TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 30 – 12 – 2024

BIKKI NEWS (DEC 30) : TODAY NEWS IN TELUGU on 30th DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 30th DECEMBER 2024

TELANGANA NEWS

రాష్ట్ర శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివాళులర్పించనున్నది.

భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం దరఖాస్తు చేసేందుకు రాష్ర్టానికి చెందిన మరో 10 ఉత్పత్తులను ఎంపిక చేశారు.

రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : భట్టి విక్రమార్క

తెలంగాణ పోలీస్‌ లోగో మారింది. పదేండ్లపాటు ‘తెలంగాణ స్టేట్‌ పోలీస్‌’ అని ఉండగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘స్టేట్‌’ అనే పదాన్ని తొలగించి ‘తెలంగాణ పోలీస్‌’గా మార్చారు.

కొల్చారం పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాయికుమార్‌ వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు

డిగ్రీ సైన్స్‌ కో ర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మండలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్‌ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండగా వీటిని 146కు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది.

45 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేవు.. పోలీసులకు సంధ్య థియేటర్‌ లేఖ

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లను ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలుచేయాలని అంగన్‌వాడీ టీచర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నది.

ANDHRA PRADESH NEWS

అప్పులు చేయడంలో చంద్రబాబు దిట్ట : మాజీ మంత్రి బుగ్గన

త్వరలోనే గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు – సీఎం

రాష్ట్ర నూతన సీఎస్ గా విజయానంద్ నియామకం

ఏపీలో పెరిగిన సైబర్‌ నేరాలు.. రూ.1,229 కోట్లు మాయం : డీజీపీ

గిన్నిస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డు కోసం విజయవాడలో గేమ్‌ ఛేంజర్‌ రాంచరణ్‌ భారీ కటౌట్‌

తెలంగాణ రాజకీయ ప్రతినిధుల సిఫార్సు లేఖలపై నిర్ణయం తీసుకోలేదు : టీటీడీ ఈవో

మెల్‌బోర్న్‌ సెంచరీ వీరుడు నితీష్‌ రెడ్డికి పవన్‌ కల్యాణ్‌ అభినందనలు

NATIONAL NEWS

ఖగోళ పరిశోధనల్లో అద్భుత విజయాలతో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగం స్పాడెక్స్ ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-60 రాకెట్‌ ద్వారా నింగిలోకి రెండు ఉపగ్రహాలు

ఓటర్ల లిస్టులోని కొందరు ఓటర్లను తొలగించి వచ్చే ఎన్నికల్లో అక్రమంగా అధికారంలోకి రావడానికి బీజేపీ ఆపరేషన్‌ లోటస్‌కు తెరతీసిందని ఆప్‌ ఆరోపించింది.

బీపీఎస్సీ పరీక్ష రద్దు కోసం బీహార్ విద్యార్థుల ఆందోళన.. పోలీసు లాఠీచార్జీతో ఉద్రిక్తత

జనవరి 13 నుంచి ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా..

కేరళలోని శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకుంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

INTERNATIONAL NEWS

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 179 మంది దుర్మరణం

హెచ్‌1బీకి నేనెప్పుడూ అనుకూలమే ప్రకటించిన ట్రంప్‌

అవినీతి నిర్మూలన కోసం అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తలపెట్టిన ప్రత్యేక డ్రైవ్‌కు మద్దతుగా చైనాలో ప్రత్యేక జైళ్లను నిర్మిస్తున్నారు

ప్రపంచంలో అత్యంత వేగంగా (450 కీమీ/గంటకు) పరుగెత్తే హైస్పీడ్‌ బుల్లెట్‌ రైలు నమూనాను చైనా ఆదివారం ఆవిష్కరించింది.

BUSINESS NEWS

ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగులు 25 శాతం అట్రిక్షన్లు కొనసాగుతున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది.

టాప్-10 సంస్థల్లో ఆరింటి ఎం-క్యాప్ రూ.86,848 కోట్ల వృద్ధి.. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు భారీ లబ్ధి.

SPORTS NEWS

ప్రో కబడ్డీ లీగ్‌-11వ సీజన్‌ టైటిల్‌ను హర్యానా స్టీలర్స్‌ దక్కించుకుంది. టైటిల్‌ పోరులో 32-23తో పాట్నా పైరేట్స్‌ను మట్టికరిపించి ఈ టోర్నీలో తొలిసారి ట్రోఫీని సాధించింది.

భారత స్టార్‌ చెస్‌ క్రీడాకారిణి, గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీని గెలుచుకోవడం హంపికి రెండో సారి. పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏండ్ల కుర్రాడు వోలోదర్‌ ముర్జిన్‌ టైటిల్‌ గెలిచాడు

బాక్సింగ్‌ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ కష్టాలో పడింది. 33/3 వికెట్లను కోల్పోయింది. భారత్‌ టార్గెట్‌ 340..

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరింది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు