BIKKI NEWS (NOV. 24) : TODAY NEWS IN TELUGU on 24th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 24th NOVEMBER 2024
TELANGANA NEWS
రాష్ట్రంలో డిసెంబ ర్ 1నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
డిసెంబర్ 8 నుంచి 16 వరకు రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
కొండా సురేఖపై కేటీఆర్ కేసు విచారణ 27కు వాయిదా
గ్రూప్-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హిందీ మహావిద్యాలయ కళాశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.
ANDHRA PRADESH NEWS
విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్.
జగన్ హయంలో నిర్ణయాలన్ని సీఎంవో లోనే – బాలినేని
బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపు వాయుగుండంగా మారే అవకాశం.
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో 7గురు మృతి
NATIONAL NEWS
మహాయుతికే మహారాష్ట్ర ప్రజలు జైకొట్టారు. హోరాహోరీ అనుకున్న పోరులో ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. 288 నియోజకవర్గాలకు గానూ 233 స్థానాల్లో గెలిపించి మళ్లీ అధికారంలో కూర్చోబెట్టారు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జేఎంఎం కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది.
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 4.1 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
వ్యవసాయరంగ సమస్యల పరిష్కారంలో భాగంగా రైతులకు ప్రత్యక్ష ఆదాయ తోడ్పాటును అందించేందుకు, కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సూచించింది.
INTERNATIONAL NEWS
కొత్తగా తయారు చేసిన ఓరష్నిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది. ఆ క్షిపణి మాక్ 10 వేగంతో వెళ్తుంది
లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయిల్ చేసిన దాడిలో ఓ బిల్డింగ్ నేలమట్టం అయ్యింది. ఆ ఘటనలో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన హింసలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు.
BUSINESS NEWS
ట్రంప్ గెలిచిన దగ్గర్నుంచి మస్క్ ఆస్తుల విలువ ఏకంగా 70 బిలియన్ డాలర్లు (రూ.5.89 లక్షల కోట్లు) ఎగబాకింది.
ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచ అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్.. 334.3 బిలియన్ల డాలర్ల తో నిలిచాడు.
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్‌కు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సమన్లు జారీ చేసింది.
SPORTS NEWS
పెర్త్ టెస్టులో పట్టు బిగించిన టీమిండియా, రెండో రోజు ఆట ముగిసే సరికి 218 పరుగుల ఆధిక్యతలో ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి.
నేడు, రేపు ఐపీఎల్ మెగా వేలం. మొత్తం 577 మంది ప్లేయర్లు వేలంలో పోటీపడుతున్నారు
దక్షిణాఫ్రికాతో రెండు సెంచరీల చేసిన తిలక్ వర్మ, మేఘాలయతో మ్యాచ్‌లోనూ వర్మ సెంచరీతో (151) విజృంభించాడు. ఈ క్రమంలో టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
చైనా మాస్టర్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి పోరాటం సెమీస్ లో ముగిసింది
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ పరీక్షకు 95.69% మంది అభ్యర్థుల హజరు.
డిసెంబర్ 8 – 16 వరకు హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ.
NIFT – (ప్యాషన్ టెక్నాలజీ) UG, PG, PhD అడ్మిషన్లు.
UPSC – ESE 2024 RESULTS
ECIL లో గ్రాడ్యుయేట్, డిప్లోమా అప్రెంటీస్ ఖాళీలు.