BIKKI NEWS (DEC 28) : TODAY NEWS IN TELUGU on 28th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 28th DECEMBER 2024
TELANGANA NEWS
2025 ఏడాదికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి.. రేవంత్ సర్కార్‌కు మాజీ సర్పంచ్‌ల డిమాండ్
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
కేటీఆర్‌ను 31 వరకు అరెస్టు చేయొద్దు.. తాజాగా హైకోర్టు ఉత్తర్వులు
పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య, ముగ్గురు నిందితుల అరెస్ట్
ANDHRA PRADESH NEWS
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు ఇస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపిస్తు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం.. ఇక వారానికి రెండు సార్లు అనుమతి
NATIONAL NEWS
నేడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఉదయం 11.45 గంటలకు నిర్వహించనున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర క్యాబినెట్ సంతాపం, శ్రద్దాంజలి ఘటించిన సీడబ్ల్యూసీ.
మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకపూట సెలవు.
పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కి మరణించారు.
అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగికదాడి ఘటనను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనకు నిరసనగా కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకున్నారు.
2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన 8,360 మంది అభ్యర్థుల్లో 7,190 మంది తమ డిపాజిట్లను కోల్పోయారు. అంటే 86 శాతం మందికి డిపాజిట్ దక్కలేదు.
INTERNATIONAL NEWS
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా తప్పుకోనున్నట్లు సమాచారం.
జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంట్ అప్‌డేట్ విడుదల చేయలేదు.
విదేశీ నిపుణులు అమెరికా ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించే హెచ్1బీ వీసాలపై అమెరికా పరిమితిని తొలగించనున్నట్లు సమాచారం.
త్వరలోనే మాల్డోవాపై దాడికి రష్యా సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 78,699.07 (226)
నిఫ్టీ : 23,813.40 (63)
యూపీఐ వాలెట్ సొమ్ము ను థర్డ్ పార్టీ యాప్ ద్వారా చెల్లింపుకు అవకాశం. – ఆర్బీఐ
డిసెంబర్ 20తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 644.391 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 18,461 బ్యాంకింగ్ మోసాలు జరిగాయని తెలిపింది. వీటి విలువ రూ.21,367 కోట్లని ఆర్బీఐ పేర్కొంది.
SPORTS NEWS
బాక్సింగ్ డే టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి.. ఇండియా 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. ఆసీస్ 474/10 పరుగులు చేసింది.
ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) తాజా ఎడిషన్‌లో యూపీ యోధాస్, పాట్నా పైరేట్స్ సెమీస్‌కు అర్హత సాధించాయి.
ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
వెస్టిండీస్ తో మూడో వన్డే విజయం తో క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ టెట్ హల్‌టికెట్లు విడుదల. పరీక్షలకు 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత
MPHA (F) రాత పరీక్షల హల్ టికెట్లు విడుదల. డిసెంబర్ 29న రాత పరీక్ష.
బ్యాంకు ఆప్ బరోడా లో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్
CA FINAL RESULTS విడుదల
- CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 02 – 2025
- NEET UG 2025 NOTIFICATION – నీట్ యూజీ నోటిఫికేషన్, దరఖాస్తు లింక్
- GRAMMY AWARDS 2025 – గ్రామీ అవార్డులు 2025 పూర్తి జాబితా
- GK BITS IN TELUGU FEBRUARY 8th