TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 28 – 10 – 2024

BIKKI NEWS (OCT. 28) : TODAY NEWS IN TELUGU on 28th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 28th OCTOBER 2024

TELANGANA NEWS

పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఆదివారం రాత్రి 10 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లను సర్వీస్‌ నుంచి తొలగిస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు వెలువరించింది.

పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జన్వాడలోని కేటీఆర్‌ బంధువుల ఇంట్లో డ్రగ్స్‌ దావత్‌ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో సిద్దిపేట జిల్లా చేర్యాల నకాశీ చిత్రకళను ప్రశంసించారు. చేర్యాలకు చెందిన డీ వైకుంఠం 50 ఏండ్లుగా నకాశీ చిత్రకళకు జీవం పోస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో 235 ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు ఇంటర్‌బోర్డు గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి. విద్యార్థుల నుంచి అడ్మిషన్లు సైతం తీసుకున్నాయి.

ప్రభుత్వానికి ఆర్థిక భారంకాని సీపీఎస్‌ను రద్దుచేయాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగం సంఘం కోరింది.

ANDHRA PRADESH NEWS

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు… టూరిజం ఎండీగా ఆమ్రపాలి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌ జి.వాణీమోహన్‌ను నియమించారు. రోనాల్డ్ రాస్ కు పోస్టింగ్ ఇవ్వలేదు.

తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ

చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటానికి జగన్‌పై షర్మిల నిందలు : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

ఏపీ విమాన ప్రయాణికులకు శుభవార్త.. విశాఖ టు విజయవాడ మధ్య రెండు కొత్త ఫ్లైట్‌లు

NATIONAL NEWS

భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.

ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆదివారం 10 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీ(ఎన్‌సీఐ)లో 176 ర్యాంక్‌తో భారత్‌ అట్టడుగున అయిదో స్థానంలో నిలిచింది.

పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.

హైవోల్టేజ్‌ విద్యుత్తు లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం 30 ఏండ్లకు గానూ కెన్యా ప్రభుత్వంతో కుదుర్చుకున్న 736 మిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని కెన్యా కోర్టు సస్పెండ్‌ చేసింది.

తమిజగ వెట్రి కజగమ్‌ పార్టీని ప్రారంభించిన తర్వాత 8 నెలలకు తొలిసారిగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయ్ ప్రసంగించారు.

INTERNATIONAL NEWS

ఉత్తర గాజాపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం జరిపిన దాడిలో 22 మంది మృతి చెందారు

చైనాలో జననాల రేటు పడిపోవడంతో వేలాది కిండర్‌గార్టెన్స్‌ మూతపడుతున్నాయి. 2023లో 14,808 కిండర్‌గార్టెన్స్‌ మూతపడినట్లు చైనా విద్యా శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది.

ఇజ్రాయెల్‌ వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇరాన్‌ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు.

అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వస్తారేమోనని తనకు భయంగా ఉందని అన్నారు.

తైవాన్‌కు ఆయుధాలు విక్రయించేందుకు అమెరికా అంగీకారం.. తీవ్రంగా ఖండించిన చైనా

ఇరాన్‌ క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడులు.. పూర్తిగా ధ్వంసమైన ఘన ఇంధన తయారీ కర్మాగారం

BUSINESS NEWS

మనీ భవిష్యత్ అంతా డిజిటల్‌మయమే.. తేల్చి చెప్పిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్..

గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలో టాప్-10లో తొమ్మిది సంస్థలు రూ.2,09,952.26 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.

స్విగ్గీ సైతం ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,300 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నవంబర్ మొదటి వారంలో ఐపీఓ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

SPORTS NEWS

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆ బాధ్యతలను వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు వన్డే, టీట్వంటీ లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది.

జపాన్‌ పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో భారత్‌ ఏకంగా 24 పతకాలు సాధించింది.

తెలంగాణ ఆర్చరీ అసోసియేషిన్‌ అధ్యక్షుడిగా హైకోర్టులో ప్రముఖ న్యాయవాది టి. రాజు ఎన్నికయ్యారు.

EDUCATION & JOBS UPDATES

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు

ఇస్రోలో 585 ఉద్యోగాలకు నోటిఫికేషన్

GATE MOCK TEST లను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.

870 టీచర్ పోస్టులను తెలంగాణ విద్యాశాఖ తరలించింది.

అక్టోబర్ 30న సీఏ పౌండేషన్ ,.ఇంటర్ 2024 ఫలితాలు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు