TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 09 – 2024

BIKKI NEWS (SEP. 24) : TODAY NEWS IN TELUGU on 24th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 24th SEPTEMBER 2024

TELANGANA NEWS

ప్ర‌తి కుటుంబానికి డిజిట‌ల్ కార్డు.. సంక్షేమం నుంచి ఆరోగ్య శ్రీ వ‌ర‌కూ అన్ని సేవ‌లూ అందులోనే.

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యి

తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు అందజేసిన మహేశ్‌ బాబు

మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌ పార్కు ప్రాంతంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు.

సీనియ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా ల‌క్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమృత్‌ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, టోచన్‌ సాహూకు గ‌త శుక్ర‌వారం లేఖ రాశారు.

ఈ ఖరీఫ్ నుండి సన్న వడ్లకు 500/- రూపాయల బోనస్ – ఉత్తమ్

సింగరేణి జెన్‌కో ఆధ్వర్యంలో రామగుండం విద్యుత్ ప్లాంట్

ANDHRA PRADESH NEWS

నేను అపరాధం చేస్తే నాతో పాటు కుటుంబం సర్వనాశనం కావాలి.. తిరుమలలో మాజీ చైర్మన్‌ భూమన ప్రమాణం

తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌.. తమిళనాడు కంపెనీకి షోకాజ్‌ నోటీసులు..

తిరుమల లడ్డూ వ్యవహారంలో మరో కీలక పరిణామం..! ‘సుప్రీం’లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిల్‌..

నియోజకవర్గాల వారీగా ప్రతినెలా జాబ్ మేళా – లోకేష్

100 ఎకరాలలో అంతర్జాతీయ న్యాయ కళాశాల – చంద్రబాబు

NATIONAL NEWS

చైల్డ్ పోర్న్ వీడియోలు వీక్షించ‌డం, డౌన్‌లోడ్ చేయ‌డం.. పోక్సో నేర‌మే: సుప్రీంకోర్టు

భారత్‌లో క్లేడ్‌-ఐ మంకీపాక్స్‌ తొలి కేసు నమోదైంది. కేరళకు వ్యక్తికి ఈ వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కేర‌ళ‌లోని కాస‌ర్‌గ‌డ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మ‌ణికంద‌న్ అనే వ్య‌క్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధితో మృతిచెందాడు.

అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గూగుల్‌ టు ఎన్విడియా.. 15 టాప్‌ టెక్‌ సీఈవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌ జిల్లాలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్ట్‌ సహా ముగ్గురు హతమయ్యారని సీనియర్‌ పోలీస్ అధికారి తెలిపారు.

పుణె విమానాశ్రయం పేరును ‘జగద్గురు సంత్‌ తుకారాం మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం’ గా మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్‌లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 448 డెంగ్యూ కేసులు నమోదు.

ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్‌ లైంగికదాడుల కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు.

INTERNATIONAL NEWS

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భారీగా వైమానిక దాడులు జరిపింది. హిజ్బుల్లా గ్రూప్‌ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో 272 మంది వరకు గాయపడ్డారని తెలిపింది.

స్సేస్ స్టేష‌న్ క‌మాండ‌ర్‌గా సునీతా విలియ‌మ్స్ బాధ్య‌తలు స్వీక‌రించింది. ర‌ష్యా కాస్మోనాట్ ఓలెగ్ ఆ బాధ్య‌త‌ల‌ను ఆమెకు అప్ప‌గించిన‌ట్లు నాసా ప్ర‌క‌టించింది. స్పేస్ స్టేష‌న్‌కు రెండోసారి సునీతా క‌మాండ‌ర్ అయ్యారు.

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణస్వీకారం

నవంబర్‌ 5న జరిగే ఎన్నికల్లో తాను గెలవకపోతే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

BUSINESS NEWS

ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి సూచీలు..

సెన్సెక్స్ : 84,929 (384)
నిఫ్టీ : 25,939 (148)

ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో 1.1 కోట్ల మందికి నష్టాలు.. సెబీ ఆందోళన

తెలియనివారి అకౌంట్స్‌ని బ్లాక్‌ చేసేలా వాట్సాప్‌ ఫీచర్‌ని తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ‘బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్‌నౌన్‌ అకౌంట్స్’ అనే ఆప్షన్‌తో రానున్నది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ని ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.20.16 వెర్షన్‌లో అందులోకి తెచ్చింది.

SPORTS NEWS

భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు, తొలి వ‌రల్డ్ క‌ప్ హీరో సునీల్ గ‌వాస్క‌ర్‌ కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ముంబైలోని బాంద్రాలో కోట్ల రూపాయ‌లు విలువ చేసే స్థ‌లాన్నిస్వాధీనం చేసుకుంది.

ఐసీసీ పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ క్రేజ్‌ను మ‌రింత పెంచేందుకు థీమ్ పాటను విడుద‌ల చేసింది. ‘వాటెవ‌ర్ ఇట్ టేక్స్’ తెలుగులో ‘ఏదైనా చేసేద్దాం’ అనే టైటిల్‌తో కూడిన ఈ పాట వీడియో వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీతో మొద‌ల‌వుతుంది.

92 ఏండ్ల భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో 580 టెస్టులు ఆడిన టీమిండియా తొలిసారి ఓటముల కంటే విజయాల సంఖ్య పెరిగింది. 580 టెస్టుల్లో 179 విజయాలు సాధించ‌గా.. 178 ఓటములు ఎదుర‌య్యాయి. 222 మ్యాచ్‌లు డ్రా కాగా ఒక మ్యాచ్‌ టై అయింది.

తొలి టెస్టులో కివీస్‌పై శ్రీలంక విజ‌యం సాధించింది. 63 ర‌న్స్ తేడాతో గాలె టెస్టులో విక్ట‌రీ కొట్టింది

EDUCATION & JOBS UPDATES

ఇంటర్ అడ్మిషన్స్ గడువు 500/ ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 30 వరకు పెంపు.

టీజీ సెట్‌ ప్రాథమిక కీ విడుదల. కీ పై అభ్యంతరాల స్వీకరణకు 26 వరకు గడువు

డిగ్రీ అర్హతతో రైల్వే లో 8113 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ENTERTAINMENT UPDATES

ఆమీర్‌ ఖాన్ ప్రోడ‌క్షన్‌లో, ఆయన మాజీ భార్య కిరణ్‌ రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా 2025 ఆస్కార్‌ కు మన దేశం నుంచి ఎంపికైంది.

దేవర టికెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. అర్ధరాత్రి ఒంటి గంట ఆటకు కూడా అనుమతి.

హరి హరవీరమల్లు మూవీని 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

టాలీవుడ్ నుంచి ఆస్కార్ 2025 కు ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ, తేజ సజ్జా హనుమాన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ నటించిన మంగళవారం బరిలో నిలిచినట్టు ఫిలింనగర్ సర్కిల్‌లో ఓ వార్త వైరల్ అవుతోంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు