BIKKI NEWS (DEC 04) : TODAY NEWS IN TELUGU on 4th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 4th DECEMBER 2024
TELANGANA NEWS
50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఓఆర్‌ఆర్‌కు అనుబంధంగా ముచ్చర్లలో నిర్మిస్తామని చెప్పారు.
ఏటూరునాగారం సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తోపాటు తదనంతరం చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో తమ్ముడి రిమాండ్
రాష్ట్రంలోని బీటెక్ మేనేజ్‌మెంట్ కోటా ఫీజులను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. బీ-క్యాటగిరీ కోటా ఫీజులను కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకు అదనంగా మూడు రెట్లు పెంచే అవకాశముంది.
తెలంగాణ మరువని అమరుడు శ్రీకాంతాచారి అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు.
ఈ నెల 7న వాహన బంద్ జరిపేందుకే తెలంగాణ ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ జిల్లాల వారీగా బహిరంగ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా 53 టెలీమానస్ కేంద్రాలు మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడుతున్న వారికి సాయం అందిస్తున్నాయని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
హరీశ్‌రావుపై కేసు అప్రజాస్వామికం.. ఖండించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ANDHRA PRADESH NEWS
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం – లోకేష్
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
ముఖ్యంగా సమీకృత పర్యాటక 2024-29 కి ఆమోదం తెలిపింది.
స్పోర్ట్స్ పాలసీలోమార్పులకు ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏ (CRDA) ఆమోదించిన 23 అంశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు, ఏపీ టెక్ట్స్‌టైల్,ఏపీ మారిటం, డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మారణ దినోత్సవాన్ని జరుపడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
బియ్యం అక్రమ రవాణాలో నా వియ్యంకుడికి సంబంధం లేదు – మంత్రి పయ్యావుల
ఏపీలో పుష్ప-2 బెనిఫిట్ షోకు అనుమతి.. పెంచిన ధరలు ఈనెల 17 వరకు
NATIONAL NEWS
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైంది. ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ నియమితులు కానున్నట్టు తెలుస్తున్నది.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సోలాపూర్ జిల్లాలోని మర్కడ్వాడి గ్రామ ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎం ఓటింగ్‌పై అపనమ్మకం వ్యక్తం చేస్తూ గ్రామంలో ఈసారి బ్యాలెట్ పేపర్ ద్వారా మంగళవారం రీ పోలింగ్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
బంగ్లాదేశ్‌లోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు మంగళవారం సమన్లు జారీ చేసింది.
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్స్ నియామకాలకు సంబంధించిన కమిటీ నుంచి సీజేఐని మినహాయించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు లో పిల్ దాఖలైంది.
కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయ చట్టాల అమలును ఆయన జాతికి మోడీ అంకితం చేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియమ్ చట్టాలను జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
భారత్‌లో వేగంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు 2050 నాటికి 1.29కు తగ్గనున్న ఫెర్టిలిటీ రేట్.
INTERNATIONAL NEWS
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు.
తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు.
భూమితో పోల్చినప్పుడు చంద్రుడిపై సమయం వేగంగా గడుస్తున్నదని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 80,845.75 (597.67)
నిఫ్టీ : 24,457.15 (181.10)
ట్రాఫిక్ సోల్ కు షాక్.. ఐపీఓ రద్దు.. ఇన్వెస్టర్ల సొమ్ము వాపస్ చేయాలని ఆర్డర్ వేసిన సెబీ
ఇంకా ప్రజల వద్దే రూ.6,839 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు : ఆర్బీఐ
శంషాబాద్ ఎయిర్‌కార్గోకు ‘టైం క్రిటికల్ లాజిస్టిక్స్ సొల్యుషన్ ప్రొవైడర్ ఆఫ్ ది ఈయర్ విభాగంలో ప్రతిష్ఠాత్మక గోల్టెన్ అవార్డు లభించింది.
SPORTS NEWS
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన ఏడో గేమ్ కూడా డ్రాగా ముగిసింది.
హైదరాబాద్ 57 ఏండ్ల (1967లో చివరి సారిగా) తర్వాత ప్రతిష్ఠాత్మక సంతోశ్ ట్రోఫీ ఫైనల్స్‌కు ఆతిథ్యమివ్వనుంది.
మహిళల అంధుల టీ20 ప్రపంచకప్-2025 భారత్‌లో జరుగనుంది
EDUCATION & JOBS UPDATES
ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం.
వరంగల్ నిట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఏపీపీఎస్సీ మూడు నోటిఫికేషన్ లకు రాత పరీక్ష తేదీలను ప్రకటించింది.
CTET పరీక్ష సిటీ ఇంటిమెషన్ లెటర్స్ విడుదల
అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్