Home > CURRENT AFFAIRS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 31 – 08 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 31 – 08 – 2024

BIKKI NEWS (AUG 31) : TODAY NEWS IN TELUGU on 31st AUGUST 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 31st AUGUST 2024

TELANGANA NEWS

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ భూసేకరణపై మళ్లీ అభ్యంతరాలు స్వీకరించాలంటూ నిరుడు ఆగస్టులో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది

రాష్ట్రంలో ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు ఖరారు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

రెండేండ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి, సోనియాగాంధీతో ప్రారంభిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్‌ బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

భారత న్యాయ వ్యవస్థపై నాకు అపారమైన గౌరవం ఉన్నది. సుప్రీంకోర్టు స్వతంత్రతను నేను ప్రశ్నించాననే భావన కలిగించేలా ఈ నెల 29న మీడియాలో కామెంట్లు వచ్చాయని గుర్తించాను. న్యాయవ్యవస్థను నమ్మి, గౌరవించే వ్యక్తిగా.. మీడియాలో వచ్చిన కామెంట్ల పట్ల నేను బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాను. న్యాయ వ్యవస్థ స్వేచ్ఛపై నాకు అపారమైన నమ్మకం ఉన్నది. నేను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రచారం చేశారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఎల్బీనగర్‌ పరిధి సరూర్‌నగర్‌లో మారుతీనగర్‌లో శుక్రవారం హైడ్రా అధికారులు ఓ భవనం కూల్చివేతకు ప్రయత్నించగా కార్పొరేటర్‌ పవన్‌కుమా ర్‌ అడ్డుకున్నారు.

ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లు కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ మరో బుల్డోజర్‌ రాజ్‌ కాకుండా చూడాలని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గేను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు. ఆ దిశగా రేవంత్‌రెడ్డి సర్కార్‌కు సూచించాలని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తన కార్యాచరణను ప్రారంభించింది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ తుది దశకు చేరింది.

మీ సేవ’లో ప్రభుత్వం మరో 9 సేవలను జోడించింది. ఇన్నాళ్లుగా తహసీల్‌ కార్యాలయంలో మాన్యువల్‌గా అందుస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్‌ఏ కార్యాలయం తెలిపింది.

హైదరాబాద్‌లో మరో జూ పార్క్.. వెయ్యి ఎక‌రాల్లో ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆదేశాలు

గ్రూప్ -1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ 21వ తేదీ నుంచి నిర్వ‌హించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లలో నిమ‌గ్న‌మైంది. ఈ నేప‌థ్యంలో గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలంటూ టీజీపీఎస్సీని గ్రూప్స్ అభ్య‌ర్థులు ఆశ్ర‌యించారు.

నా నాలుక‌పై పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయి.. త‌ప్ప‌నిస‌రిగా మంత్రి ఉత్త‌మ్ సీఎం అవుతారు : కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండి : సీఎం రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో కేఏ పాల్‌ పిటిషన్‌

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ లేడీస్‌ హాస్టల్‌లో సీక్రెట్‌ కెమెరాల వ్యవహారం ఆ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

వుమెన్స్ హాస్ట‌ల్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. 300 ఫోటోలు, వీడియోలు లీక్‌.. ఆంధ్రా కాలేజీలో విద్యార్థుల ఆందోళ‌న‌.

మూడు నెలల్లో విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు. – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వైసీపీ నాయకులు ముంబై సినీ నటి జత్వానీపై పోర్జరీ కేసులు పెట్టి ఇబ్బందులపాలు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.

స్మగ్లర్లు అడవుల్లో అడుగుపెడితే.. అదే వారికి చివరి రోజు : ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు.. సెప్టెంబర్ 15 దాకా ఛాన్స్‌

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 26 జిల్లాలకు స్పెషల్‌ ఆఫీసర్లుగా సీనియర్‌ ఐఏఎస్‌లు

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కర్రిపద్మశ్రీ ఎమ్మల్యే కోటా ఎన్నికైన బల్లి కల్యాణ్‌ చక్రవర్తి అనే ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేశారు.

ఆడబిడ్డ తల్లిగా తీవ్ర భయాందోళనకు గురయ్యా.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ ఘటనపై షర్మిల ఆవేదన

జగన్‌ను చంద్రబాబు ఒక్క అంగుళం కూడా తగ్గించలేరు.. మాజీ మంత్రి పేర్ని నాని

NATIONAL NEWS

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్‌ నేత చంపయీ సొరేన్‌ శుక్రవారం బీజేపీలో చేరారు.

అస్సాం శాసనసభ సమావేశాలు జరిగేటపుడు ప్రతి శుక్రవారం ముస్లిం ఎమ్మెల్యేలు నమాజ్‌ చేయడం కోసం సభ కార్యకలాపాలకు రెండు గంటలపాటు విరామం ఇచ్చే నిబంధనను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.

పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం కొత్త సరళీకృత పింఛను దరఖాస్తు ఫారాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ శుక్రవారం ఆవిష్కరించారు. 9 వేర్వేరు ఫారాలను కలిపి, ఒకే ఫారంగా రూపొందించారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కచ్‌ తీరం, పరిసర పాకిస్థాన్‌ ప్రాంతాల్లో ‘అస్నా’ సైక్లోన్‌గా మార్పు చెందిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో ఇటీవల శివాజీ విగ్రహం కూలడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. ‘ఛత్రపతి శివాజీ కేవలం ఒక పేరు లేదా ఒక చక్రవర్తి కాదు.మనకు ఆయన ఒక దైవం. ఇవాళ నేను నా శిరస్సును నా దైవం పాదాల ముందు వంచి క్షమాపణ అడుగుతున్నా’ అని మోదీ అన్నారు.

భర్త సమ్మతి లేకుండా భార్య గర్భాన్ని తొలగించుకోవడం క్రూరత్వం కిందకు వస్తుందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పు చెప్పింది.

బీహార్‌ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అలోక్‌ రాజ్‌

చర్చలు జరిపే కాలం ముగిసింది.. పాక్‌ చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది : జైశంకర్‌

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మేఘాలయ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందింది.

ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా ఎదగనున్న తమిళనాడు : ఎంకే స్టాలిన్‌

కోల్‌క‌తాలో ట్రైనీ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న గురించి ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌ధాని మోదీకి బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రెండోసారి లేఖ రాశారు. రేపిస్టుల‌కు క‌ఠిన‌శిక్ష‌లు విధించేలా చ‌ట్టాల‌ను త‌యారు చేయాల‌ని ఆమె ఆ లేఖ‌లో కోరారు.

గడిచిన పదేండ్లలో దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్ల సంఖ్య 6 కోట్ల నుంచి ఏకంగా 94 కోట్లకు పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

INTERNATIONAL NEWS

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉక్రెయిన్‌కు అమెరికా పంపిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని ర‌ష్యా కూల్చివేసింది. ఎఫ్‌16 కూలిన విష‌యాన్ని ఉక్రెయిన్ అంగీక‌రించింది.

క‌మ‌లా ఇచ్చిన వాగ్దానాల‌తో అమెరికా వేస్ట్‌ల్యాండ్‌గా మారుతుంద‌ని ట్రంప్ ఆరోపించారు.

BUSINESS NEWS

దేశీయ స్టాక్‌ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు శుక్రవారం మరో మైలురాయికి చేరుకున్నాయి.

సెన్సెక్స్ : 82,366 (231)
నిఫ్టీ : 25,236 (84)

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో దేశ జీడీపీ 15 నెలల కనిష్టానికి దిగజారినట్టు తేలింది. ఈ ఏప్రిల్‌-జూన్‌లో 6.7 శాతానికే పరిమితమైంది.

జూలై నెలకుగాను 8 కీలక రంగాల్లో వృద్ధిరేటు 6.1 శాతానికే పరిమితమైనట్టు స్పష్టమైంది.

క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ.. 46 స్టాక్‌, కమోడిటీ బ్రోకరేజీ సంస్థలపై కొరడా ఝుళిపించింది. నిబంధనల మేరకు లేని 39 స్టాక్‌ బ్రోకర్లు, 7 కమోడిటీ బ్రోకర్ల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను శుక్రవారం రద్దు చేసింది.

ఈ నెల 23తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 681.69 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ వెల్లడించింది

సెప్టెంబర్ 1న గ్యాస్‌ సిలిండర్‌ ధరలతోపాటు పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది.

SPORTS NEWS

పారిస్‌ వేదికగా జరుగుతున్న ఈ క్రీడలలో భారత్‌ ఒకే రోజు నాలుగు పతకాలతో సత్తా చాటింది.

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో అవనికి స్వర్ణం, మోనా అగర్వాల్‌కు కాంస్యం, రజతంతో మెరిసిన మనీశ్‌ నర్వాల్‌, అథ్లెటిక్స్‌లో ప్రీతి పాల్‌కు కాంస్యం

యూఎస్ ఓపెన్ టైటిల్‌ ఫేవరేట్లలో ఒకడిగా ఉన్న టాప్‌ సీడ్‌ కార్లొస్‌ అల్కారజ్‌కు రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో మాజీ చాంపియన్‌ నవొమి ఒసాకా ఇంటిదారి.

ప్రతిష్టాత్మక డ్యూరండ్‌ కప్‌ 2024 విజేతగా నార్త్‌ఈస్ట్‌ యూనైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎన్‌ఈయూఎఫ్‌సీ) నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 17 టైటిల్స్‌ నెగ్గి 18వ టైటిల్‌పై కన్నేసిన మోహన్‌ బగాన్‌కు నార్త్‌ఈస్ట్‌ యూనైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎన్‌ఈయూఎఫ్‌సీ) ఫైనల్ లో అనూహ్య షాకిచ్చింది.

బుచ్చిబాటు టోర్నీలో స్టార్లతో కూడిన ముంబై క్రికెట్‌ జట్టు దారుణ పరాభవానికి గురైంది. తమిళనాడు నిర్దేశించిన 510 పరుగుల భారీ ఛేదనలో ముంబై.. 223 పరుగులకే ఆలౌట్‌ అయింది.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ గడువు సెప్టెంబర్ 7 వరకు పెంపు

తెలంగాణ రాష్ట్ర జెన్కో ఏఈ‌, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల

బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సులోని సీట్ల భర్తీకి నిర్వహించే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. 31 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు