TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 11 – 2024

BIKKI NEWS (NOV. 02) : TODAY NEWS IN TELUGU on 2nd NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 2nd NOVEMBER 2024

TELANGANA NEWS

సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కొత్త డైట్. 10 రోజుల్లో విధివిధానాలకు రూపొందించాలని సీఎం ఆదేశం.

ప్రాథమిక టీచర్లతోనే కులగణన. మూడు వారాలపాటు ప్రాథమిక పాఠశాలలు ఒక పూట మాత్రమే పనిచేసేలా ఉత్తర్వులు.

గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్న ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఎస్సైలు అంబారియా, మారుతి నాయక్‌, కానిస్టేబుళ్లు మధు, వినయ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

సచివాలయం బందోబస్తు బాధ్యతలను తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) శుక్రవారం స్వీకరించింది.

భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ (కేటీఆర్‌) అన్నారు. ఎక్స్‌ వేదిగా నిర్వహించిన ‘ఆస్క్‌ కేటీఆర్‌’ క్యాంపెయిన్‌లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో మరో రెండురోజులు వానలే.. ఐఎండీ హెచ్చరిక

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రూ.7కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌.

వికారాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి చదవుతున్న 13 ఏళ్ల బాలికపై 4 మైనర్లు లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

మద్యం అమ్మకాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రమైన ఏపీ రెండోస్థానంలో నిలిచింది.

ANDHRA PRADESH NEWS

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే టీడీపీ లక్ష్యంతో ప్రారంభించిన డ్వాక్రా సంఘాలకు పూర్వవైభవం తీసుకొస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా అమరజీవి పొట్టిశ్రీరాములును అవమానపరిచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి రోజా డిమాండ్‌ చేశారు.

కూటమి ప్రభుత్వం కుట్రతో ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు బలి కాబోతుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

44362 కోట్లతో విజయవాడ, వైజాగ్ లలో మెట్రో

కానిస్టేబుల్ అభ్యర్థులకు మిగిలిన వారికి దేహధారుడ్య పరీక్షలు నవంబర్ 11 నుండి 21 వరకు నిర్వహించనున్నారు.

NATIONAL NEWS

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లద్దాఖ్‌ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌, ఆకా స్పేస్‌ స్టూడియో, లడఖ్‌ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషన్‌ చేపట్టింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ బిబేక్‌ దెబ్రాయ్‌ కన్నుమూత

వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్‌పై మరో రూ.62 బాదింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1802కు చేరింది

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు, ఏడు అంటూ ఎలాంటి గ్యారంటీలూ ప్రకటించడంలేదని మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు.

INTERNATIONAL NEWS

పాకిస్థాన్ లోని బ‌లోచిస్తాన్ ప్రావిన్సులో రిమోట్ కంట్రోల్‌తో బాంబును పేల్చిన ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతిచెందారు.

స్పెయిన్‌లో వరద బీభత్సం.. 158కి పెరిగిన మృతుల సంఖ్య

హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ ఢాకాలోని కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడీ చేశారు.

BUSINESS NEWS

అక్టోబర్ నెలలో 1658 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే, వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.83,050లతో తాజా జీవిత కాల గరిష్టం నమోదు చేసింది.

సంవత్ 2081 స్పెషల్ మూరత్ ట్రేడింగ్ లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 335.06 పాయింట్ల లబ్ధితో 79,724.12 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 99 పాయింట్లు పుంజుకుని 24,304.35 పాయింట్ల వరకూ దూసుకెళ్లింది.

అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 9 శాతం వృద్ధి చెంది రూ.1.87 లక్షల కోట్లకు చేరాయి. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో గరిష్టం.

గూగుల్‌కు సవాల్.. కొత్త సెర్చింజన్ చాట్‌జీపీటీ తీసుకురానుంది.

SPORTS NEWS

వాంఖడే టెస్టులో కివీస్ ను 235 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 81/4 పరుగులతో ఉంది.

టీమిండియా త‌ర‌ఫున‌ టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన ఐదో బౌల‌ర్‌గా రవీంద్ర జడజా (312) రికార్డు సృష్టించాడు.

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సెంట్ర‌ల్ కాంట్రాక్టులు ప్ర‌క‌టించింది. త‌ద్వారా జాతీయ జ‌ట్టుకు ఆడుతున్న ఆట‌గాళ్ల‌కు రెండేండ్ల‌, వార్షిక ప్ర‌తిపాదిక‌న ఈసీబీ జీతాలు చెల్లించనుంది.

EDUCATION & JOBS UPDATES

TGPSC – వార్డెన్ పోస్టులకు నవంబర్ 14 నుండి 30 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టిజీపీఎస్సీ ప్రకటించింది.

ఏపీ టెట్ ఫలితాలు 4వ తేదీన విడుదల చేసే అవకాశం.

బ్యాంకు ఆఫ్ బరోడాలో 592 కాంట్రాక్టు ఉద్యోగాలు

APRCET 2024 తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం

IBPS 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల. నవంబర్ 9 న పరీక్ష

ENTERTAINMENT UPDATES

సంక్రాంతికి వస్తున్న వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి మూవీ

టీవీకే తొలి బహిరంగ సభను చాలాచక్కగా నిర్వహించారంటూ, విజయ్ తన పార్టీ సభను ఎంతో విజయవంతంగా నిర్వహించారని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు