TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 28 – 11 – 2024

BIKKI NEWS (NOV. 28) : TODAY NEWS IN TELUGU on 28th NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 28th NOVEMBER 2024

TELANGANA NEWS

వారంలో 3 సార్లు భోజనం వికటిస్తుందా? విద్యార్థుల ప్రాణాలు పోతే గానీ స్పందించరా? – హైకోర్టు ఆగ్రహం

ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి.. వచ్చే నెల 4న మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు.

దిలావర్‌పూర్ లో ఇథనాల్ పరిశ్రమ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.

ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు వీలైనంత త్వరగా పెంచుతామనిమంత్రి సీతక్క తెలిపారు.

ఈ నెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ గురుకుల బాట: కేటీఆర్‌

పురుగుల అన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెకి నినదిస్తుంటే చీమకుట్టినటైనా లేదా? మంచి భోజనం పెట్టని దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదా? అని హరీష్ రావు నిలదీశారు

ANDHRA PRADESH NEWS

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఓ కార్మికుడు చనిపోగా, మరో 9 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రధాని మోదీని బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు.

కోస్తాంధ్ర కు అతిభారీ వర్ష సూచన.

మారిటైం హబ్ గా రాష్ట్రం – సీఎం బాబు

డ్రగ్స్ కంట్రోల్ కొరకు ఈగల్ ఫోర్స్ ఏర్పాటు.

ఏపీ సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు రిమాండ్‌ విధించింది.

తప్పుడు కేసులు పెడితే మీకే ఇబ్బంది.. అధికారులకు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వార్నింగ్‌

NATIONAL NEWS

అదానీ వ్యవహారం రెండో రోజు పార్లమెంటును కుదిపేసింది. అమెరికాలో అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు.

గుజరాత్‌ రాష్ట్రంలో భారీ కుంభకోణం బయటపడింది. ఉత్తర గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో 6,000 కోట్ల పోంజీ స్కామ్‌ వెలుగుచూసినట్టు సీఐడీ ప్రకటించింది.

కొత్త సీరిస్‌ 500 రూపాయల నకిలీ నోట్లు 2018-19 నుంచి 2023-24 కాలంలో నాలుగు రెట్లు పెరిగాయి.

గంటకు 280 కి.మీ. వేగంతో నడిచే రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ డిజైన్‌ చేసి, తయారు చేస్తున్నదని రైల్వే మంత్రి తెలిపారు.

జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసులలో నేర నిరూపణ శాతం తక్కువగా ఉండటం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

2028లో ఇస్రో శుక్రయాన్‌ మిషన్‌ ప్రయోగించనుండగా.. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ తెలిపారు.

ఏపీ, తమిళనాడులో ‘ఫెంగల్‌’ తుఫాను బీభత్సం.

INTERNATIONAL NEWS

ఇజ్రాయెల్‌ – హెజ్బొల్లా మధ్య యుద్ధం ముగిసింది. క్షిపణులు, రాకెట్ల దాడులతో దద్దరిల్లిన దక్షిణ లెబనాన్‌లో శాంతి నెలకొన్నది. 14 నెలల పాటు కొనసాగిన పోరాటానికి ఇరుపక్షాలు బుధవారం స్వస్తి పలికాయి. అమెరికా, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

16 ఏండ్లలోపు వారికి సోషల్‌మీడియా నిషేధం.. బిల్లును ఆమోదించిన ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ

అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా జై భట్టాచార్య

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 80,234 (230)
నిఫ్టీ : 24,275 (80)

2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి నాలుగు టెలికం సంస్థల అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉన్నట్లు పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

యాక్టివా ఈ-స్కూటర్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నది. యాక్టివా ఈ, క్యూసీ1 పేర్లతో వీటిని విడుదల చేసింది.

SPORTS NEWS

ఐసీసీ టెస్టు ర్యాంకులలో టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి జస్‌ప్రీత్‌ బుమ్రా మొదటి స్థానంలో, యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ రెండో స్థానంలో నిలిచారు.

గుజరాత్‌ బ్యాటర్‌ ఉర్విల్‌ పటేల్‌ 28 బంతుల్లోనే శతకాన్ని పూర్తిచేశాడు. ఈ క్రమంలో అతడు టీ20లలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ రెండో రౌండ్‌కు ప్రవేశించారు.

ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)తో బుధవారం జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో తెల్లపావులతో ఆడిన గుకేశ్‌ విజయం సాధించాడు. దీంతో చెరో 1.5 పాయింట్లతో ఉన్నారు.

EDUCATION & JOBS UPDATES

జనవరి 31న నీట్‌ ఎండీఎస్‌, మార్చి 29-30న నీట్‌ ఎస్‌ఎస్‌ పరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీసీ మరియు బైపీసీ స్ట్రీమ్ లలో ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు

తెలంగాణ సెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నవంబర్ 30 నుండి డిసెంబర్ మూడో తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NMMSE రాత పరీక్ష డిసెంబర్ 8న జరగనుంది. హల్ టిక్కెట్లు విడుదల చేశారు.

నవోదయ లో 9,11 తరగతి ప్రవేశ నోటిఫికేషన్ దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ నేటితో ముగియనుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు