BIKKI NEWS (NOV. 29) : TODAY NEWS IN TELUGU on 29th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 29th NOVEMBER 2024
TELANGANA NEWS
విద్యార్థులను సొంత బిడ్డలవలె చూసుకోవాలి. – సీఎం రేవంత్
పదో తరగతి పరీక్షలలో గ్రేడింగ్ మరియు ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తివేత
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సదుపాయాల్లో అనేక లోపాలు ఉన్నాయంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని జాతీయ బాలల హక్కుల కమిషన్ తెలిపింది.
పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫుడ్‌సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం గొరిట ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.
పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించండి’ అంటూ సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్లకు మరోసారి ఆదేశాలు జారీఅయ్యాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
జీరో స్కూల్ పేరిట 1,899, 10 మందిలోపు విద్యార్థుల కారణంగా 4,314 సూళ్లను కలిపి 6,213 ప్రభుత్వ పాఠశాలలను శాశ్వతంగా మూసివేయాలని చూస్తున్నదని హరీష్ రావు మండిపడ్డారు.
డిపార్ట్మెంటల్ పరీక్షలలో పేపర్ కోడ్ 19, 28కి సంబంధించి డిసెంబర్ 2న నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్ 7కి వాయిదా వేశారు.
పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితా గురువారం టీజీపీఎస్సీ విడుదల చేసింది.
నాగార్జున కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు
ANDHRA PRADESH NEWS
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తిరుపతి,నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
డిసెంబర్ 3,4 తేదీల్లో జరగాల్సిన ఏపీ కలెక్టర్ల సదస్సు వాయిదా పడింది. గురువారం సాయంత్రం ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది.
డిసెంబర్ 4న ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో కేబినేట్ సమావేశం జరగనుంది.
నాకు లంచం ఇవ్వబోయినట్లు ఎక్కడైనా ఆధారాలున్నాయా, ఎఫ్‌బీఐ ఛార్జిషీట్‌లో నా పేరు ఎక్కడైనా ఉందా.? వాస్తవాలు తెలియకుండా నాపై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
NATIONAL NEWS
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ఫోన్ చేసి బెదిరించిన మహిళ (34)ను ముంబై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర క్షిపణి ఐఎఎస్ అరాఘాత్ ను భారత్ పరీక్షించింది. ఇది 3,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగలదు
జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. గురువారం సాయంత్రం 4.19 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.
జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వచ్చే నెల 4న ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సి.59 రాకెట్ ప్రయోగించనుంది. సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు
పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా మూడో రోజు కూడా రభస కొనసాగింది. ఉభయ సభలు వాయిదా.
ఆస్తిపై హక్కు ఇప్పుడు మానవ హక్కుల పరిధిలోకి వస్తుందని జమ్ము కశ్మీర్, లఢక్ హైకోర్టు స్పష్టం చేసింది.
మాంసం అమ్మే వృత్తిలో ఉన్న ఒక యువకుడు తనతో సహ జీవనం చేస్తున్న మహిళని హత్య చేసి 50 ముక్కలుగా నరికాడు.
INTERNATIONAL NEWS
దక్షిణ లెబనాన్‌లోకి అనుమానితులు వస్తున్నారని ఐడీఎఫ్ ఆరోపణ. హెజ్బొల్లా స్థావరంపై వైమానిక దాడి.
ఉక్రెయిన్ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై రష్యా గురువారం విరుచుకుపడింది. దాదాపు 200 క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. రెండు వారాల్లో ఇది రెండో భారీ దాడి.
ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలను నిషేధించేందుకు బంగ్లాదేశ్ హైకోర్టు నిరాకరించింది
BUSINESS NEWS
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి
సెన్సెక్స్ : 79,043.74 (-1190)
నిఫ్టీ : 23,914.15 (-360)
ఎల్‌ఐసీ ఆరోగ్య బీమాలోకి ప్రవేశించేందుకు మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో 50 శాతందాకా వాటాను కొనేందుకు గట్టిగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం
భారీగా పెరుగనున్న పసిడి, చమురు ధరలు.. గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా
ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ.4,900 క్షీణించి రూ.90,900లకు పడిపోయింది
SPORTS NEWS
నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినందుకు గాను ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌పై ఒక నెల నిషేధం పడింది.
దక్షిణాప్రికాతో జరుగుతున్న టెస్టులో లంక 13.5 ఓవర్లలో 42 పరుగులకే ఆలౌట్ అయింది. టెస్టులలో ఇది వారికి అత్యల్ప స్కోరు.
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా-2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించం : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ పదవ తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ మరియు ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత
వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ లో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ల చేపట్టనున్నారు.
డిగ్రీ పూర్తి చేయాలంటే ఇక మూడు, నాలుగేండ్లు ఆగాల్సిన పని లేదు. అభ్యాస సామర్థ్యాలను బట్టి కోర్సు కాలాన్ని పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం విద్యార్థులకు ఉండనున్నట్లు యూజీసీ ప్రకటన.
న్యాయ విద్య కోర్సుల్లో అడ్మిషన్లను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
డిపార్ట్మెంటల్ పరీక్షలలో పేపర్ కోడ్ 19, 28కి సంబంధించి డిసెంబర్ 2న నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్ 7కి వాయిదా వేశారు.
పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితా గురువారం టీజీపీఎస్సీ విడుదల చేసింది.
- Open BEd – అంబేద్కర్ వర్శిటీలో ఓపెన్ బీఈడీ అడ్మిషన్లు
- SSC JOB CALENDAR 2025 – 26 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ కేలండర్
- GENERAL HOLIDAYS 2025 – 2025 సాదరణ సెలవులు ఇవే
- Group 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు – సుప్రీంకోర్టు
- VTG CET 2025 – 18న గురుకుల ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్