TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 31 – 10 – 2024

BIKKI NEWS (OCT. 31) : TODAY NEWS IN TELUGU on 31st OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 31st OCTOBER 2024

TELANGANA NEWS

రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సేకరించే వివరాల కోసం పూర్తిస్థాయి కమిషన్‌ను వెంటనే ఏర్పాటుచేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సంబంధించిన మెస్‌ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనీస్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. బుధవారం ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నవంబర్‌ 30లోపు కులగణన పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. డీఏ 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జూలై ఒకటో తేదీ నుంచి వర్తించనున్నది.

ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీఆర్‌ఎస్‌కు వంద సీట్లు : మాజీ మంత్రి హరీశ్‌రావు

ANDHRA PRADESH NEWS

టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్‌గా బీఆర్‌ నాయుడితో పాటు మరో 24 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష తేదీని ప్రకటించింది. జనవరి 5న గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది

నీతి ఆయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం ఏపీ సీఎం చంద్రబాబుతో బుధవారం భేటీ అయ్యారు.

చంద్రబాబు వస్తే కరువు వస్తుందని అన్నారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి అనివిజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

కరువు మండలాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. 5 జిల్లాల్లో దుర్భర పరిస్థితులు

NATIONAL NEWS

అయోధ్యలో 25 లక్షల దీపకాంతులు.. 1,121 మందితో హారతులతో దీపావళి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ రెండు గిన్నిస్ రికార్డు లోకి ఎక్కాయి.

సిక్కు వేర్పాటువాదులు లక్ష్యంగా తమ దేశంలో హింసాత్మక దాడులు, బెదిరింపులకు భారత హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాలు జారీ చేశారని కెనడా ఉన్నతాధికారి ఒకరు ఆరోపించారు.

ప్రాణాంతక అంటు వ్యాధుల్లో కొవిడ్‌-19ను క్షయ వ్యాధి మించిపోయింది. 2023లో రికార్డు స్థాయిలో 82 లక్షల కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. 2022లో వీటి సంఖ్య 75 లక్షలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన ప్రపంచ క్షయ వ్యాధి నివేదిక, 2024 ఈ వివరాలను వెల్లడించింది.

తమిళనాడు రాజధాని చెన్నై లో కుంభవృష్టి కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ – 3 సీక్రెట్‌గా భారత్‌ పర్యటకు వచ్చినట్లు తెలిసింది.

ఢిల్లీ నుంచి పాట్నా వ‌ర‌కు ఇవాళ వందేభార‌త్ రైలు స్టార్ట్ అయ్యింది. లాంగెస్ట్ వందేభార‌త్ రైలుగా రికార్డుకెక్కింది. 994 కిలోమీట‌ర్లు ఆ రైలు ప్ర‌యాణిస్తుంది.

ఢిల్లీలో అధ్వానస్థితికి గాలి నాణ్యత.. 300కి పడిపోయిన ఏక్యూఐ

INTERNATIONAL NEWS

సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌కు రష్యా కోర్టు ఊహించని షాకిచ్చింది. క్రెమ్లిన్‌ అనుకూల మీడియా అవుట్‌లెట్ల చానళ్లను పునరుద్ధరించేందుకు నిరాకరించిన కేసులో 2.5 డెసిలియన్‌ డాలర్ల (రెండు అన్‌డెసిలియన్‌ రూబుళ్లు) జరిమానా విధించింది. ఇది ప్రపంచ జీడీపీ కంటే అధికం.

అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం మహిళలపై మరో ఆంక్ష విధించింది. ఖురాన్‌ను బిగ్గరగా పఠించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది

ప్రస్తుతం గూగుల్‌ కొత్త కోడ్‌లో 25 శాతం కృత్రిమ మేధ ద్వారానే జనరేట్‌ చేస్తున్నట్టు సుందర్ పిచాయ్ ప్రకటించారు

స్పెయిన్‌లో వరద బీభత్సం. నదులను తలపిస్తున్న గ్రామాలు, 72 మంది మృతి.. పలువురికి గాయాలు. వరదలో కొట్టుకుపోయిన కార్లు.

షెంజౌ-19 స్పేస్‌షిప్‌ను చైనా లాంచ్ చేసింది. లాంగ్‌మార్చ్‌-2ఎఫ్ రాకెట్ ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ముగ్గురు వ్యోమ‌గాముల్ని టియాన్‌గాంగ్ స్పేస్‌స్టేష‌న్‌కు పంపింది.

BUSINESS NEWS

నష్టపోయిన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ : 79,942 (-427)
నిఫ్టీ : 24,341 (-126)

పండుగ రోజుల్లో వంట నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పామాయిల్‌ ధర 37%, ఆవనూనె 29%, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రేట్లు 23% చొప్పున, పల్లి నూనె ధర 2% మేర పెరిగాయి.

ఆర్‌బీఐ బంగారం నిల్వలు 855 మెట్రిక్‌ టన్నులకు చేరాయి.

2024 సెప్టెంబర్ నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి 2 శాతానికి పరిమితమైంది

బంగారం ధరలు దేశీయంగా మరో ఆల్‌టైమ్‌ హైని నెలకొల్పాయి. బుధవారం 99.9 స్వచ్ఛత (24 క్యారెట్‌) కలిగిన గోల్డ్‌ రేటు రూ.82,400 స్థాయిని చేరింది.

SPORTS NEWS

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రాను దాటేసి అగ్రస్థానంలోకి రబాడా

మ‌ళ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ !

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం వేదికగా జరిగిన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ ఖోఖో టోర్నీలో ఆదిలాబాద్‌ విజేతగా నిలిచింది.

EDUCATION & JOBS UPDATES

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను 2025 జనవరి 5న నిర్వహించనున్నారు.

BRAOU – అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ అడ్మిషన్స్ గడువు నవంబర్ 15 వరకు పెంపు.

తెలంగాణ LLM చివరి విడత సీట్లు కేటాయింపు

TGPSC – నవంబర్ 17, 18 తేదీలలో గ్రూప్ – 3 పరీక్ష

AP MEGA DSC – నవంబర్ 6 లేదా 7వ తేదీలలో నోటిఫికేషన్

CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల

ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల పరీక్ష ఫలితాలు విడుదల

ENTERTAINMENT UPDATES

రవితేజ 75వ చిత్రానికి ‘మాస్‌ జాతర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

హనుమాన్ చిత్రానికి సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ లో హనుమాన్‌ పాత్రధారి రిషబ్‌శెట్టి

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార జీవిత జ‌ర్నీపై డాక్యుమెంట‌రీ రూపొందించింది నెట్‌ఫ్లిక్స్‌. దాన్ని న‌వంబ‌ర్ 18వ తేదీన ప్ర‌సారం చేయ‌నున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామని బెదిరింపులు.. బాంద్రాలో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు