TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 12 – 2024

BIKKI NEWS (DEC 24) : TODAY NEWS IN TELUGU on 24th DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 24th DECEMBER 2024

TELANGANA NEWS

నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటన్నట్లు హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు.

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌ పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించే అవకాశముంది.

వీఆర్వోల నియామక ప్రక్రియ షురూ… పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు

రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల మహిళలతో సోలార్‌ పవర్‌ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

తెలంగాణ క్యాబినెట్‌ సమావేశం ఈ నెల 30న జరుగనున్నది

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ అధినేతలు మైత్రీ అధినేతలు రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని 50 లక్షల ఆర్థిక సాయం చేశారు.

మొదటి సంవత్సరంలో థియరీ క్లాసులు, రెండో సంవత్సరంలో స్కిల్లింగ్‌.. మూడో సంవత్సరంలో అనుభవపూర్వకమైన అభ్యసనం(ఎక్స్‌పీరియన్షిల్‌ లెర్నింగ్‌). ఇలా వినూత్నంగా డిగ్రీ కోర్సులను కొత్తపుంతలు తొక్కించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.

నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావాలని అల్లు అర్జున్ కు నోటీసులు

ANDHRA PRADESH NEWS

అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో స్టీల్ ప్లాంట్ మరియు హైడ్రోజన్ ప్లాంట్లకు జనవరి 8న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు

అమరావతి వారార్ తో నేడు జాతీయ రహదారుల అనుసంధానం

మరో 2000 నూతన ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారు

ఏపీ ఆర్టీసీలో 11500 పోస్టులను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు

జనవరి 2 నుండి విజయవాడలో పుస్తక ప్రదర్శన

నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

NATIONAL NEWS

నో డిటెన్ష‌న్ విధానం ర‌ద్దు.. 5, 8 త‌ర‌గ‌తులు త‌ప్ప‌నిస‌రిగా పాస్ కావాల్సిందే.

ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ సోమవారం కన్నుమూశారు. పద్మభూషణ్‌, ఫాల్కే అవార్డులతో గౌరవించిన కేంద్ర ప్రభుత్వం

పీఎస్‌ఎల్‌వీ-సీ60 మిషన్‌ను ఈ నెల 30న ఇస్రో ప్రయోగిచనుంది. ఈ ప్రయోగం లో రెండు శాటిలైట్స్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టడమేగాక, ఆ రెండింటినీ కలుపుతూ(డాకింగ్‌), విడగొడుతూ(అన్‌డాకింగ్‌) ‘స్పేస్‌ డాకింగ్‌’ అనే ప్రక్రియను ఇస్రో ప్రదర్శించబోతున్నది.

వచ్చే వారమే మత్స్య 6000 హార్బర్‌ టెస్ట్‌. విజయవంతమైతే 2026లో అసలు ప్రయోగం. సముద్రగర్భ అన్వేషణకు ముగ్గురితో బృందం.

2018 నుంచి 2022 మధ్యకాలంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అయినవారిలో జనరల్‌ క్యాటగిరి నుంచి 46.5 శాతం ఉండగా, ఓబీసీకి చెందిన వారు 29.4 శాతం, షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారు 16.33 శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వారు 7.83 శాతం మంది ఉన్నారు

జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీ రామసుబ్రమణియన్‌ సోమవారం నియమితులయ్యారు.

మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాను త‌మ‌కు అప్ప‌గించాల‌ని ఇవాళ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌భుత్వం భార‌త్‌కు లేఖ‌ను రాసింది.

గ‌త ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో త‌మ ప్ర‌భుత్వం యువ‌త‌కు సుమారు 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు.

విత్తనాలు మొలకెత్తటం అంతరిక్షంలో ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు ‘ఇస్రో’ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నది

శవంతో సెక్స్‌ చేయడం నేరం కాదు.. దోషిని శిక్షించే అవకాశం లేదు: ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు

INTERNATIONAL NEWS

భారతీయులకు మలేషియా ప్రభుత్వం మరో రెండేండ్ల పాటు వీసా మినహాయింపు కల్పించింది.

రష్యాకు చెందిన 47 డ్రోన్ల‌ను కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది.

కృత్రిమ మేధ(ఏఐ)పై సీనియర్‌ వైట్‌హౌస్‌ పాలసీ సలహాదారుగా ఇండియన్‌ అమెరికన్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ను డొనాల్డ్‌ ట్రంప్‌ నియమించారు

డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్‌ ను చేజిక్కించుకుంటామని, పనామా కాలువను తమకు అప్పగించాలని ట్రంప్ తెలిపారు.

విజయవంతమైన క్యాన్సర్‌ ఔషధం డోస్టర్లిమాబ్‌ (బ్రాండ్‌ పేరు జెంపెర్లి) త్వరలోనే విస్తృతంగా అందుబాటులోకి రాబోతున్నది. దీనికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) బ్రేక్‌త్రూ థెరపీ డిజిగ్నేషన్‌ హోదాను ఇచ్చింది.

BUSINESS NEWS

సెన్సెక్స్‌ 499, నిఫ్టీ 166 పాయింట్లు వృద్ధి

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 7 పైసలు క్షీణించి 85.11 వద్ద ముగిసింది

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2000 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ లక్ష కోట్ల డాలర్ల మార్కును దాటాయి.

ఎఫ్‌డీఐ పెట్టుబడుల్లో మారిషస్ నుంచి 25 శాతం పెట్టుబడులు వచ్చాయి.

ఫిబ్రవరి ఒకటో తేదీన (శనివారం) స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి.. తేల్చి చెప్పిన బీఎస్ఈ.. ఎన్ఎస్ఈ

నిస్సాన్‌, హోండా కంపేనీల విలీనం.. ప్ర‌క‌ట‌న చేసిన రెండు కంపెనీలు

SPORTS NEWS

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి హస్పిటల్ లో చేరాడు.

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

రాష్ట్రంలో బాక్సర్లను ప్రోత్సహించే దిశగా భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించింది.

EDUCATION & JOBS UPDATES

నో డిటెన్ష‌న్ విధానం ర‌ద్దు.. 5, 8 త‌ర‌గ‌తులు త‌ప్ప‌నిస‌రిగా పాస్ కావాల్సిందే

71 వేల మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోడీ

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు