TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 12 – 2024

BIKKI NEWS (DEC 21) : TODAY NEWS IN TELUGU on 21st DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 21st DECEMBER 2024

TELANGANA NEWS

తెలంగాణ గురుకులాల్లో మ్యూజిక్‌ టీచర్ల పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు 23న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు.

గురుకుల మ్యూజిక్ టీచర్లకు డిసెంబర్ 23న సర్టిఫికెట్ వెరిఫికెషన్

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది

ఆ చ‌ట్టం భూ భార‌తి కాదు.. భూ హార‌తి : ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

రాష్ర్టానికి సంబంధించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తిరస్కరించింది. ఈ మేరకు రాష్ట్ర సాగు నీటిపారుదలశాఖ ఈఎన్సీకి తాజాగా లేఖ రాసింది.

హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 8 చోట్ల సోదాలు.

ANDHRA PRADESH NEWS

ఎకనమిక్ హబ్‌గా ఏపీ రాజధాని.. అమరావతి అభివృద్ధికి 800 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు రుణం

మరో 24 గంటల్లో ఏపీలోని ఆరు జిల్లాలో భారీ వర్షాలు : వాతావరణశాఖ హెచ్చరిక

సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల

వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం అయింది.

NATIONAL NEWS

ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఉభయసభలు నిరవధిక వాయిదా

జ‌మిలి బిల్లును జేపీసీ కి పంపాలనే తీర్మానం ఇవాళ లోక్‌స‌భ‌లో పాసైంది. దీంతో సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీ ఆ బిల్లుపై త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌నున్న‌ది. మొత్తం 39 మంది ఎంపీలు ఆ క‌మిటీలో ఉన్నారు.

మాన‌వ త‌ప్పిదం వ‌ల్లే జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ త‌న రిపోర్టులో పేర్కొన్నది.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులు ప్రస్తుతం ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారని యోగి ఆధిత్యనాద్ తెలిపారు.

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూశారు

ఎండుకొబ్బరికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని క్వింటాలుకు రూ.422 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ర్టాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం తెలిపింది.

ఖాళీగా ఉన్న మెడికల్‌ సీట్లను భర్తీ చేయడం కోసం ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులను సుప్రీం కోర్టు ఆదేశించింది.

INTERNATIONAL NEWS

అత్యాధునిక క్షిప‌ణి టెక్నాల‌జీని పాకిస్థాన్ డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు వైట్‌హౌజ్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు పేర్కొన్నారు

గ్రీసు లో బోటు మునిగిపోయింది. 8 మంది మృతిచెంద‌గా, మ‌రో 18 మందిని ర‌క్షించారు.

సిరియా రాజధాని డమాస్కస్ శ్మశానంలో లక్ష మృతదేహాలు

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై రష్యా బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది

BUSINESS NEWS

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 78,041.59 (-1176)
నిఫ్టీ : 23,587.50 (-364)

కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ తిరస్కరించడంతో షట్ డౌన్ దిశగా అడుగులు.

నవంబర్ 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దాదాపు రెండు బిలియన్ డాలర్లు పతనమై 652.87 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

శుక్రవారం ఢిల్లీలో తులం బంగారం ధర రూ.170 తగ్గి రూ.78,130లకు చేరుకున్నది. కిలో వెండి ధర రూ.1,800 పతనమై రూ.88,150లకు చేరుకుంది.

వరుసగా ఐదు రోజుల్లో స్టాక్ మార్కెట్ లు రూ.18 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయాయి

SPORTS NEWS

విరాట్ కోహ్లీ లండన్ లో స్థిరపడతాడంటూ వార్తలు.

మహిళల అండర్‌-19 ఆసియాకప్‌ టోర్నీలో భారత్‌ ఫైనల్ కు చేరింది.

EDUCATION & JOBS UPDATES

UGC NET 2024 డిసెంబర్ సెషన్ పరీక్షలు జనవరి 3 – 16 వరకు నిర్వహించనున్నారు.

VTGCET 2025 నోటిఫికేషన్ విడుదల. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.

గురుకుల మ్యూజిక్ టీచర్లకు డిసెంబర్ 23న సర్టిఫికెట్ వెరిఫికెషన్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు