BIKKI NEWS (NOV. 01) : TODAY NEWS IN TELUGU on 1st NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 1st NOVEMBER 2024
TELANGANA NEWS
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో విలువైన పత్రాలు చోరీ.. కుట్ర కోణాన్ని శోధించాలని డీజీపీకి రిక్వెస్ట్..
స్వదేశీ ఉత్పత్తులతో దీపావళి.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ANDHRA PRADESH NEWS
ఉచిత సిలిండర్లు ఇస్తూ కరెంట్ బిల్లులను పెంచడం దారుణం : వైసీపీ
చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు : విజయసాయి రెడ్డి ట్వీట్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం
NATIONAL NEWS
దేశ ఐక్యతను దెబ్బతీసే కుట్రలను సాగనివ్వం.. పటేల్ జయంతి వేడుకల్లో ప్రధాని వ్యాఖ్యలు
తాము అధికారంలోకి వచ్చాక వన్ నేషన్, వన్ ట్యాక్స్ విధానం తీసుకువచ్చామన్నారు. అలాగే, వన్ నేషన్ – వన్ పవర్ విధానం, వన్ నేషన్ – వన్ రేషన్ విధానం తెచ్చామని.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానం తెచ్చేందుకు అడుగులు వేస్తున్నామన్నారు.
సౌదీని వెనక్కి నెట్టి.. యూరప్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా భారత్
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 60 యూఎస్‌కు విమానాలు రద్దు..
పటాకులపై ఢిల్లీలో నిషేధం.. అమలు చేసేందుకు 300 ప్రత్యేక బృందాలు
INTERNATIONAL NEWS
ఉత్తర కొరియా విజయవంతంగా లాంగెస్ట్ ICBM బాలిస్టిక్ మిస్సైల్‌లో పరీక్షించింది. సుదూరంలో ఉన్న అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు
అధికారంలోకి వస్తే భారత్ తో పటిష్ట సంబంధాలు – ట్రంప్
BUSINESS NEWS
నష్టాలలో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 79,389 (-553)
నిఫ్టీ : 24,305 (-135)
బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ ఇకలేరు..
భారీగా పెరిగిన బంగారం దిగుమతులు.. తొమ్మిదేళ్ల గరిష్ఠానికి డిమాండ్.
SPORTS NEWS
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెలరేగిపోయే హెన్రిచ్ క్లాసెన్ రికార్డు ధర పలికాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 23 కోట్లకు అట్టిపెట్టుకుంది.
దక్షిణాఫ్రికా పై రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన బంగ్లాదేశ్
ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దొంగల బీభత్సం.. నగలతో పాటు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ మెడల్ ఎత్తుకెళ్లారు.
నేటి నుండి కివీస్ తో మూడో టెస్ట్ – సిరీస్ ను ఇప్పటికే కోల్పోయిన టీమిండియా.