TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 20 – 09 – 2024

BIKKI NEWS (SEP. 20) : TODAY NEWS IN TELUGU on 20th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 20th SEPTEMBER 2024

TELANGANA NEWS

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.

చెరువులు, నీటి వనరుల పరిరక్షణకు ఉద్దేశించిన ‘హైడ్రా’ను మరింత బలోపేతం చేయడంపై కేబినెట్ లో చర్చించి, ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం.

కొత్త రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు రెండో తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

9 నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లో కుప్ప‌కూలిన వైద్య వ్య‌వ‌స్థ‌.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌స‌రా సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 2 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెలవులు ఇస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది

రేవంత్ రెడ్డిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకోండి.. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు హ‌రీశ్‌రావు బ‌హిరంగ లేఖ

ANDHRA PRADESH NEWS

తిరుమల వెంకన్న లడ్డూలో జంతువుల కొవ్వులు..! ల్యాబ్‌ నివేదికను విడుదల చేసిన టీడీపీ నేత ఆనం..!

తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి : వైఎస్‌ షర్మిల

లడ్డూ తయారీలో పందితో నెయ్యిని ఉపయోగించారని నీచమైన ఆరోపణలు చేశారని, చంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు.

జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈనెల 22న జనసేన పార్టీలో చేరబోతున్నట్లు గురువారం ప్రకటించారు.

భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు విరాళాల వెల్లువ కొనసాగుతుంది. అదానీ గ్రూప్‌ రూ. 25 కోట్ల భారీ విరాళం. ఇప్పటికే విరాళాల ద్వారా ఏపీకి సుమారు రూ. 350 కోట్లు వచ్చాయి.

కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

NATIONAL NEWS

బీహార్‌లో దారుణం.. 20కు పైగా దళితుల ఇళ్లకు నిప్పు

బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు సమాజాన్ని అణచివేస్తున్నాయి’.. బీహార్‌లో దళితుల ఇళ్లకు నిప్పుపెట్టడంపై రాహుల్‌ ఫైర్‌

ఓట్ల కోసం మన సంస్కృతి, విశ్వాసాలను కాంగ్రెస్‌ పణంగా పెడుతుంది : ప్రధాని మోదీ

బెంగాల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కీలక నిర్ణయం.. ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపాల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

బెంగళూర్‌లోని హై గ్రౌండ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో కలిపి ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

INTERNATIONAL NEWS

భార‌త్‌లో త‌యారైన ఆయుధాలు ఉక్రెయిన్‌కు వెళ్తున్నాయి. యురోపియ‌న్ దేశాల మీదుగా ఆ వాణిజ్యం న‌డుస్తోంది. దీనిపై ర‌ష్యా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

అతిగా యాంటీబ‌యోటిక్‌ల వాడకం.. 2050 నాటికి 4 కోట్ల మంది మ‌ర‌ణించే ఛాన్స్

1970 తర్వాత భారత్‌లో ఈ ఏడాది జూన్‌-ఆగస్టు త్రైమాసికంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, రెండో అత్యంత వేడి త్రైమాసికంగా నిలిచిందని ‘క్లెమేట్‌ సెంట్రల్‌’ నివేదిక తెలిపింది.

లెబనాన్ లో ఫేజర్లు, వాకీ టాకీలు పేలి రెండు రోజుల్లో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 3,250 మంది గాయపడ్డారు.

బ్లైండ్‌సైట్‌తో అంధులకూ చూపు.. అరుదైన ప్రయోగానికి సిద్ధమైన ఎలాన్‌మస్క్‌ న్యూరాలింక్‌

హవాలా లావాదేవీలు, ఉగ్రవాదులకు ఆర్థిక సహకార వ్యవస్థలను నిరోధించడానికి భారత్ సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నదని ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పేర్కొంది.

BUSINESS NEWS

ఆల్‌టైమ్‌ హైకి స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్ : 83,185 (+237)
నిఫ్టీ : 25,416 (+38)

భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆరేండ్లలో ప్రపంచంలోనూ మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనా వేసింది.

అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ (AGR)లో బకాయిల గణనలో తప్పులను సరిదిద్దాలంటూ వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సహా పలు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.100 వృద్ధితో రూ.75,650లకు చేరుకున్నది. మరోవైపు, కిలో వెండి ధర రూ.500 పుంజుకుని రూ.91 వేలు పలికింది.

SPORTS NEWS

బంగ్లాదేశ్ తో చెపాక్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే స‌రికి టీమిండియా స్కోర్.. 339/6. చేసింది. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ (102), జడేజా (85) క్రీజులో ఉన్నారు.

మ‌హిళా క్రికెట‌ర్ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన హెడ్‌కోచ్‌ దులీప్ స‌మ‌ర‌వీర‌ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అత‌డి తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ 20 ఏండ్ల పాటు నిషేధం విధించింది.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ మెగా వేలం నవంబర్ నెలలో జరుగుతుంది.

ప్రపంచ 7వ ర్యాంకర్‌కు షాక్‌.. చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో మాళవిక సంచలనం

సఫారీలకు అఫ్గన్‌ షాక్‌.. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో జయభేరి

EDUCATION & JOBS UPDATES

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ మెయిన్‌ పరీక్షలు ఈ నెల 20 నుంచి 29 వరకు జరుగనున్నాయి.

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ ఐసెట్‌-2024 ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది.

టీజీ ఎప్‌సెట్ -2024(ఎంపీసీ స్ట్రీమ్) ప్ర‌వేశాల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. బీ ఫార్మ‌సీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

AP NIT లో 125 టీచింగ్ ఉద్యోగాలు

ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 104 ఔట్‌సోర్సింగ్ మరియు సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ENTERTAINMENT UPDATES

అగ్ర హీరో సూర్య నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కంగువ’ నవంబర్ 14 న విడుదల కానుంది.

పుష్ప – 2 లో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌తో సుకుమార్‌ ఓ అతిధి చేయిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నది.

జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్టు చేశాం.. హైదరాబాద్‌కు తరలిస్తున్నాం : డీసీపీ శ్రీనివాస్‌

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు