BIKKI NEWS (DEC 03) : TODAY NEWS IN TELUGU on 3rd DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 3rd DECEMBER 2024
TELANGANA NEWS
అటు టెట్.. ఇటు యూజీసీ నెట్ రెండు పరీక్షలు ఒకే తేదీల్లో జరగనున్నాయి. దీంతో టెట్‌ను వాయిదావేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీని వంద శాతం పూర్తి చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
కారుతో ఢీకొట్టి.. కొడవలితో దాడిచేసి.. ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య
జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్లు జారీచేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది.
ములుగు జిల్లా ఎన్‌కౌంటర్ పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, పోలీసులను ఆదేశించిన హైకోర్టు
ANDHRA PRADESH NEWS
పెంగల్ తుఫాన్.. దెబ్బ తిన్న పంటలకు పరిహారం.. అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు
నన్ను జైలుకు పంపితే.. నాలుగు స్టోరీలు రాసుకుంటా.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలపై మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశమైంది.
షర్మిలను రాజకీయ నాయకురాలిగా ఎవరూ చూడట్లేదు.. బొత్స సత్యనారాయణ ఎద్దేవా
NATIONAL NEWS
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్‌సభలో, రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పై వీడని ఉత్కంఠ.
ఔషధాలకు లొంగని వ్యాధికారకాల పని పట్టించే యాంటీబయాటిక్ ‘నఫిత్రోమైసిన్’ను భారత్ తయారుచేసింది
క్రిమినల్ కేసుల్లో బెయిలు దశలోనే సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడి దోషిత్వం లేదా నిర్దోషిత్వం గురించి నిర్ణయించరాదని హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పింది
గగన్‌యాన్ మిషన్ ప్రయోగం 2026 చివర్లో జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు.
ప్రభుత్వం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ పరిషత్(బీకేపీ) చలో డిల్లీ కార్యక్రమం
ప్లాస్టిక్ క్యాన్స్, బాటిల్స్‌లో అమ్మే ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ‘హై-రిస్క్ ఫుడ్’ క్యాటగిరిలో చేర్చుతూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారు.. వెల్లడించిన క్రెమ్లిన్ అధికార ప్రతినిధి.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది
పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ది సబర్మతి రిపోర్ట్ స్క్రీనింగ్.. వీక్షించనున్న మోదీ
INTERNATIONAL NEWS
ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలను ఇవ్వబోమని అమెరికా తేల్చిచెప్పింది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్-2024’ గా బ్రెయిన్ రాట్ (Brain rot) ను ప్రకటించింది.
గత ఏడాది ప్రపంచంలోని 100 భారీ ఆయుధ కంపెనీలు సుమారు రూ.53 లక్షల కోట్ల (632 బిలియన్లు) విలువైన ఆయుధాలను విక్రయించాయని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) వెల్లడించింది.
జో బైడెన్.. తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 80,248.08 (445.29)
నిఫ్టీ : 24,276.05 (144.95)
డాలర్ తో రూపాయి విలువ 12 పైసలు క్షీణించి మునుపెన్నడూ లేనివిధంగా 84.72 వద్దకు పతనమైంది.
ప్రస్తుతం జీఎస్టీ పన్నుల్లో నాలుగు స్లాబ్‌లు ఉండగా, కొత్తగా 35 శాతం రేటును కూడా చేర్చాలని జీవోఎం సూచించింది.
ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.200 పతనమై రూ.79,100లకు చేరుకున్నది. కిలో వెండి ధర రూ.2,200 తగ్గి రూ.90 వేల వద్ద నిలిచింది.
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులతోపాటు శీతలపానియాల పై 28 శాతం జీఎస్టీని 35 శాతానికి పెంచాలని నిర్ణయం
SPORTS NEWS
అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 211 పరుగుల తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది.
ఈ నెల 22న పెళ్ళి చేసుకోనున్న పీవీ సింధు
EDUCATION & JOBS UPDATES
JEE ADVANCED – జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2025 మే 18న నిర్వహించనున్నారు.
తెలంగాణటెట్, యూజీసీ నెట్ పరీక్షలు ఒకే తేదీలలో షెడ్యూల్.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్