నివాసం వద్ద భద్రతా సిబ్బంది పెంపు.

NCEAR నివేదిక ప్రకారం 2022 – 24 లో భారతదేశంలో పేదరికం 8.5%.

మణిపూర్ ప్రశాంతంగా ఉంది. రాజ్యసభలో ప్రధాని మోడీ. విపక్షాలు వాకౌట్.

INTERNATIONAL NEWS

ఇజ్రాయిల్ దాడిలో హిజుబుల్లా కమాండర్ మహ్మద్ నామేహ్ నజీర్ మృతి

కరేబియన్ ద్వీపాలను బెంబేలెత్తిస్తున్న బెరిల్ తుఫాన్

నేడు బ్రిటన్ లో ఎన్నికలు. ప్రధాని రిషి సునాక్ పార్టీకి ఎదురుగాల అన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా.

BUSINESS NEWS

80 వేల మైలురాయి ని తాకిన సెన్సెక్స్.

సెన్సెక్స్ : 79,987 (+545)
నిప్టీ : 24,287 (+163)

మధుపర్ల సంపద 445 లక్షల కోట్లకు చేరిక

Koo app మూసేస్తున్నట్లు ప్రకటించిన సంస్థ యజమాన్యం

పదిలక్షల కోట్లకు చేరిన ఆహార సేవల మార్కెట్

SPORTS NEWS

నేడు ప్రధాని నరేంద్ర మోడీతో టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా భేటీ కానుంది.

అలాగే ముంబైలో టీమిండియా ఈరోజు రోడ్ షో నిర్వహించనుంది.

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టి20 ర్యాంకింగ్ లలో ఆల్ రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా మొదటి స్థానంలో నిలిచాడు.

యూరో కప్ క్వార్టర్స్ లో తీర్కియో. ఆస్ట్రియా పై విజయం.

వింబుల్డన్ – రూడ్ రెండో రౌండ్ లోనే ఇంటిముఖం

EDUCATION & JOBS UPDATES

నేటి నుండి తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్.

బాసర ట్రిబుల్ ఐటీ మొదటి విడత సీట్ల కేటాయింపు. జూలై 8 నుండి 10వ తేదీ వరకు కౌన్సిలింగ్.

ఆర్టీసీలో ఉద్యోగాల నియామక ప్రక్రియను మూడు బోర్డులకు అప్పగించనున్న ప్రభుత్వం టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ లు ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నాయి.

సంక్షేమ గురుకులాలకు ఉమ్మడి టైం టేబుల్

త్వరలో CUET UG ఫలితాల తేదీని వెల్లడిస్తాం. – యుజిసి చైర్మన్ జగదీష్ కుమార్

ENTERTAINMENT UPDATES

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో చేయనున్న సినిమా సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనుంది.

వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో మూడో చిత్రం ఇప్పటికే F2, F3 తో ప్రేక్షకాధరణ పొందిన అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబినేషన్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు