BIKKI NEWS (DEC 20) : TODAY NEWS IN TELUGU on 20th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 20th DECEMBER 2024
TELANGANA NEWS
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు.
7 లక్షల కోట్ల అప్పంటే కోర్టుకీడుస్తం.. అసెంబ్లీలో హరీశ్‌రావు
కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు
హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేయడానికి అంగీకరించిన సీఎం రేవంత్
నేడు ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి
ANDHRA PRADESH NEWS
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
అమరావతి లో 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు
రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా రూ. 11 వేల కోట్లు రుణానికి, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణానికి ఆమోదం.
వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్
మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపు
ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి స్కాముల పాలన కొనసాగుతుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది.
కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్‌కు తగిన గౌరవం లభించలేదని, అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనేనని బాబు పేర్కొన్నారు.
NATIONAL NEWS
పార్లమెంటు ప్రాంగణంలోని మకరద్వారం వద్ద ఇండియా, ఎన్డీయే కూటముల ఎంపీలు ఎదురుపడటంతో తోపులాట చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు.
+18002428478 నంబర్‌తో వాట్సాప్‌లో చాట్ జీపీటీ తో చాట్ చేయవచ్చు.
రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీస్‌ను కొట్టివేశారు
కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవటంతో పటాసులపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్టు ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
జమ్మూ కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో అంతుబట్టని వ్యాధితో 8 మంది బాలలు ప్రాణాలు కోల్పోయారు
INTERNATIONAL NEWS
ఆఫ్రికా దేశం ‘ఉగాండా’లో అంతుబట్టని వ్యాధి ప్రబలింది. ‘డింగా డింగా’ వైరస్‌గా పేర్కొంటున్న దీనిబారిన పడ్డవాళ్లలో రోగ లక్షణాలు అంతుబట్టని విధంగా ఉంటున్నాయి.
ఫెర్టిలో’ అనే సరికొత్త సంతానోత్పత్తి విధానంతో ప్రపంచంలోనే మొదటిసారి ఓ శిశువు జన్మించింది. ఫెర్టిలో పద్ధతి ద్వారా గర్భం దాల్చిన ఓ మహిళ.. పెరూ దేశ రాజధాని లిమాలోని సాంటా ఇసాబెల్ క్లినిక్‌లో బిడ్డకు జన్మనిచ్చింది.
చైనా భారీ యుద్ధానికి సిద్ధమవుతున్నదని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
BUSINESS NEWS
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ : 79,218.05 (-964.15)
నిఫ్టీ : 23,951.70 (-247.15)
డాలర్ తో రూపాయి మారకం విలువ చారిత్రాత్మక కనిష్ఠానికి చేరింది. 85.13 పైసలకు పతనం.
తగ్గిన బంగారం, వెండి ధరలు పెంచుతూ
ఉచితాలు ఆర్థిక వృద్ధి కి ఆటంకాలు – ఆర్బీఐ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్ విషయమై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం ప్రీ-బడ్జెట్ చర్చలు జరుపనున్నారు
SPORTS NEWS
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం
అవమానాల వలే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని అతని తండ్రి రవిచంద్రన్ పేర్కొన్నాడు
EDUCATION & JOBS UPDATES
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు
CAT 2024 ఫలితాలు, ర్యాంక్ కార్డులు విడుదల
అగ్ని వీర్ వాయు ఫేజ్ – 1 (02/2025) ఫలితాలు విడుదల
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్