BIKKI NEWS (OCT. 23) : TODAY NEWS IN TELUGU on 23rd OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 23rd OCTOBER 2024
TELANGANA NEWS
గత సంవత్సరం (2023-24) ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి 168 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచింది.
హక్కుల సాధన, డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 28 నుంచి జనవరి 30 వరకు పోరుబాట పట్టనున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 23 నుంచి నుంచి జనవరి 30 వరకు జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ)కు అప్పగించింది. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీచేశారు.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారు గంగారెడ్డిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
ANDHRA PRADESH NEWS
ఈనెల 23,24వ తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
రానున్న కాలంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ కానున్నందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు అడుగులకు మడుగులొత్తడమే మీ అజెండానా? షర్మిలపై మండిపడ్డ వైసీపీ మహిళా నేత
అన్నయమ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు.. చికిత్స పొందుతూ మరొకరు దుర్మరణం
ఏపీలో సీఐడీ అధికారులు పలు జిల్లాలోని డిస్టిలరీలపై ఏకకాల దాడులు నిర్వహించారు.
NATIONAL NEWS
రష్యాలోని కజన్ సిటీలో జరగనున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. అక్టోబర్ 22 నుంచి ఆ సమావేశాలు జరగనున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్పష్టం చేశారు.
దానా తుఫాన్ ఎఫెక్ట్.. బెంగాల్లోని పలు జిల్లాల్లో స్కూళ్లు బంద్
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేస్తే రూ.1,11,11,111 నజరానా.. కర్ణిసేన ఓపెన్ ఆఫర్!
ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రిబ్యునల్‌నే ఏర్పాటు చేసి జడ్జిగా అవతారమెత్తి తీర్పులు కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిందీ ఘటన.
ఏఐ వంటి నైపుణ్యం వృద్ధిపై కేంద్రం ఫోకస్ – ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
వక్ఫ్ బిల్లుపై నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ సమావేశం రసాభాసగా సాగింది. సమావేశంలో అనుచితంగా ప్రవర్తించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.
INTERNATIONAL NEWS
భూమి దిశగా దూసుకువస్తున్న విమానం సైజ్ ఉన్న ఆస్టరాయిడ్.. నాసా వార్నింగ్..
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి భూమికి రక్షణ కల్పించేందుకు డైమండ్ డస్ట్‌ను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు కొత్త ప్రతిపాదన చేశారు
రష్యా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ..
వాస్తవాధీన రేఖ (LAC) వెంట పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తలను తగ్గించడంపై చైనా, భారత్ మధ్య ఏకాభిప్రాయం కురింది.
BUSINESS NEWS
భారీగా నష్టపోయిన మార్కెట్లు
సెన్సెక్స్ : 80,221 (-930)
నిఫ్టీ : 24,472 (-309)
సీకే బిర్లా గ్రూపునకు చెందిన ఓరియంట్ సిమెంట్‌ను రూ.8,100 కోట్లతో కొనుగోలు చేయడానికి అదాని ముందుకొచ్చారు.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర మరో రూ.350 ఎగబాకి రూ.81 వేలకు చేరుకున్నది.
ఒకే దేశం- ఒకే బంగారం ధర.. పుత్తడి ధర హేతుబద్ధీకరణపైనే జ్యువెల్లరీ ఇండస్ట్రీ బాడీ ఫోకస్
సెబీ చీఫ్ మాధాబీ పురీ బుచ్‌కు రిలీఫ్.. రాజీనామా అక్కర్లేదన్న కేంద్రం
SPORTS NEWS
ప్రతిష్ఠాత్మక సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్లుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మలేషియాను చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.
2028లో జరుగబోయే ఒలింపిక్స్ పోటీల్లో క్రికెట్ నిర్వహణకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు.
అధిక బరువు, క్రమశిక్షణా రాహిత్యం.. ముంబై రంజీ జట్టు నుంచి పృథ్వీ షా ఔట్
EDUCATION & JOBS UPDATES
TGPSC – కెమిస్ట్రీ, సివిక్స్, ఉర్దూ సబ్జెక్ట్ ల జేఎల్ ఫలితాలు విడుదల
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు
నైట్ పాలిటెక్నిక్ కోర్సులకు అనుమతి
CTET EDIT ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.