BIKKI NEWS (JAN. 02) : TODAY NEWS IN TELUGU on 2nd JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 2nd JANUARY 2025
TELANGANA NEWS
జనవరి 03వ తేదీని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్టు తెలిసింది.
భూ భారతి త్వరలో అమల్లోకి వస్తుందని, రెవెన్యూ అధికారులు సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలాల మండలి (సీజీడబ్ల్యూబీ) వెల్లడించింది.
రాష్ట్రంలో 30 ఏండ్లు దాటినవారిలో దాదాపు 23 లక్షల మందికి బీపీ, 12 లక్షల మందికి షుగర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యార్థుల మరణాలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సీరియస్ అయ్యింది.
హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్‌లను గుర్తించాలని, ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రక్రియ ఏ దశలో ఉన్నదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ స్టేట్ – స్టేట్‌లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్) సర్టిఫికెట్ల జారీని అధికారులు గురువారం ప్రారంభించారు.
ANDHRA PRADESH NEWS
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం సెకన్లపాటు భూమి కంపించింది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం లో 14 అంశాలపై చర్చ జరుగగా అన్నింటికీ ఆమోదం వ్యక్తం చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8న ఏపీలోని విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పూడిమడక వద్ద రూ.85 వేల కోట్లు పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేయనున్నారు.
2024 లో కానుకల ద్వారా టీటీడీకి రూ. 1,365 కోట్లు ఆదాయం
కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో అపశ్రుతి.. పరుగులో అస్వస్థతకు గురై యువకుడు మృతి
NATIONAL NEWS
నీట్-యూజీ’ పరీక్ష నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటుచేసిన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులను అమలుజేయబోతున్నట్టు కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది
ట్రాఫిక్‌జామ్‌లో ఆసియాలోనే బెంగళూరు టాప్.
యూపీ లో ఓ జర్నలిస్ట్ ఇంటిని అక్రమంగా కూల్చేశారన్న కేసులో.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఐఏఎస్ అధికారి, జిల్లా పోలీసులు, ఇంజినీర్లు సహా మొత్తం 26 మంది అధికారులపై క్రిమినల్ కేసు నమోదైంది.
బెంగాల్‌లో చొరబాట్లకు కేంద్రం పాత్ర.. బంగ్లాదేశీయులను బీఎస్‌ఎఫ్ అనుమతిస్తోంది: మమతా బెనర్జీ
ఇకపై దేశీయ విమానాల్లోనూ వైఫై సేవలు.. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా భువనేశ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
రూ.14.5 తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
INTERNATIONAL NEWS
చైనా లో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.
చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ నిరాకరించిన బంగ్లాదేశ్ కోర్టు
కొత్త సంవత్సర వేడుకల వేళ వరుస దాడులతో అమెరికాలో 16మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు.
సిరియా మాజీ అధ్యక్షుడు, రష్యాలో ఆశ్రయం పొందుతున్న బషర్ అల్ అసద్‌పై విష ప్రయోగం జరిగినట్టు సమాచారం.
ముజిబుర్ రెహ్మాన్ ఇక బంగ్లా జాతిపిత కాదు అని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
BUSINESS NEWS
భారీ లాభాలలో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 79,943.71 (1,436.30)
నిఫ్టీ : 24,188.65 (445.75)
రిలయన్స్ జియో.. ఏకంగా రూ.35,000-40,000 కోట్ల ఐపీవోకు వస్తున్నట్టు తెలుస్తున్నది.
గురువారం మరో 11 పైసలు పడిపోయి మునుపెన్నడూ లేనివిధంగా డాలర్‌తో పోల్చితే ఎక్సేంజ్ రేటు 85.75 వద్దకు క్షీణించింది.
ఢిల్లీలో గురువారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.330 వృద్ధి చెంది రూ.79,720లకు చేరుకుంది.
SPORTS NEWS
జాతీయ క్రీడా అవార్డులు 2024 ను కేంద్రం ప్రకటించింది. నలుగురికి ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డులను, 32 మందికి అర్జున అవార్డులను, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది.
పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి అర్జున అవార్డు వరించింది.
జనవరి 3 నుండి భారత ఆస్ట్రేలియా మధ్య ఐదవ టెస్ట్ ప్రారంభం ఆనంది.
పోంజీ కుంభకోణం కేసులో భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు గుజరాత్ సీఐడీ సమన్లు జారీ చేసింది
EDUCATION & JOBS UPDATES
SSC GD కానిస్టేబుల్ రాతపరీక్ష తేదీలు ఫిబ్రవరి 4 – 25 వరకు
జనవరి 07న గేట్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.
CTET ప్రాథమిక కీ విడుదల
జనవరి 3 నుంచి యూజీసీ నెట్ పరీక్షలు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్