TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 29 – 12 – 2024

BIKKI NEWS (DEC. 29) : TODAY NEWS IN TELUGU on 29th DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 29th DECEMBER 2024

TELANGANA NEWS

ఫార్ములా వన్ కేసులో జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ నోటిసులు

చాట్ జీపీటీ, జెమిని ఏఐ సాంకేతికత సహయంతో చేసిన థీసిస్ లు పీహెచ్డీ పరిశోదనలకు చెల్లవు

తెలంగాణ రాష్ట్రానికి ఎప్రిల్ – సెప్టెంబర్ లలో 12864 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఆరో స్థానంలో తెలంగాణ రాష్ట్రం.

పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం రిమోట్‌ సెన్సింగ్‌ (శాటిలైట్‌ సర్వే) చేస్తామని వెల్లడించారు.

సీఎం రేవంత్‌రెడ్డి తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు 18 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు.

ట్రిపుల్‌ ఆర్‌ ఉత్తర భాగానికి టెండర్లు.. భూసేకరణను వ్యతిరేకిస్తున్న అన్నదాతలు

త్వరలోనే హైడ్రా పోలీస్‌ స్టేష్టన్లు ఏర్పాటు చేస్తాం.. కూల్చివేతలు మళ్లీ స్టార్ట్‌ అవుతాయి.. కీలక విషయాలు వెల్లడించిన రంగనాథ్‌

ఈ నెల 30న ప్రత్యేకంగా సమావేశం కానున్న తెలంగాణ అసెంబ్లీ

ఇంటర్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతున్నది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న ‘దోస్త్‌’ తరహాలోనే ఇంటర్‌లో జూనియర్‌ కాలేజీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (జోస్త్‌) విధానాన్ని తీసుకురానున్నారు.

ANDHRA PRADESH NEWS

ఇక్కడ జనాలు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతాం..’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించారు.

ఏపీ లో గ్రామాల్లో కుటుంబాల నెలవారీ ఖర్చు 5327/-

ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్‌ ధరలు పెరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీంతో సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాలు ప్రజలతో కిటకిటలాడాయి

ఉద్యోగుల పై దాడి చేస్తే తాటా తీస్తా – పవన్

ఏపిపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలి – హైకోర్టు

ఏపీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పండుగకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు

కడప పర్యటనలో హెచ్చరికలు చేస్తున్న పవన్‌ కల్యాణ్‌.. తన సెక్యూరిటీ వైఫల్యాలకు ఎవర్ని బాధ్యుల్ని చేస్తారని బొత్స ప్రశ్నించారు.

“పుష్ప”…….. హీరోని వేధిస్తూ
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి
తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా.? అంటూ అంబటి రాంబాబు ట్వీట్. ఈ ట్వీట్ కు నితీష్ రెడ్డి తగ్గెదేలే సెలబ్రేషన్స్ వీడియో ను జత చేశాడు.

NATIONAL NEWS

మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలను ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో శనివారం కేంద్రం అధికార లాంఛనాలతో చేసింది

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఢిల్లీలోని నిగంబోధ్‌ ఘాట్‌లో శనివారం అంత్యక్రియలు నిర్వహించడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

మన్మోహన్ వల్లే పౌర అణు ఒప్పందం సాధ్యమైంది.. మన్మోహన్‌సింగ్‌ మృతిపట్ల జో బైడెన్‌ సంతాపం

ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగుల రెండో విడత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు రంగం సిద్ధమవుతున్నది

జనాభా లెక్కల సేకరణకు అత్యాధునిక జియో స్పాషియల్‌ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించబోతున్నది.

ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్‌ పర్వతారోహణలో ప్రపంచ రికార్డును సాధించింది. ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలైన బాలికగా కామ్య చరిత్ర సృష్టించింది.

తూర్పు లడఖ్‌ సెక్టర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది.

INTERNATIONAL NEWS

సూర్యుడి సమీపానికి వెళ్లిన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ సురక్షితంగా ఉన్నట్టు నాసా ప్రకటించింది. సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల సమీపానికి చేరుకున్న ఈ వ్యోమనౌక నుంచి సిగ్నల్ అందినట్టు నాసా తెలిపింది.

దక్షిణ కొరియాలోని ముయాన్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం సంభవించింది. రన్‌వేపై దిగుతున్న విమానం అదుపుతప్పి గోడను ఢీకొట్టి పేలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 28 మంది దుర్మరణం చెందారు.

అమెరికా అందజేసిన క్షిపణి రక్షణ వ్యవస్థ ‘థాడ్‌’ (ద అమెరికన్‌ టెర్మినల్‌ హై ఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌)ను ఇజ్రాయెల్‌ మొదటిసారిగా ఉపయోగించింది.

ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌

BUSINESS NEWS

జనవరి 20 నుంచి దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు

ఇన్వెస్టర్లకు బంగారం ప్లస్ సిల్వర్ ఈటీఎఫ్స్ మీద రమారమీ 20 శాతం రిటర్న్స్ లభించాయి.

SPORTS NEWS

నితీశ్‌ కుమార్‌ రెడ్డి (105*) వీరోచిత శతకంతో బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ ఫాలోఆన్‌ గండాన్ని తప్పించుకోంది.

మెల్‌బోర్న్‌ టెస్టులో మెరుపులు మెరిపించిన యువ క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డికి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) 25 లక్షల నజరానా

ప్రో కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో హర్యానా స్టీలర్స్‌, పాట్నా పైరేట్స్‌ మద్య నేడు ఫైనల్ మ్యాచ్

సంతోష్ ట్రోపీ సెమీస్‌లో బెంగాల్‌.. సర్వీసెస్‌తో, కేరళ, మణిపూర్‌తో తలపడనున్నాయి.

EDUCATION & JOBS UPDATES

RRB JOBS – 32 వేల రైల్వే గ్రూప్ డీ ఉద్యోగాలకై నోటిఫికేషన్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ బీఈడీ హల్ టికెట్లు విడుదల

ఇంటర్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతున్నది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న ‘దోస్త్‌’ తరహాలోనే ఇంటర్‌లో జూనియర్‌ కాలేజీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (జోస్త్‌) విధానాన్ని తీసుకురానున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు