TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 10 – 2024

BIKKI NEWS (OCT. 24) : TODAY NEWS IN TELUGU on 24th OCTOBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 24th OCTOBER 2024

TELANGANA NEWS

గ్రూప్‌ -1 పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరవుతున్నారు. బుధవారం వరకు 32 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను తీరం వైపు దూసుకొస్తున్నది. గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది

హైడ్రా తీరును వ్యతిరేకిస్తూ వ్యక్తిగత హోదా లో పాల్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రీనివాస్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.

పుప్పొడి స్వరూపంలోని సంక్లిష్టమైన అందాన్ని వస్త్రరూపకల్పనలో పొందుపరిచి ‘పరాగమంజరి’అనే నూతన వస్త్ర కళారూపానికి ఓయూ బోటనీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అల్లం విజయభాస్కర్‌రెడ్డి, విద్యార్థిని శివాని జీవం పోశారు.

జపాన్‌లోని దవాఖానల్లో నర్సింగ్‌ ఉద్యోగుల నియామకానికి టామ్‌కామ్‌(తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తనపై చేసిన నిరాధార వ్యాఖ్యల కారణంగా తన పరువుకు భంగం కలిగిందంటూ ఆయనకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు లీగల్‌ నోటీసులు పంపారు

ANDHRA PRADESH NEWS

దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లు – కేబినెట్ ఆమోదం

APPSC చైర్మన్ గా అనురాధ నియామకం

దానా తుఫాను తీవ్ర రూపం – నేటి అర్ధరాత్రి తీరం దాటే అవకాశం.

అత్యచార బాధితులకు తమ పార్టీ తరపున 10 లక్షల ఆర్థిక సహాయం – వైయస్ జగన్

ఆస్తుల వివాదం.. తల్లి, చెల్లిపై పిటిషన్‌ వేసిన మాజీ సీఎం వైఎస్‌ జగన్

వైఎస్సార్‌ జిల్లాలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు పులివెందుల సమీపంలో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది.

NATIONAL NEWS

పర్యావరణ పరిరక్షణ చట్టాలకు కోరలు పీకేసి నిర్వీర్యం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్‌ వేశారు.

వినియోగదారు నుంచి 50 పైసలు అదనంగా తీసుకున్న ఇండియన్‌ పోస్ట్‌కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్‌ ఇచ్చింది. 50 పైసలతోపాటు నష్టపరిహారం కింద రూ.10,000; వ్యాజ్య ఖర్చుల కోసం రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది.

పూర్తిగా మెరుగుపర్చిన భద్రత, సౌకర్యాలతో తయారు చేసిన వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను చెన్నైలోని ఇంటీగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) బుధవారం ఆవిష్కరించింది.

బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ (స్పిరిట్‌) ఉత్పత్తి, తయారీ, సరఫరాపై నియంత్రణ అధికారం రాష్ర్టాలకే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

INTERNATIONAL NEWS

బ్రిక్స్‌లో చేరేందుకు 30 దేశాలు ఆసక్తి చూపుతున్నాయ్ : రష్యా అధ్యక్షుడు పుతిన్‌

బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దిన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ రాజధాని ఢాకాలో నిరసనలు మొదలయ్యాయి.

చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. యుద్ధానికి మద్దతివ్వం.’ అని బ్రిక్స్ సమావేశంలో మోదీ పేర్కొన్నారు.

BUSINESS NEWS

నష్టాలలో స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 80,082 (-139)
నిఫ్టీ : 24,435 (-37)

SPORTS NEWS

అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డు స్కోరు సాదించిన జింబాబ్వే 344/4. గాంబీయా తో జరిగిన మ్యాచ్ లో ఈ స్కోర్ సాధించింది.

న్యూజిలాండ్‌ వర్ధమాన క్రికెటర్‌ చాడ్‌ బోవ్స్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన (103 బంతుల్లోనే ) ద్విశతకాన్ని నమోదుచేశాడు.

నేటి నుంచి న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్లు గిల్‌, పంత్‌ ఫిట్‌

EDUCATION & JOBS UPDATES

SSC SI EXAM FINAL KEY. 4187 ఎస్సై ఉద్యోగ పరీక్షల తుది కీ విడుదల

యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3883 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీ కి ప్రకటన

యూనియన్ బ్యాంకు లో 1500 లోకల్ బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగాలు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు