BIKKI NEWS (OCT. 01) : TODAY NEWS IN TELUGU on 1st OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 1st OCTOBER 2024
TELANGANA NEWS
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కోర్టు ఆదేశాలతో ముడిపడిన భూమిలోని నిర్మాణాలను కూల్చివేసిన తహసీల్దార్, హైడ్రా కమిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తహసీల్దార్ అడిగితే చార్మినార్, హైకోర్టును కూడా కూల్చేస్తారా.. హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
హైడ్రా అంటే కూల్చివేతలే కాదు.. పేదల నివాసాల జోలికి వెళ్లదు.. స్పష్టం చేసిన ఏవీ రంగనాథ్
ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. ఈ నెల 3 నుంచి క్షేత్ర స్థాయిలో పరిశీలన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయన మంగళవారం రాత్రి లేదా బుధవారం తిరిగి వస్తారని సమాచారం.
26వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు తక్కువగా ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాము అన్ని స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పుడున్న గురుకులాలను ఒకే ప్రాంగణంలోకి చేర్చి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్’ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు.
డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు.
దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
మూసీ సుందరీకరిస్తే ఎవరి బతుకులు బాగుపడతాయి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
ANDHRA PRADESH NEWS
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా అంటూ నిలదీసింది.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
తిరుమలలో లడ్డూ గోదాములను పరిశీలించిన సిట్ బృందం
ఏపీలో మద్యం షాపుల ఏర్పాటుపై రెండురోజుల్లో మార్గదర్శకాలు జారీ చేయనున్నామని ఏపీ ఆబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్టింగ్ జడ్జితో సీబీఐ విచారణ జరిపితే చంద్రబాబు అబద్దాలు బయటకు వస్తాయని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు
వైఎస్‌ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్‌ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లుపెట్టి పేల్చాడు.
NATIONAL NEWS
ముడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు. ఈ స్కామ్‌పై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.
భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. భారత పర్యాటకులు, నిపుణులైన కార్మికులు, విద్యార్థుల కోసం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను ప్రారంభిస్తున్నట్టు భారత్‌లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది.
అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. బుల్డోజర్ కూల్చివేతలపై అస్సాంకు కోర్టు ధిక్కరణ నోటీసు
కొవిడ్ లాక్‌డౌన్ కాలంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు డౌన్
విచారణ సమయంలో ‘యా యా’ అనే పదాలను ఉపయోగించిన న్యాయవాదిపై సీజేఐ చంద్రచూడ్ సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల బాండ్ల విక్రయం కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట లభించింది. ఆ కేసులో కర్నాటక హైకోర్టు విచారణపై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బీహార్‌లో వరద బీభత్సం.. బద్దలైన ఆరు బ్యారేజీలు.. పవర్ గ్రిడ్ కంట్రోల్ రూమ్‌లోకి నీరు.
మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
ఇకపై లింగ మార్పిడికి మానసిక ఆరోగ్య ధ్రువీకరణ తప్పనిసరి
INTERNATIONAL NEWS
తాజాగా హమాస్‌కు చెందిన లెబనాన్ చీఫ్ ఫతే షెరీఫ్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు అడ్డుకట్ట వేయాలని ఇరాన్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. అణుబాంబు ప్రయోగించాలని ఛాందసవాదులు డిమాండ్ చేస్తున్నారు.
నాసా రెస్క్యూ మిషన్ విజయవంతం.. స్పేస్ స్టేషన్‌కు చేరిన స్పేస్‌ఎక్స్ క్రూ-9
చైనా మహిళకు రెండు గర్భాశయాలు.. రెండింటి ద్వారా శిశువుల జననం
BUSINESS NEWS
భారీ నష్టాలతో మార్కెట్లు
సెన్సెక్స్ :84,300 (-1272)
నిఫ్టీ : 25,810 (-368)
చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
నకిలీ పత్రాలతో పొందిన, సైబర్ నేరాలతో సంబంధం ఉన్న 2.17 కోట్ల మొబైల్ ఫోన్ల కనెక్షన్లను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది.
మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద మరింత పెరిగింది. గత రెండేండ్లుగా ఆయన నికర ఆదాయం ఆరురెట్లు పెరిగి 201 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇంతవరకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ జాబితాలో ఉన్నారు.
మూడున్నరేండ్ల కనిష్ఠానికి పారిశ్రామిక వృద్ధిరేటు. ఆగస్టులో -1.8 శాతంగా నమోదు.
SPORTS NEWS
బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ నాలుగో రోజు టీట్వంటీ ల ఆడిన భారత్. గెలుపు అవకాశాలు సృష్టించుకుంది. 26 పరుగులు ఆధిక్యంలో ఉంది.
స్కోర్ :
బంగ్లాదేశ్ : 233, 26/2
ఇండియా : 285/9D
సింగపూర్ వేదికగా జరిగిన 10వ ఎఫ్‌కేకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ రజత పతకంతో మెరిసింది.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్లు పతకాల మోత మోగిస్తున్నారు. ఇదివరకే ఈ టోర్నీలో రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం గెలిచిన భారత్.. సోమవారం మరో రెండు కాంస్య పతకాలు గెలిచింది.
చైనా ఓపెన్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్, కార్లొస్ అల్కారజ్, డేనియల్ మెద్వెదెవ్ సెమీస్‌కు దూసుకెళ్లారు.
టెస్టుల్లో 300 వికెట్లతో పాటు మూడు వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రవీంద్ర జడేజా రికార్డు క్రియేట్ చేశాడు.
కొత్త ఎన్‌సీఏ ప్రారంభం.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారిన పేరు.
EDUCATION & JOBS UPDATES
డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు.
అక్టోబర్ 1 – 5 వరకు డిఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్
961 సీట్లకు మొదటి విడతలోనే 871 సీట్లు భర్తీ అయ్యాయి. పీజీ లాసెట్ మొదటి విడత సీట్లను సోమవారం కేటాయించారు.
నీట్ యూజీ స్థానికత కేసులో సెప్టెంబర్ 20న తాము ఇచ్చిన ఉత్తర్వులను నాన్ పటిషనర్లకు కూడా వర్తింపజేయాలా? లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.
ENTERTAINMENT UPDATES
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అస్వస్థత.. వైద్యుల పర్యవేక్షణలో సూపర్ స్టార్
విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తికి సోమవారం కేంద్ర ప్రభుత్వం భారతీయ సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కేను ప్రకటించింది.