BIKKI NEWS (NOV. 27) : TODAY NEWS IN TELUGU on 27th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 27th NOVEMBER 2024
TELANGANA NEWS
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు.
ధాన్యం కొనుగోళ్లను త్వర గా పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్లను, అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు
ఇథనాల్ పరిశ్రమను తరలించాల్సిందే అంటూ నిర్మల్ జిల్లాలో నిరసన
గోదావరి, కృష్ణా జలాల్లో సహస క్రీడలు
మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం విచారణ జరుపనున్నది.
2008 డీఎస్సీలో నష్టపోయిన బాధితులకు ఉద్యోగాలిచ్చేందుకు అర్హులైన వారి లెక్కను పాఠశాల విద్యాశాఖ తేల్చింది. ఎట్టకేలకు 1,399 మంది ఉద్యోగాలు పొందేందు కు అర్హులని గుర్తించింది.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్ జరిగింది. మంగళవారం నాడు మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ANDHRA PRADESH NEWS
తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం
రాబోయే 24 గంటల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు
అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంలో వైఎస్ జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
అమరావతి లో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం.
NATIONAL NEWS
రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కార్యనిర్వాహక, న్యాయ, శాసన వ్యవస్థలు కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు.
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు
ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చనే ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓడిపోయినప్పుడే ఈవీఎంల ట్యాంపర్ గురించి మాట్లాడతారని వ్యాఖ్యానించింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లతో ఓటింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటికి బదులుగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్‌నే వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభిప్రాయాన్ని వెల్లడించారు.
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు
https://constitution75.com – భారత రాజ్యాంగంపై కొత్త వెబ్‌సైట్
INTERNATIONAL NEWS
తాజా లెక్కల ప్రకారం అమెరికా అప్పు ఏకంగా 36 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. భారత కరెన్సీలో ఇది అక్షరాలా 3,035 లక్షల కోట్ల రూపాయలు.
దేశద్రోహం ఆరోపణలపై ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు
పీటీఐ కార్యకర్తల ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్..
BUSINESS NEWS
మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ : 80,004 (-106)
నిఫ్టీ : 24,194 (-27)
పాన్ 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా ట్యాక్స్ చెల్లించే వారికి మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించనున్నారు. ఈ కార్డులో పాన్ సేవలతోపాటు పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలను కూడా ఏకీకృతం చేయనున్నారు.
హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ బంగారం ధర ఏకంగా రూ.1,310 పడిపోయింది. రూ.77,240 వద్ద స్థిరపడింది.
SPORTS NEWS
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి గేమ్‌లో ఓటమిపాలైన భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.
ఇటలీలోని మాంటెసిల్వానో వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ అండర్-8 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అదుల్లా దివిత్‌రెడ్డి విజేతగా నిలిచాడు.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా వేటు పడింది. డోపింగ్ పరీక్ష కోసం శాంపిల్స్ ఇవ్వని కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) మంగళవారం బజరంగ్‌పై నాలుగేండ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలపై నెలకొన్న సందిగ్ధతను తొలిగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం సమావేశమవనుంది.
అత్యంత పిన్నవయస్కుడైన వైభవ్ రఘువంశీని ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
EDUCATION & JOBS UPDATES
IICT లో 31 శాస్త్రవేత్తల ఉద్యోగాలకు నోటిఫికేషన్
Nursing officer రాత పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసిన MHSRB
నేడు ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ విడుదల.
1000 ప్రభుత్వ పాఠశాలలను నవీకరించనున్నట్లు క్రెడాయ్ తెలిపింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్