TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 09 – 2024

BIKKI NEWS (SEP. 22) : TODAY NEWS IN TELUGU on 22nd SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 22nd SEPTEMBER 2024

TELANGANA NEWS

రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల భారీ కుంభకోణాన్ని బయటపెట్టిన కేటీఆర్‌. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారని అన్నారు.

హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

రేవంత్‌ రెడ్డి మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు.. హరీశ్‌రావు సెటైర్‌

ఐటీఐలో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.. ముఖ్యమంత్రి ఆదేశాలు

డెయిరీ ఉత్పత్తుల సరఫరాకు రెడీ.. టీటీడీకి తెలంగాణ విజయ డెయిరీ లేఖ

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.. లేదంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం.. బీఆర్‌ఎస్‌ బీసీ నాయకుల నిర్ణయం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న తెలంగాణలో ఒకరోజు పర్యటనకు వస్తున్నారు.

ANDHRA PRADESH NEWS

లడ్డూ పవిత్రత కాపాడాం.. ఎక్స్ వేదికగా టీటీడీ వెల్లడి..

హెరిటేజ్‌ నెయ్యిని పంపించినా అలాంటి రిపోర్టే వస్తుంది.. తిరుమల లడ్డూ వివాదంపై సజ్జల కౌంటర్‌

టీటీడీ లడ్డూ తయారీలో కల్తీపై సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ అందించిన ఈఓ

శ్రీవారి లడ్డూ అపచారం.. 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షకు సిద్ధమైన పవన్‌ కల్యాణ్‌

NATIONAL NEWS

ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం అమెరికాకు చేరుకున్నారు.

పోలీస్‌ స్టేషన్‌లో కూడా మహిళలకు రక్షణ లేదని ఒడిశా మాజీ సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ విమర్శించారు. రాజ్‌భవన్‌లో ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

34 వేల ఆలయాల్లో నందిని నెయ్యినే వినియోగించండి.. కర్ణాటక ప్రభుత్వం ఆదేశం

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్‌ నేత అతిశీ ప్రమాణస్వీకారం చేశారు.

జ‌గ‌న్నాథ ఆల‌య ర‌త్న‌భండార్‌ను శనివారం మ‌ళ్లీ తెరిచారు. రెండోసారి టెక్నిక‌ల్ స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. పురావాస్తు శాఖ ఆధ్వ‌ర్యంలో ర‌త్న‌భండార్‌ను ఓపెన్ చేశారు. దీంతో ద‌ర్శ‌నాలు ఆపేశారు. మూడు రోజుల పాటు స‌ర్వే జ‌ర‌గ‌నున్న‌ది.

మయన్మార్​ నుంచి 900 మంది మిలిటెంట్ల చొరబాటు.. మణిపూర్‌లో హై అలర్ట్‌

జార్ఖండ్ లజ పోటీ పరీక్ష నేపథ్యంలో రెండు రోజులపాటు ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

INTERNATIONAL NEWS

చైనా క‌మ్యూనిస్టు పార్టీలో సీనియ‌ర్ హోదాలో ఉన్న ఓ మ‌హిళ‌కు 13 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. 58 మంది స‌బార్డినేట్స్‌తో ఆమె అఫైర్ పెట్టుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి

హిజ్‌బొల్లా ఎలైట్ ర‌ద్వాన్ ఫోర్స్ క‌మాండ‌ర్ ఇబ్ర‌హీం అఖిల్ మృతిచెందిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. సీనియ‌ర్ క‌మాండ‌ర్ల మీటింగ్‌ను టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఆ దాడిలో 14 మంది మ‌ర‌ణించారు. దీంట్లో 10 మంది హై ర్యాంకింగ్ అధికారులు ఉన్నారు.

నరేంద్ర మోడీ వ్యూహాత్మక క్వాడ్ సదస్సుతోపాటు పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఐక్యరాజ్యసమితిలో జరిగే ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.

BUSINESS NEWS

మారుతి వ్యాగన్ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ లాంచింగ్.. రూ.5.65 లక్షల నుంచి షురూ..

ఆపిల్ బంపరాఫర్ ఐ-ఫోన్ 16 ఫోన్‌పై రూ.37,900 డిస్కౌంట్..!

ఈ నెల 13వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 223 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 689.46 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లిందని ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

SPORTS NEWS

బంగ్లాదేశ్ తో చెపాక్ టెస్టు లో విజయానికి 6 వికెట్ల దూరంలో టీమిండియా. శుభమన్ గిల్‌, పంత్ సెంచరీలతో భారీ ఆధిక్యం సాదించిన టీమిండియా.

  • భారత్ : 376 & 287/4 D
  • బంగ్లాదేశ్ : 149 & 158/4

వన్డే ఫార్మాట్‌లో 200 వికెట్లు ప‌డ‌గొట్టిన మూడో ఇంగ్లండ్ బౌల‌ర్‌గానూ ర‌షీద్ గుర్తింపు సాధించాడు.

EDUCATION & JOBS UPDATES

ఇంటర్మీడియట్ అర్హతతో 3445 రైల్వే జాబ్స్

ENTERTAINMENT UPDATES

బిగ్ బాస్‌ను తిట్టిన అభ‌య్‌కు వార్నింగ్ ఇవ్వ‌డ‌మే కాకుండా రెడ్ కార్డు ఇచ్చి బ‌య‌ట‌కు వెళ్లిపోమ్మ‌న్నాడు నాగార్జున‌.

‘దేవర’ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు