TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 11 – 2024

BIKKI NEWS (NOV. 25) : TODAY NEWS IN TELUGU on 25th NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 25th NOVEMBER 2024

TELANGANA NEWS

లగచర్ల ఘటనపై విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వేగవంతం చేసింది.

హైదరాబాద్‌ మధురానగర్‌లో ఉన్న మా ఇల్లు బఫర్‌ జోన్‌ పరిధిలోకి రాదు. ఇరిగేషన్‌ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం జరిగింది’ అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గిరిజన రైతులు, ప్రజలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్‌ జిల్లాలో సోమవారం మహాధర్నా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం, ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా పనుల జాతరను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుటుంబం నిర్వహించే ఓ ఫంక్షన్‌లో ఆయన పాల్గొనున్నారు.

సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తకువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ANDHRA PRADESH NEWS

విద్యార్థులపై కక్షగట్టిన చంద్రబాబు .. ఫీజులు చెల్లించలేక చదువులు మానేస్తున్నారని జగన్‌ ఆరోపణ

వైఎస్సార్‌సీపీ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ రాష్ట్ర నేతలైన సజ్జల భార్గవ్‌, అర్జున్‌రెడ్డితో పాటు మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో ఏపీ విభజన చట్టం హామీల అమలుపై చర్చిస్తాం : టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు.

ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని మృతి చెందాడు.

NATIONAL NEWS

పట్టణీకరణతో పిచ్చుకలు కనుమరుగు.. ప్రధాని మోదీ ఆవేదన

జార్ఖండ్‌ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత హేమంత్‌ సొరేన్‌ 28న మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్‌ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్‌ (సవరణ) సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. మణిపూర్‌ హింస, గౌతమ్‌ అదానీ అవినీతి చర్యలపై యూఎస్‌ అరెస్ట్‌ వారెంట్‌ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వర్గాలు కోర్టు తీర్పులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు.

అంతరిక్షంలోని ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన ‘మినీ బ్రెయిన్స్‌’ నాడీ సంబంధమైన అనేక వ్యాధులకు పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు.

INTERNATIONAL NEWS

భూతాపాన్ని అరికట్టేందుకు సంపన్న దేశాలు..పేద దేశాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని తాజా ఒప్పందం 300 బిలియన్‌ డాలర్లకు(సుమారుగా రూ.25లక్షల కోట్లు) పెంచింది కాప్ 29

అదానీ గ్రూప్‌తో విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు ఇప్పటికే కెన్యా ప్రకటించగా, తాజాగా బంగ్లాదేశ్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.

రష్యా సైన్యంలోకి నిరుపేద యెమెన్‌ యువత

BUSINESS NEWS

స్టాక్ మార్కెట్ ఈ వారం కదలికలపై తీవ్రరూపం దాల్చుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికాలో అదానీపై కేసు, క్యూ2 జీడీపీ గణాంకాలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు, గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్ల తీరుతెన్నులు, ముడి చమురు ధరలు కూడా ముఖ్యమే. దీంతో ఆటుపోట్లకు ఆస్కారం ఎక్కువగానే ఉన్నది.

గౌతం అదానీ- హిండెన్ బర్గ్ వివాదంపై అమెరికా కోర్టులో అభియోగాలను రికార్డులుగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ నెలలో ఇప్పటి వరకూ దేశీయ స్టాక్ మార్కె్ట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.26,533 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించారు

SPORTS NEWS

ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా) మధ్య నేటి నుంచి మ్యాచ్ లు ప్రారంభం.

పెర్త్ టెస్ట్ లో కోహ్లీ, యశస్వీ సెంచరీలు… గెలుపు ముంగిట టీమిండియా.

ఐపీఎల్ వేలంలో 27 కోట్ల రికార్డు ధర పలికిన రిషభ్ పంత్

భారత టెన్నిస్‌ ద్వయం ఎన్‌ శ్రీరామ్‌ బాలాజీ-రిత్విక్‌ చౌదరి ఇటలీలో జరిగిన ఏటీపీ చాలెంజర్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

జింబాబ్వే చేతిలో పాకిస్థాన్‌ పరాభవం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బులవాయో వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే.. 80 పరుగుల తేడా(డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో)తో గెలిచింది

EDUCATION & JOBS UPDATES

జేఈఈ మెయిన్స్‌-1కు దరఖాస్తుల స్వీకరణ ముగియగా, దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు డిసెంబర్ 27 వరకు ఎన్టీఏ(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) తాజాగా అవకాశమిచ్చింది.

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీ-శాట్‌ ‘జనరల్‌ స్టడీస్‌ ఫర్‌ ఆల్‌’ పేరిట ఐదు నెలలపాటు అందించాలని నిర్ణయించింది.

తెలంగాణ సైనిక సంక్షేమశాఖలో డ్రైవర్‌ పోస్టులకు మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన టీజీఎస్‌ఆర్టీసీలో 1201డ్రైవర్‌ పోస్టులకు సైనిక సంక్షేమశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

TGPSC – నేటి నుండి డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రారంభం.

IBPS 4450 PO జాబ్బ్ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల.

RPF SI పరీక్షల సిటీ ఇంటిమెషన్ స్లిప్స్ విడుదల.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు