TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 11 – 2024

BIKKI NEWS (NOV. 22) : TODAY NEWS IN TELUGU on 22nd NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 22nd NOVEMBER 2024

TELANGANA NEWS

లగచర్ల ఉదంతంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సీరియస్‌ అయింది. లగచర్లలో ఏం జరిగిందో చెప్పాలని నోటీసులు జారీ చేసింది

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఈ నెల 25న వికారాబాద్‌ జిల్లా లగచర్లలో పర్యటించనున్నది. లగచర్ల ఘటనపై క్షేత్రస్థాయిలో విచారించనున్నది.

మహబూబాబాద్‌ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఈ నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి షరతులతో కూడిన అనుమతిస్తూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఆటోకార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిసెంబర్‌ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్‌ చేపట్టాలని బీఆర్టీయూ నిర్ణయం.

తెలంగాణలో చికున్‌ గున్యా విజృంభిస్తున్నదని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది

టీజీపీఎస్సీ గ్రూ ప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్‌ 15,16 తేదీల్లో పరీక్షలు నిర్వహించన్నది.

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో నేడు తీర్పు

వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్టు సమాచారం.

జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అభ్య‌ర్థుల తుది జాబితా విడుద‌ల‌

త్వరలోనే ఆదర్శ రైతుల నియామకం – మంత్రి తుమ్మల

ANDHRA PRADESH NEWS

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్థాపించిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై శాసన మండలిలో గురువారం వాడీవేడి చర్చ జరిగింది.

23న మళ్లీ అల్పపీడనం.. ఏపీలో వర్షాలకు అవకాశం

నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలను వదిలివేస్తున్నానని పోసాని వెల్లడించారు. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకోనని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పీఏసీ చైర్మన్‌గా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు.

పోలవరం ఎత్తు తగ్గింపుపై పార్లమెంట్‌లో ఆందోళన చేపడుతాం : వైసీపీ ఎంపీలు

తిరుమల కాటేజీలకు పేర్లు మార్పు.. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా పేర్లను ఎంపిక చేసుకోవాలని దాతలకు పిలుపు

NATIONAL NEWS

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ‘డొమెనికా డొమెనికా అవార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ మరియు గయానా ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ పురష్కారాలు లభించాయి.

భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. యూఎస్‌ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్‌ కూడా జారీ చేసింది.

ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు అదానీ అవినీతి అంశంపై వేడెక్కనున్నాయి. ఈ సమావేశాల్లో పెండింగ్‌లో ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.

బీహార్‌లో పట్టాలు తప్పిన దర్భంగా ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన ప్రమాదం

దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నూతన అధిపతిగా కె. సంజయ్‌ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు.

అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఫస్ట్‌.. ఐజ్వాల్‌ లాస్ట్‌.. హైదరాబాద్‌లో ఏక్యూఐ లెవల్ 120.

భార‌త‌, అమెరికా చ‌ట్టాల‌ను గౌతం అదానీ ఉల్లంఘించారు : రాహుల్ గాంధీ

INTERNATIONAL NEWS

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ, ఇజ్రాయెల్‌ మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గల్లెంట్‌, హమాస్‌ అధికారులపై ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

పాకిస్థాన్ లోని వాయువ్య జిల్లా కుర్రాంలో ప్యాసింజర్ వాహనాలపై సాయుధ దుండగులు గురువారం జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు.

ఇంటర్నెట్‌ ప్రపంచంలో గూగుల్‌ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలకాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలతో కూడిన 23 పేజీల డాక్యుమెంట్‌ను యూఎస్‌ న్యాయశాఖ తయారుచేసింది.

16 ఏండ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ కొత్త చట్టాన్ని ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టారు

అదాని తో విద్యుత్తు సరఫరా లైన్ల కాంట్రాక్టుతో పాటు జోమో కెన్యాట్టా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసుకొంటున్నట్టు కెన్యా దేశాధ్యక్షుడు విలియం రూటో గురువారం తెలిపారు.

ర‌ష్యా తొలిసారి ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణిని ప్ర‌యోగించిన‌ట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ పేర్కొన్న‌ది

మాస్టర్‌ ఆఫ్‌ సర్రియలిజం’ రెనె మగ్రిట్టే వేసిన పెయింటింగ్‌ ప్రపంచ రికార్డు సాధించింది. న్యూయార్క్‌లోని ఆక్షన్‌ హౌస్‌ క్రిస్టీలో మంగళవారం జరిగిన వేలంలో ఇది 121,160,000 డాలర్లు (సుమారు రూ.1,022 కోట్లు) పలికింది.

కెనడాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెను సవాలుగా మారాయి. తల్లిదండ్రుల్లో 24 శాతం మంది తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం తాము తినడం తగ్గించుకుంటున్నారు.

BUSINESS NEWS

నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 77156 (-422)
నిఫ్టీ : 23,350 (-168)

యూఎస్‌లో కేసు.. అదానీ గ్రూప్ సంస్థల ఎం-క్యాప్ రూ.2.5 లక్షల కోట్లు ఆవిరి.

ఢిల్లీలో గురువారం ఒక్కరోజే తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.1400 పెరిగి రూ.79,300లకు చేరుకున్నది.

సెప్టెంబర్‌ నెలలో రిలయన్స్‌ జియో 79.69 లక్షల మంది మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లను కోల్పోగా, భారతీ ఎయిర్‌టెల్‌ 14.34 లక్షల యూజర్లు, వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌ నుంచి 15.53 లక్షల మంది వెళ్లిపోయారు

డాలర్ తో రూపాయి మారకం విలువ 8 పైసలు నష్టపోయి తొలిసారి 84.50 వద్దకు చేరింది.

SPORTS NEWS

BGT – ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ (బీజీటీ)కి రంగం సిద్ధమైంది. పెర్త్ వేదికగా నేడు తొలి టెస్ట్

భారత క్రికెట్‌ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్‌ కొడుకు ఆర్యవీర్‌ కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయ డబుల్‌ సెంచరీ(229 బంతుల్లో 200 నాటౌట్‌) సాదించాడు.

వచ్చే ఏడాది జరుగనున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌తో పాటు పారా గేమ్స్‌కు బీహార్‌ ఆతిథ్యమివ్వనుంది.

భార‌త మహిళ‌ల జ‌ట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌల‌ర్ ఝులాన్ గోస్వామి గౌర‌వార్ధం ఈడెన్ గార్డెన్స్ లోని ఓ స్టాండ్‌కు ఆమె పేరు పెట్ట‌నున్నారు

ల‌క్ష్య‌సేన్ చైనా మాస్ట‌ర్స్‌లో అల‌వోక‌గా క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లాడు. సింధు ఇంటిదారి

EDUCATION & JOBS UPDATES

TGPSC – గ్రూప్ – 2 పరీక్ష హల్ టికెట్లు డిసెంబర్ 09న విడుదల

TGPSC డిపార్ట్మెంటల్ టెస్ట్స్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు.

జూనియర్ లెక్చరర్ మ్యాథ్స్, మ్యాథ్స్ (UM) మరియు ఇంగ్లీషు తుది ఎంపిక జాబితా విడుదల చేసిన TGPSC

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు