TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 29 – 07 – 2024

BIKKI NEWS (JULY 29) : TODAY NEWS IN TELUGU on 29th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 29th JULY 2024.

TELANGANA NEWS

ఆగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తం – సీఎం రేవంత్ రెడ్డి.

పంచాయతీ ఎన్నికల్లో విజయం నాదే సీఎం రేవంత్ రెడ్డిరంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (వృత్తి నైపుణ్యాభివృద్ధి) యూనివర్సీటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 1 న శంకుస్థాపన చేయనున్నారు.

తెలంగాణ వాణి జ్య పన్నుల శాఖలో రూ.1000 కోట్ల కుంభకోణంపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పై కేసు నమోదు.

తొమ్మిది జిల్లాల్లో నిలిచిపోయిన మాడల్‌ స్కూల్‌ రెగ్యులర్‌ టీచర్ల (జూన్‌) జీతాలు వెంట నే చెల్లించాలని మాడల్‌ స్కూల్‌ టీచర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మొబైల్‌ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ

శ్రీశైలానికి భారీగా 4.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

నేడో రేపో నీట్ 2024 రాష్ట్ర ర్యాంకుల ప్రకటన.

ANDHRA PRADESH NEWS

దేశం ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చంద్రబాబు చెప్పాలి – సీపీఐ కార్యదర్శి రామకృష్ణ.

రెడ్‌ బుక్‌ కాదు.. ముందు మీ చేతిలో ఉన్న బుక్కులు తెరవండి.. టీడీపీ నేతలపై బొత్స

జగనన్న పేరుతో ఉన్న పథకాల పేర్లను మార్చేసిన చంద్రబాబు సర్కార్‌

NATIONAL NEWS

ఢిల్లీలోని రావూస్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ బేస్‌మెంట్‌లోకి వరదనీరు ముంచెత్తడంతో ఇద్దరు యువతులు, ఒక యువకుడు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.

మాజీ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్ర శాంత్‌ కిశోర్‌ త్వరలో జన్‌ సురాజ్‌ పేరుతో రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు.

ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తెప్పించాలని ఆయన మనుమడు చంద్రకుమార్‌బోస్‌ విజ్ఞప్తి చేశారు

గర్భం దాల్చడం వ్యాధి లేదా అంగవైకల్యం కాదని, మహిళకు ప్రభుత్వోద్యోగాన్ని నిరాకరించడానికి ఇది ఓ కారణం కాకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది.

బాల్య వివాహాల నిషేధ చట్టం-2006 అన్ని మతాలవారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది.

యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాతా ప్రసాద్ పాండే

INTERNATIONAL NEWS

ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్‌ను తప్పించనున్న ట్రంప్‌.

మధ్య శ్రేణి అణ్వాయుధాల తయారీని తిరిగి ప్రారంభించడానికి వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు.

బ్రెజిల్‌కు చెందిన వాల్టర్‌ ఆర్థ్‌మ్యాన్‌ (100) ఒకే కంపెనీలో 84 ఏండ్లు పని చేసి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.

చైనా హునాన్‌ ప్రావిన్స్‌లోని హెంగ్‌యాంగ్‌ నగర పరిధిలోగల యూలిన్‌ గ్రామంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. 12 మంది దుర్మరణం.

BUSINESS NEWS

ఏంజిల్ టాక్స్ ర‌ద్దుతో స్టార్ట‌ప్‌ల్లో పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌కు చేయూత‌.. పీయూష్ గోయ‌ల్‌

బీలేటెడ్ ఐటీఆర్‌తో చిక్కులు..గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ (ఐసీఎల్‌) సంస్థ ప్రమోటర్లతోపాటు వారి అసోసియేట్ల నుంచి 32.72% వాటాను కొనుగోలు చేసింది.

SPORTS NEWS

ఒలింపిక్స్ లో భారత్ :

మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్‌ (221.7) కాంస్య పతకం నెగ్గింది.

శ్రీలంకదే మహిళల ఆసియా కప్‌. ఫైనల్ లో భారత క్రికెట్‌ జట్టు ఓటమి.

శ్రీలంక తో జరిగిన రెండో టీట్వంటీ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంది.

ఒలింపిక్స్ రెండో రోజు పీవీ సింధు, నిఖత్‌ జరీన్‌, ఆకుల శ్రీజతో పాటు మనికా బాత్రా, రమిత జిందాల్‌ లు తదుపరి రౌండ్స్ కు చేరారు.

రోయింగ్ లో భారత ప్లేయర్ బల్‌రాజ్ పన్వర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

EDUCATION & JOBS UPDATES

సీయూఈటీ-యూజీ’-2024 ఫలితాలు వెలువడ్డాయి.

క్యాట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. నవంబర్‌ 24న కామన్‌ అడ్మిషన్‌ టెస్టు(క్యాట్‌)-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు

ENTERTAINMENT UPDATES

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న కుబేర సినిమాను ఈ ఏడాది విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు.

తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలికి నూతన అధ్యక్షునిగా ప్రముఖ పంపిణీదారుడు పి.భరత్‌భూషణ్‌, ఉపాధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ పదవీ బాధ్యతలను స్వీకరించారు.

మాస్‌ మహారాజా రవితేజ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు