TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 08 – 2024

BIKKI NEWS (AUG 24) : TODAY NEWS IN TELUGU on 24th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 24th AUGUST 2024

TELANGANA NEWS

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 27 మందితో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఉద్యోగుల జేఏసీ నేతలు జగదీశ్వర్‌, శ్రీనివాసరావు వెల్లడించారు.

ప్రజాపాలనలో పూర్తిగా పడకేసిన ప్రజారోగ్యం.. విష జ్వ‌రాల‌తో జ‌నం ప‌రేషాన్ : కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఎములాడ రాజన్న ఆలయంలో రెండో రోజు ఏసీబీ సోదాలు

దళితబంధు లబ్ధిదారుల పోరుబాట.. ప్రజాభవన్‌ వద్ద ధర్నా

ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్‌ సూట్లను విచారించే అధికారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో)కి లేదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

టీ-ఫైబర్‌కు రూ.1,779 కోట్ల మేర వడ్డీలేని దీర్ఘకాలిక రుణం ఇవ్వాలని కేంద్ర టెలికం, కమ్యూనికేషన్లశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.

తన ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో గానీ, బఫర్‌ జోన్‌లో గానీ ఉన్నట్టయితే వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను ఆదేశిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు

రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులకు దశలవారీగా మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన రుణమాఫీపై అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల హాస్టళ్లను నెలలో ఒకరోజు తప్పక విజిట్‌ చేయాలని, రాత్రి అక్కడే నిద్రించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు

జాతీయ, అంతర్జాతీయ క్రీడలను తెలంగాణలో నిర్వహించడానికి అనుమతి ఇవ్వండి కేంద్రమంత్రి తో రేవంత్ రెడ్డి

ANDHRA PRADESH NEWS

రెడ్‌బుక్‌ మీద పెట్టిన శ్రద్ధ.. పాలనపై పెడితే ఈ ప్రమాదాలు జరిగేవి కాదు.. వైఎస్‌ జగన్‌ ఫైర్

విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో 17 మంది కార్మికుల మరణాలకు, క్షతగాత్రులకు కారణమైన ఎసెన్షియా ఫార్మా కంపెనీని సీజ్‌ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

ప్రజలు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కానీ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఇస్తే హోదా.. గెలిపిస్తే పదవి వస్తాయని అన్నారు. నేరాలు, బెదిరింపులతో హోదా, పదవులు రావని చంద్రబాబు అన్నారు.

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

ఏపీలో సంచలనంగా మారిన అగ్రి గోల్డ్‌ భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ కు శుక్రవారం బెయిల్‌ మంజూరయ్యింది.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. పాల్వాయి గేటు, కారంపూడి కేసుల్లో ఏపీ హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

సినిమాల కంటే కూడా నాకు సమాజమే ముఖ్యం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ కీలక వ్యాఖ్యలు

గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ( రాయచోటి), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), వేంపల్లి సతీశ్‌రెడ్డి(పులివెందుల)ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రేడియంట్స్‌ సంస్థలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

NATIONAL NEWS

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల వైద్యురాలి నలుగురు సహోద్యోగుల వాంగ్మూలం పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రిన్సిపాల్‌తోపాటు ఈ నలుగురికి లై డిటెక్టర్ టెస్ట్‌ కోసం కోర్టు అనుమతి పొందింది.

జార్ఖండ్‌ రాజధాని రాంచి రణరంగమైంది. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీజేపీ యువమోర్చా నేతల ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు.

కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీతో శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.

భారత ఆర్మీకి చెందిన వ్యూహాత్మక డ్రోన్ అనుకోకుండా నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటింటి. పాకిస్థాన్‌లో అది ల్యాండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీ డ్రోన్‌ను పాకిస్థాన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ సంఘటన జరిగింది.

లక్నో లో ప్రైవేట్ స్కూల్‌ బిల్డింగ్‌ పాక్షికంగా కూలింది. పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు.

కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విచారణ వేగవంతంగా జరుగుతున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన సంజయ్‌ రాయ్‌ని ఇప్పటికే అరెస్ట్‌ చేసిన సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల కస్టడీకి అప్పగించింది.

భారత్‌కు చెందిన ఓ ప్రయాణికుల బస్సు నేపాల్‌ లో నదిలోకి దూసుకెళ్లింది. నదిలోకి దూసుకెళ్లిన బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

ఎస్సీ, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ, ఇండియా కూట‌మిని త‌ప్పుప‌ట్టిన మాయావ‌తి.

దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా అస్సాంలోని నాగావ్‌ జిల్లా దింగ్‌ ప్రాంతంలో 14 ఏండ్ల బాలిక సామూహిక లైంగిక దాడికి గురైంది.

మానవ శరీరాన్ని ప్లాస్టిక్‌ ఆక్రమించేస్తున్నదని, ఆఖరికి మెదడు కణజాలంలోకి కూడా మైక్రోప్లాస్టిక్‌ చేరిందని పరిశోధకులు గుర్తించారు.

INTERNATIONAL NEWS

యుద్దానికి ముగింపు పలకండి – జెలన్‌స్కీ తో మోడీ.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం రష్యాతో యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారుల గౌరవార్ధం నిర్మించిన డాక్యుమెంటరీని జెలన్‌స్కీతో కలిసి ప్రధాని వీక్షించారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధాని నివాళులు అర్పించారు.

డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా క‌మ‌లా హ్యారిస్ నామినేష‌న్ ఆమోదించారు. డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున అధ్య‌క్ష అభ్య‌ర్థిగా నామినేష‌న్ స్వీక‌రించిన రెండో మ‌హిళ‌గా క‌మ‌లా హ్యారిస్ నిలిచారు

BUSINESS NEWS

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్ లు

సెన్సెక్స్ : 81086 (33)
నిఫ్టీ : 24823 (12)

జనవరి – జూన్ 2024వరకు భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది

అనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం విధించింది సెబీ. దీంతో పాటు అత‌నికి 25 కోట్ల జ‌రిమానా కూడా వేసింది. ఆర్‌హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన నిధుల్ని అక్ర‌మ‌రీతిలో త‌ర‌లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనాల ప్రకారం 2024లో 6.7 శాతం మాత్రమే వృద్ధిని సాధించనున్న భారత్‌.. ఆ తర్వాతి ఏడాది 6.4 శాతానికి పరిమితం కానున్నదని పేర్కొంది.

SPORTS NEWS

ష‌కీబ్ అల్ హ‌స‌న్‌పై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు అయ్యింది. ర‌ఫీకుల్ ఇస్లామ్ ఈ కేసు దాఖ‌లు చేశారు. ఆగ‌స్టు 7వ తేదీన జ‌రిగిన ర్యాలీలో ర‌ఫీకుల్ కుమారుడు రూబెల్ మ‌ర‌ణించాడు.

భార‌త అథ్లెట్‌, రేస్ వాక‌ర్ భావ్నా జాట్‌పై.. 16 నెల‌ల బ్యాన్ విధించారు. యాంటీ డోపింగ్ క‌మిటీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

ముంబైని ఐదు సార్లు విజేత‌గా నిలిపిన రోహిత్ కోసం ఢిల్లీ క్యాపిట‌ల్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కాచుకొని ఉన్నాయి. హిట్‌మ్యాన్‌ను ద‌క్కించుకునేందుకు రూ.50 కోట్లు అయినా వెచ్చించేందుకు ఈ రెండు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయని స‌మాచారం.

శ్రీ‌లంక‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఆరు రోజుల టెస్టు జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌ర్‌లో ఈ మ్యాచ్‌ను నిర్వ‌హిస్తామ‌ని శుక్ర‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్ మండలి తెలిపింది.

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడాను వినేశ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకుంది.

ప్రతిష్ఠాత్మక అండర్‌-17 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ల పసిడి పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే నలుగురు మహిళా రెజ్లర్లు స్వర్ణ పతకంతో మెరువగా, తాజాగా కాజల్‌ ఈ జాబితాలో చేరింది

పారాలంపిక్స్ 2023లో తొలి ట్రాన్స్ జెండర్ క్రీడాకారిణిగా వాలెంటీనా పాల్గొననుంది

EDUCATION & JOBS UPDATES

టీజీ పీఈసెట్‌లో భాగంగా రెండేండ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఈడీ), అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లామా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(యూజీ డీపీఈడీ) కోర్సుల్లో అడ్మిషన్లు మొదలయ్యాయి.

ఏఎంవీఐ ఉద్యోగాల భర్తీకి స్పోర్ట్స్‌ కోటాలో పెండింగ్‌లో ఉన్న అభ్యర్థి ఎంపికైనట్టు శుక్రవారం టీజీపీఎస్సీ అధికారులు వెబ్‌నోట్‌ విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థికి 28న ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షలు జరుగుతాయని, సదరు అభ్యర్థి తప్పకుండా హాజరు కావాలని తెలిపారు.

ENTERTAINMENT UPDATES

మాస్ మ‌హారాజ ర‌వితేజ‌కు షూటింగ్‌లో ప్రమాదం జ‌రిగింది. ర‌వితేజ 67 ప్రాజెక్ట్ షూటింగ్ సమ‌యంలో ర‌వితేజ‌కు ప్ర‌మాదం జ‌రుగ‌గా.. అత‌డి కుడిచేతికి గాయం అయ్యింది.

నాగార్జున కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న మాస్ సినిమాను కింగ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగ‌ష్టు 28న రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

సన్నీడియోల్ ‘బోర్డ‌ర్ 2’లో వ‌రుణ్ ధావ‌న్

గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో తెర‌కెక్కిన‌ తాజా చిత్రం ఆయ్ (AAY). ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్, న‌య‌న్ సారిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు అంజి కంచిపల్లి దర్శకత్వం వ‌హించాడు. ఈ మూవీ విడుద‌లైన ద‌గ్గ‌రినుంచి కేవలం 8 రోజుల్లోనే రూ.10 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది.

మారి సెల్వ‌రాజ్‌తో ర‌జినీ త‌న త‌దుప‌రి చిత్రం చేయ‌బోతున్న‌ట్లు కోలీవుడ్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు