TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 12 – 2024

BIKKI NEWS (DEC 02) : TODAY NEWS IN TELUGU on 2nd DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 2nd DECEMBER 2024

TELANGANA NEWS

సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు – సీఎం

తెలంగాణ రాష్ట్రం లో 1.58 లక్షల మంది హెచ్ఐవీ బాధితులు

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం

నవంబర్ లో జీఎస్టీ వసూళ్లు 3% వృద్ధి

లగచర్లలో మరో 497 ఎకరాల సేకరణ.. రెండు రోజుల్లో రెండో నోటిఫికేషన్‌ ఇచ్చిన ప్రభుత్వం.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక-ఐలాపూర్‌ అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 7 గురు నక్సల్స్ మృతి

ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సింహగర్జన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మాలలు పెద్దఎత్తున తరలివచ్చారు.

డిసెంబర్‌ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ANDHRA PRADESH NEWS

ఫెంగల్ తుపాన్‌ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బియ్యం ఎగుమతి కోసమే కాకినాడ పోర్టును లాక్కున్నారు : మంత్రి మనోహర్‌

అనుమతి ఉంటేనే పోలవరం ప్రాజెక్టు సందర్శన

సంక్రాంతి కి ఏపీలో నూతన రేషన్ కార్డులు

నవంబర్ లో 10% తగ్గిన ఏపీ జీఎస్టీ వసూళ్ళు.

NATIONAL NEWS

భానుడి రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో సిద్ధమైంది. గతంలో ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను చేపట్టిన ఇస్రో తాజాగా.. ప్రోబా-3 మిషన్‌ ను డిసెంబర్ 4న ప్రయోగించబోతున్నది.

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దంపతులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని చెప్పారు.

భూ దిగువ కక్ష్యలో 10 వేలకు పైగా క్రియాశీల ఉపగ్రహాలు ఉన్నాయి. 2030 నాటికి వీటి సంఖ్య లక్షకు చేరవచ్చని అంచనా. దీంతో అంతరిక్షంలోనూ ట్రాఫిక్‌ జామ్‌ తలెత్తే పరిస్థితి ఏర్పడింది.

ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమ పార్టీకి పొత్తు ఉండదని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపిక నేడు జరుగుతుందని శివసేన చీఫ్‌, ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు

ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో గరిష్ఠంగా 1200 మంది ఓటర్లను 1500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది.

ఉత్తరప్రదేశ్‌ సంభల్‌లోని మొఘల్‌ కాలం నాటి షాహీ జామా మసీదు రక్షిత వారసత్వ కట్టడమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) తెలిపింది

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

INTERNATIONAL NEWS

లెనాకావిర్’ అనే కొత్త యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం ద్వారా హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చని తేలింది.

ఇతర వృత్తుల్లో ఉన్నవారితో సమానంగా సెక్స్‌ వర్కర్లకు కూడా కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్‌ దేశం ‘బెల్జియం’ విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది.

సిరియాలో మళ్లీ సంక్షోభం. హయత్‌ తహ్రీర్‌ అల్‌-షామ్‌’ ఇస్లామిక్‌ గ్రూపునకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు సిరియాలో రెండవ అతిపెద్ద నగరమైన అలెప్పోలో భీకర దాడులకు దిగారు.

అమెరికా డాలర్‌ స్థానాన్ని భర్తీ చేయడం కోసం బ్రిక్స్‌ దేశాలు కొత్త కరెన్సీ సృష్టించేందుకు ప్రయత్నించినా లేదా ఇతర కరెన్సీకి మద్దతు తెలిపినా వంద శాతం సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్‌ తదుపరి అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

ఇండియన్‌ – బ్రిటిష్‌ బాలుడు క్రిష్‌ అరోరా (10) మేధాశక్తిలో రికార్డు సృష్టించాడు. ఐక్యూ స్కోర్‌ 162 సాధించి, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌లను మించిపోయాడు.

ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ డైరెక్టర్‌గా కష్యప్ పటేల్‌న డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు.

BUSINESS NEWS

నవంబర్ 2024 లో జీఎస్టీ వసూళ్లు 1.82 లక్షల కోట్లు

గత రెండు నెలల్లో ఫారెక్స్ రిజర్వు 48 బిలియన్ డాలర్లు తగ్గుముఖం పట్టాయని ఆర్బీఐ తెలిపింది.

వాణిజ్య సిలిండర్‌ ధర రూ.16.50 పెరిగింది.

పసిడి రుణాలం ఏడు నెలల్లో 50 శాతం పెరిగాయని ఆర్బీఐ ప్రకటన

SPORTS NEWS

ఆఫ్రికా దేశం గినియాలో విషాదం చోటుచేసుకున్నది. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన గొడవలో 100 మందికిపైగా మరణించారు.

సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు టైటిల్‌ గెలిచింది.

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నూతన అధ్యక్షుడిగా జై షా బాధ్యతలు స్వీకరించారు.

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌ జూనియర్‌-జే100 బాలికల సింగిల్స్‌ టైటిల్‌ను తెలంగాణ అమ్మాయి బసిరెడ్డి రిషిత రెడ్డి గెలుచుకుంది.

ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో గుకేశ్‌, లిరెన్‌ మధ్య జరుగుతున్న ఈ మెగా టోర్నీ ఆరో రౌండ్‌ను ఇరువురు ఆటగాళ్లు డ్రాగా ముగించారు.

EDUCATION & JOBS UPDATES

ఆర్‌ఆర్‌బీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్న అభ్యర్థులు ఆఖరుకు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.

డిసెంబర్ 3న క్యాట్ పరీక్ష కీ విడుదల

BSF స్పోర్ట్స్ కోటాలో 275 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు