BIKKI NEWS (NOV. 23) : TODAY NEWS IN TELUGU on 23rd NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 23rd NOVEMBER 2024
TELANGANA NEWS
ఫార్మాసిటీలోనే ఆరు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలుష్యరహితంగా గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్రప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది.
కాళేశ్వరంతోపాటు ఆ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంపై విచారణ ప్రారంభించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరి కొందరు ఇంజినీర్లకు సమన్లు జారీచేసింది
ప్రభుత్వ దవాఖానల్లో కృత్రిమ మందుల కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం దాయరా పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 30 గల 720 ఎకరాల ఇనాం భూమిలో కొందరు కబ్జాదారులు నిర్మించిన ఇండ్లు కూల్చివేత.
కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను తేల్చాలని అసెంబ్లీ స్పీకర్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయంలోగా తేల్చాలని సూచించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేస్తే.. సుప్రీంకోర్టును వెళ్లాలనే యోచనలో బీఆర్‌ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తున్నది.
మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం విచారణ జరుపనున్నది.
గ్రూప్ 4 వెరిఫికేషన్ గడువు పొడిగింపు. 2,217 మందికి 1,928 మంది మాత్రమే హాజరయ్యారు. వెరిఫికేషన్‌కు మరికొన్ని రోజులు గడువు పొడిగించారు.
13 జిల్లాలకు నర్సింగ్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది.
భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా 25న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కి అగ్నిమాపకశాఖలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు(ఎస్‌ఎఫ్‌వోలు) బదిలీ అయ్యారు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు ‘అటానమస్’ హోదా చినికిచినికి గాలివానలా మారుతున్నది. ఈ వ్యవహారం యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మధ్య వివాదానికి దారితీసింది.
ANDHRA PRADESH NEWS
తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు నిరాధార వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఎక్స్‌పార్టే ఉత్తర్వులు జారీ చేసింది
భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరుకు ఏపీ కౌన్సిల్ ఆమోదం
చంద్రబాబు ఎప్పుడో అంతర్జాతీయ అవినీతి చేశారు.. పేర్ని నాని ఫైర్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పదిరోజుల పాటు జరిగిన సమావేశాలు శుక్రవారంతో ముగిసాయి.
ఈనెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి బ్రహ్మోత్సవాలు
NATIONAL NEWS
రాజ్యంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యింది. తీర్పును నవంబర్ 25కు వాయిదా వేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మరణించారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు జరగనుంది.
తాజా హింస నేపథ్యంలో.. మణిపూర్‌కు 10,000 మందికిపైగా సైనికులు
కేజ్రీవాల్ కంటే అతిషి వెయ్యిరెట్లు బెటర్.. ఢిల్లీ ఎల్జీ ప్రశంస
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది. ఈరోజు స్వదేశానికి రానున్నారు.
INTERNATIONAL NEWS
ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రపంచ యుద్ధ స్వభావాన్ని సంతరించుకుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
కెనడా పోలీసులు ఖలిస్థానీ సిక్కు సంస్థల ఒత్తిళ్లకు తల వంచారు. ఆ దేశంలోని మైనారిటీలైన హిందువులకు భద్రత కల్పించలేమని నిస్సిగ్గుగా ప్రకటించారు.
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై తమ దేశంలో నమోదైన కేసుపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని పేర్కొంది
BUSINESS NEWS
భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు.
7 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద
సెన్సెక్స్ : 79,117 (1961)
నిఫ్టీ : 23,907 (557)
ఈ నెల 15తో ముగిసిన వారాంతానికిగాను మారకం నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు తరిగిపోయి 657.892 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పుత్తడి ధర మళ్లీ రూ.80 వేల మార్క్‌ను అధిగమించింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన తులం ధర మరో రూ.1,100 అందుకొని రూ.80,400కి చేరుకుంది
SPORTS NEWS
పెర్త్ టెస్టులో తొలి రోజు ఆధిక్యత టీమిండియాదే. ఇండియా 150/10, ఆస్ట్రేలియా 67/7
భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్-చిరాగ్ చైనా మాస్టర్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది
వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 14న మొదలై మే 25తో ముగియనుంది. 2026లో మార్చి 15 నుంచి మే 31తో జరుగబోయే ఈ మెగా లీగ్.. 2027లో మార్చి 14న ప్రారంభమై మే 30 దాకా సాగుతుందని పేర్కొంది.
EDUCATION & JOBS UPDATES
గ్రూప్-2 పరీక్షల సమయంలోనే రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరీక్షలున్నాయి. ఒకే రోజు రెండు పరీక్షలుండటంతో ఏ పరీ క్ష రాయలో తెలియక అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారు.
గ్రూప్ 4 వెరిఫికేషన్ గడువు పొడిగింపు. 2,217 మందికి 1,928 మంది మాత్రమే హాజరయ్యారు. వెరిఫికేషన్‌కు మరికొన్ని రోజులు గడువు పొడిగించారు.
13 జిల్లాలకు నర్సింగ్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది.
భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా 25న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది.