TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 30 – 10 – 2024

BIKKI NEWS (OCT. 30) : TODAY NEWS IN TELUGU on 30th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 30th OCTOBER 2024

TELANGANA NEWS

కుటుంబ సర్వేతో లక్షలాదిమంది జీవితాల్లో మార్పు వస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఓ గిరిజన బాలికపై సామూహిక లైంగికదాడి జరిగిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంగళవారం వెలుగుచూసింది. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు.

ఖాళీ స్థలానికి సంబంధించిన యజమాని మృతి చెందినట్టు నకిలీపత్రాలు సృష్టించి, ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కేసులో కుత్బుల్లాపూర్‌ పూర్వ సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలోని సర్వే నంబర్‌ 63లో ప్రభుత్వానికి చెందిన 78 ఎకరాల్లో 52 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ గతంలో ఆ జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

ANDHRA PRADESH NEWS

ఏపీలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఫైనల్‌ కీ ని పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది.

వారు అబద్దాలు ఆడడం బాధించింది..వైఎస్సార్‌ అభిమానులకు విజయమ్మ సంచలన లేఖ

ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌

చంద్రబాబూ.. రైతుల ఉసురుపోసుకోవద్దు.. పంట ప్రీమియం చెల్లింపులపై వైసీపీ హితవు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, యువతి, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైసీపీ మహిళా నాయకులు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఏపీని చంద్రబాబు నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తున్నారు.. ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. 32 మందిని బదిలీచేస్తూ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

NATIONAL NEWS

కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ఇక నుంచి 70 ఏండ్ల పైబడిన అందరికీ వర్తించనుంది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఢిల్లీలో వయో వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. మంగళవారం 100కు పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

కేరళ ఆలయంలో బాణసంచా పేలుడు 150 మందికి గాయాలు

అయోధ్యలో వానరాల కోసం అక్షయ్‌కుమార్‌ కోటి విరాళం.

ఇటీవల ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై కాంగ్రెస్‌ లేవనెత్తిన నిరాధార ఆరోపణలను తిరస్కరిస్తున్నాం’ అని ఈసీ మంగళవారం అధికారిక ప్రకటనలో పేర్కొన్నది.

జనన, మరణాలను సులువుగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌(సీఆర్‌ఎస్‌) పేరుతో రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన ఈ యాప్‌ను మంగళవారం న్యూఢిల్లీలోని జనగణన భవన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రారంభించారు.

రాజస్థాన్‌ సికార్‌ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. మరో 35 మందికిపైగా గాయపడ్డారు.

INTERNATIONAL NEWS

లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కొత్త చీఫ్‌గా మంగళవారం నయీమ్‌ ఖాసీం నియమితులయ్యారు.

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక అత్యవసర స్థితిలోకి వెళ్లిపోయిందని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

క్యాన్సర్‌ మహమ్మారికి అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు కీమోథెరపీతో పాటు ఫొటోథెరపీని ఒకేసారి చేయడం ద్వారా సమర్థంగా క్యాన్సర్‌ కణతులను నాశనం చేయొచ్చని వీరు గుర్తించారు.

ఉత్తర గాజాపై ఇజ్రాయెల్‌ దాడి.. 55 మంది పాలస్తీనియన్లు మృతి.

బైట్‌డ్యాన్స్ వ్య‌వ‌స్థాప‌కుడు జాంగ్ యిమింగ్‌.. చైనా సంప‌న్నుల జాబితాలో టాప్ ప్లేస్ కొట్టేశాడు. అత‌ని వ్య‌క్తిగ‌త సంప‌ద 49.3 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ది.

BUSINESS NEWS

లాభాల్లో సూచీలు

సెన్సెక్స్ : 80,369 (364)
నిఫ్టీ : 24,467 (128)

వచ్చే ఏడాది జనవరికల్లా స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌ల అడ్డుకట్టకు సవరించిన కఠిన నిబంధనల్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ లహోటి తెలిపారు.

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు చెందిన జియో పేమెంట్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌(జేపీఎస్‌ఎల్‌) భారీ ఊరట లభించింది. ఆన్‌లైన్‌ పేమెంట్‌ అగ్రిగ్రేటర్‌ లైసెన్స్‌ను రిజర్వుబ్యాంక్‌ నుంచి పొందింది.

SPORTS NEWS

భారత్‌, న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1తో గెలుచుకుంది.

ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక అవార్డు అయిన ‘బాలన్‌ డి ఓర్‌’ను ఈ ఏడాది స్పెయిన్‌ ఫుట్‌బాలర్‌ రోడ్రిగొ హెర్నాండెజ్‌ (రోడ్రి) గెలుచుకున్నాడు.

మహిళల విభాగంలో స్పెయిన్‌కే చెందిన ఐటానా బొన్మాటీ బాలన్‌ డి ఓర్‌ను గెలుచుకుంది.

స్పెయిన్‌ యువ సంచలనం లమినె యమాల్‌కు ఉత్తమ యువ ఫుట్‌బాలర్‌ అవార్డు లభించింది.

ఆస్ట్రేలియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

ఏటీపీ ఫైన‌ల్స్‌లో ఆడనున్న రోహన్ బోప‌న్న‌.. నాలుగో భార‌తీయుడిగా రికార్డు

EDUCATION & JOBS UPDATES

ఏపీలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఫైనల్‌ కీ ని పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది.

టీశాట్ లో అకడమిక్, పోటీ పరీక్షలకు సంబంధించిన తరగతులు ప్రసారం

ఏపీలో లైబ్రరీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు నవంబర్ 1 నుంచి ప్రారంభం

ENTERTAINMENT UPDATES

చిరంజీవి కి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు