TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 29 – 10 – 2024

BIKKI NEWS (OCT. 29) : TODAY NEWS IN TELUGU on 29th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 29th OCTOBER 2024

TELANGANA NEWS

సీఎం ఇంటి వద్ద భద్రతా విధులు నిర్వర్తించే టీజీఎస్పీ బెటాలియన్‌ పోలీసులను తొలగించారు. వారి స్థానంలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసుల గార్డులను నియమించారు.

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించింది. రూ. 1800కోట్ల పెంపునకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించగా, ఈఆర్సీ ఆమోదించలేదు.

జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా సమాఖ్యగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల సమాఖ్య ఎంపికైంది.

తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) నూతన చైర్మన్‌గా జస్టిస్‌ దేవరాజు నాగార్జున నియమితులయ్యారు. ఆ యనను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

హైదరాబాద్‌లో సెక్షన్‌ 163 అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించిన 21మంది బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై డీజీపీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా 11 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐఎఫ్‌ఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ ద్వారా 12,39,044 కేసులు పరిష్కారం కావడంతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సోమవారం వెల్లడించింది.

సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. నవంబర్‌ 2న తమ డిమాండ్ల సాధనకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద శాంతియుతంగా నిరసనకు సన్నద్ధమవుతున్నారు.

ANDHRA PRADESH NEWS

ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రేషన్‌ కార్డు దారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

కూరగాయలు అమ్మినట్లుగా నడిరోడ్డు మీదే మందు అమ్ముతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంతలో ఓ బెల్ట్‌ షాపు నిర్వాహకుడు నడి రోడ్డు మీదనే మద్యం అమ్ముతూ కనిపించాడు.

వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలు అన్నింటినీ బహిర్గతం చేయాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు ఇచ్చిన రహస్య జీవోలు అన్నింటినీ జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సంబంధిత అధికారును ఆదేశించింది.

వైఎస్‌ జగన్‌, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి వివాదంలో విజయమ్మ జడ్జిగా ఉండాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జడ్జిగా ఉండేవాళ్లు మధ్యస్థంగా ఉండాలి కదా.. ఒకరివైపు ఉండేవాళ్లు జడ్జి ఎలా అవుతారని ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వం శాప్‌ నెట్‌ ( సొసైటీ ఫర్‌ ఏపీ నెట్‌వర్క్‌)ను మూసివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

NATIONAL NEWS

దేశంలో జనగణన నిర్వహించేందుకు ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో జనాభా లెక్కల సేకరణ మొదలు కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

గుజరాత్‌లోని వడోదరలో నిర్మించిన టాటా ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాంగణాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ సోమవారం ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్‌ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రం.

ఢిల్లీలో నకిలీ లాయర్లు.. 107 మందిని తొలగించిన బార్‌ కౌన్సిల్‌

అంతరిక్షానికి మినిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’ మిషన్‌ ను 2026 లో చేపట్టాలని నిర్ణయం

సోమవారం ఉదయం ఢిల్లీలో ఏక్యూఐ 328 వద్ద నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

INTERNATIONAL NEWS

ఇజ్రాయెల్‌ జరిపిన దాడులపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ట్వీట్‌ చేసిన ఖాతాను ‘ఎక్స్‌’ సస్పెండ్‌ చేసింది.

కెనెడా లో కళాశాలల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఉచిత ఆహారాన్ని అందించరాదని ది గ్రేటర్‌ వాంకోవర్‌ ఫుడ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది.

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.

సెన్సెక్స్ : 80,005 (603)
నిఫ్టీ : 24,381 (158)

హైదరాబాద్‌లో టీఐసీ అకాడమీ.. అందరికీ అర్థమయ్యే భాషలో ట్రేడింగ్‌ పాఠాలు 

స్విగ్గీ ఐపీవో వచ్చే నెల 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు జరగనున్న ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.11,300 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

SPORTS NEWS

నేడు భారత మహిళల జట్టు కివీస్ తో నిర్ణయాత్మక మూడో వన్డే ఆడనుంది. సిరీస్ 1-1 తో ఉంది.

భారత యువ రెజ్లర్‌ చిరాగ్‌ చిక్కర అండర్‌-23 వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పసిడితో సత్తాచాటాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్‌ పరిమిత ఓవర్ల జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమితుడైన దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్‌.. ఆరు నెలలు తిరగకముందే ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.

EDUCATION & JOBS UPDATES

TGPSC – ఫిజిక్స్, కెమిస్ట్రీ, సంస్కృతం, హిస్ట‌రీ, ఉర్దూ మీడియంలో ఉర్దూ, ఫిజిక్స్ స‌బ్జెక్టుల‌కు సంబంధించిన పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్ధుల హాల్ టికెట్లు వెల్ల‌డించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

డిపార్ట్మెంటల్ టెస్టు దరఖాస్తు గడువు అక్టోబర్ 31 వరకు పొడిగించారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను నవంబర్ 7వ తేదీన నిర్వహించనున్నారు.

జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ హైకోర్టు లో లా క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు