Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 30 – 09 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 30 – 09 – 2024

BIKKI NEWS (SEP. 30) : TODAY NEWS IN TELUGU on 30th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 30th SEPTEMBER 2024

TELANGANA NEWS

రాష్ట్రంలో రెండురోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమొరిన్‌ ప్రాంతం నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది.

త్వరలోనే ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : మంత్రి పొన్నం.

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేంద్ర‌న‌గ‌ర్, అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఉన్న మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

1908లో నిజాం రాజు ఇండ్లు కూల‌గొట్ట‌లే.. కానీ రేవంత్ కూల‌గొడుతున్న‌డు.. హ‌రీశ్‌రావు ఫైర్

మొద‌టి ద‌శ‌లో 3 కారిడార్ల‌లో 69 కి.మీ. మేర మెట్రో న‌డుస్తుంది. రెండో ద‌శ‌లో మ‌రో 6 కారిడార్ల‌లో 116.2 కి.మీ. మేర మెట్రో ప్ర‌యాణించ‌నుంది. రెండో ద‌శ పూర్త‌యితే మొత్తం 9 కారిడార్ల‌లో 185 కి.మీ. మెట్రో ప‌రుగులు తీయ‌నుంది.

కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణించవద్దని టీజీఎస్‌ ఆర్టీసీ ఆదేశించింది. ‘స్టాఫ్‌ నాట్‌ అలోడ్‌’ అనే స్టిక్కర్లు అంటించింది.

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లి గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతవగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ANDHRA PRADESH NEWS

ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఆయన ప్రచారం చేశారని మండిపడ్డారు.

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని.. దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. వీళ్లిద్దరూ ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారని విమర్శించారు.

నారా లోకేశ్‌ భవిష్యత్తు కోసం జగన్‌ను నాశనం చేయాలని చూస్తున్నారా.. చంపాలని అనుకుంటున్నారా? అని పోసాని కృష్ణ మురళి నిలదీశారు.

చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్‌ రూమ్‌ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి

సనాతన ధర్మం గతంలో లేనట్టు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని వెల్లంపల్లి విమర్శించారు. చెప్పులు వేసుకుని దీక్షలు చేయడం పవన్‌ కల్యాణ్‌కే చెల్లిందని వెల్లంపల్లి అన్నారు

NATIONAL NEWS

70 ఏండ్ల పై చిలుకు వృద్ధులకు ఆయుష్మాన్’ నమోదు ప్రక్రియ చేపట్టండి.. రాష్ట్రాలను కోరిన కేంద్రం..

అతి వాద నేత ప్రకాశ్ కారత్‌కు సీపీఎం పగ్గాలు తిగిరి అప్పగించినట్లు సమాచారం

ఎలక్టోరల్ బాండ్స్ అంశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేయాలి : కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ డిమాండ్‌

దివ్యాంగ పిల్లల సమస్యలపై న్యాయ వ్యవస్థ దృష్టి పెట్టాలి : సీజేఐ డీవై చంద్రచూడ్‌

అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం: ప్రశాంత్ కిషోర్

జనవరిలో కుంభమేళా.. 992 ప్రత్యేక రైళ్లను నడపనున్న భారతీయ రైల్వే..

అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలను నాటడం ద్వారా తెలంగాణ ప్రజలు కొత్త రికార్డు సృష్టించారని మన్ కీ బాత్ లో మోడీ అన్నారు.

లే ఆఫ్‌ల సమస్యకు తోడైన కొత్త సవాళ్లు.. భారతీయులకు ఇబ్బందికరంగా హెచ్‌-1బీ నిబంధనలు

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాను శివాలయంగా ప్రకటించాలని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా అజ్మీర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.

మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు.

INTERNATIONAL NEWS

సిరియాలో అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. దాడుల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌, అల్‌ఖైదాకు చెందిన 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పలు ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.

హిజ్బొల్లా మరో టాప్‌ కమాండర్‌ నబిల్‌ కౌక్‌ హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్‌ సైన్యం..

నేపాల్‌లో తగ్గని వరద బీభత్సం.. 112కు చేరిన మరణాల సంఖ్య

నస్రల్లా మృతి, లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కావాలని ఇరాన్ కోరింది.

BUSINESS NEWS

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇండియాదే హవా.. ఐటీలో భారత్ కు మంచి రోజులున్నాయ్.. నాస్కామ్ చైర్ పర్సన్ సింధూ గంగాధరన్

ఈక్విటీ మార్కెట్లలోకి సెప్టెంబర్ నెలలో రూ.57,359 కోట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) వచ్చి చేరాయి. గత తొమ్మిది నెలల్లో ఇదే గరిష్టం.

రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు రూ.780 కోట్లు చెల్లించాలని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు సమర్థించిందని పేర్కొంటూ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రిలయన్స్ ఇన్‌ఫ్రా తెలిపింది.

తమిళనాడులో టాటా మోటార్స్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ.. 5000 మందికి కొత్త ఉద్యోగాలు..

ఎస్బీఐ ఖాతాదారుల కోసం కొత్త బ్యాంకింగ్ సేవలు.. రికరింగ్ డిపాజిట్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) తీసుకొస్తోంది.

గతవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్ -10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,21,270.83 కోట్లు పెరిగింది

SPORTS NEWS

బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు వర్షం ప‌డ‌లేదు. అయినా స‌రే ఒక్క బంతి కూడా ప‌డ‌లేదు.

ధోనీ ఈసారి అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌’గా ఆడే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే ధోనీ జీతంలో భారీ కోత ప‌డ‌నుంది. ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ తీసుకొచ్చిన నిబంధ‌న‌లే అందుకు కార‌ణమ‌ని తెలుస్తోంది.

శ్రీ‌లంక క్రికెట‌ర్ నిరోష‌న్ డిక్‌వెల్లా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. ఇప్ప‌టికేజాతీయ జ‌ట్టుకు దూర‌మైన అత‌డు తాజాగా నిషేధానికి గుర‌య్యాడు. డోప్ ప‌రీక్ష‌లో విఫ‌ల‌మైన అత‌డిని శ్రీ‌లంక క్రికెట్ బోర్డు మూడేండ్ల పాటు స‌స్పెండ్ చేసింది.

న్యూజిలాండ్‌పై రెండో టెస్ట్ లో లంక ఇన్నింగ్స్ విజ‌యం.. శ్రీ‌లంక క్లీన్‌స్వీప్

భార‌త ఒలింపిక్ సంఘం అధ్య‌క్షురాలు పీటీ ఉష 12 బంది ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులలో కొంద‌రు అవినీతికి పాల్ప‌డ్డార‌ని, లింగ వివ‌క్ష చూపించార‌ని, వాళ్ల‌లో కొంద‌రిపై లైంగిక వేధింపుల కేసులు కూడా న‌మోదు అయ్యాయ‌ని ఉష వెల్ల‌డించింది.

EDUCATION & JOBS UPDATES

సమ్మక్క సారక్క గిరిజన సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ స్పాట్ అడ్మిషన్లు

రైల్వే లో 14,298 టెక్నీషియన్స్ జాబ్స్ నోటిఫికేషన్

TTD లో 2 లక్షల వేతనంతో ఉద్యోగాలు

IBPS CLERK మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల

తెలంగాణ లో కన్వీనర్ కోటా బీడీఎస్ సీట్లకు వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ విడుదల

ENTERTAINMENT UPDATES

ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రాంచరణ్‌ మైనపు విగ్రహం సందడి చేయనుంది.

రెండు రోజుల్లో రూ. 243 కోట్లు.. బాక్సాఫీస్ వ‌ద్ద ‘దేవ‌ర’ ర్యాంపేజ్

ఐఫా 2024 బాలీవుడ్ అవార్డులు ఉత్తమ చిత్రం యానిమల్, ఉత్తమ నటుడు షారుక్ ఖాన్, ఉత్తమ నటి రాణీ ముఖర్జీ

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు