TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19 – 11 – 2024

BIKKI NEWS (NOV. 19) : TODAY NEWS IN TELUGU on 19th NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 19th NOVEMBER 2024

TELANGANA NEWS

నేటి నుండి డిగ్రీ కళాశాలల నిరవధిక బంద్. సెమిస్టర్ పరీక్షలపై ప్రభావం.

దేశంలో మొదటిసారిగా కార్బన్‌డయాక్సైడ్‌ నుంచి మిథనాల్‌ తయారీకి సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంటును మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్‌ విద్యుత్తు ప్లాంటులో ఏర్పాటు చేస్తున్నది

జనవరి 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగింపు.

విధుల్లోకి 8 వేల మంది కానిస్టేబుళ్లు.

వరంగల్ అభివృద్ధి కి 4962 కోట్లు కేటాయింపు.

వేములవాడ అభివృద్ధి కి 127 కోట్లు కేటాయింపు.

లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ నోరు విప్పాలి – కేటీఆర్

గ్రూప్‌-4లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 26న నియామకపత్రాలిచ్చే అవకాశముంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.

వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో వరంగల్‌ గుర్తింపును మరింత ఇనుమడింపచేసేలా ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది.

ANDHRA PRADESH NEWS

స్థానిక ఎన్నికల్లో ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలను మారుస్తూ తీసుకొచ్చిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది

తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం నిషేధం : టీటీడీ కీలక నిర్ణయం

నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు.. మీరెంత ? : కూటమికి రోజా హెచ్చరిక

వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి

టాలీవుడ్ సీనియర్ నటుడు, వైఎస్ఆర్‌సీపీ నాయ‌కుడు, మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు న‌మోదు అయ్యింది.

శాంతి భద్రతల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ సభ్యులు.. సమావేశం నుంచివాకౌట్‌

కార్పొరేషన్ ల ద్వారా బడుగుల సంక్షేమానికి వెయ్యి కోట్లు.

వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్ బిగించం – మంత్రి గొట్టిపాటి

NATIONAL NEWS

మణిపూర్‌లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. జిరిబామ్‌లో తమ వర్గానికి చెందిన ఆరుగురి హత్యను నిరసిస్తూ మైతీలు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.

తదుపరి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌)గా కే సంజయ్‌ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుత కాగ్‌ గిరీశ్‌ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20న ముగుస్తుంది.

ప్రపంచంలో నేడు ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ‘గ్లోబల్‌ సౌత్‌’ దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాన్ని తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నాయని భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

వైద్య రంగంలో పనిచేసేవారిపై జరిగే నేరాలపై దర్యాప్తు కోసం ప్రత్యేకంగా కేంద్ర చట్టం అక్కర్లేదని నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎన్‌టీఎఫ్‌) చెప్పింది.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..! ఏం చర్యలు తీసుకున్నారంటూ సర్కారుపై ప్రశ్నల వర్షం..

భారతదేశపు తొలి హైడ్రోజన్‌ ట్రైన్‌ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. తొలిసారిగా ఈ రైలు జింద్‌ – సోనిపట్‌ మార్గంలో నడువనున్నది.

మణిపూర్‌లో ఎన్ బీరెన్ సింగ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయాం అని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు,మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా స్పష్టం చేశారు.

INTERNATIONAL NEWS

సోమవారం బ్రెజిల్‌ రాజధాని రియో డి జెనీరో వేదికగా జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. సదస్సుకు అమెరికా, చైనా అధ్యక్షులు జో బైడెన్‌, జీ జిన్‌పింగ్‌, బ్రిటిన్‌ పీఎం స్టార్మర్‌ సహా ఆయా దేశాల నాయకులు హాజరయ్యారు.

ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న దీర్ఘ శ్రేణి క్షిపణులను (ఆర్మీ టాక్టికల్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ను‌).. రష్యా భూభాగంపై దాడికి వినియోగించేలా ఉక్రెయిన్‌కు అనుమతిస్తున్నట్లు బైడెన్‌ ప్రకటించారు.

బైడెన్‌ నిర్ణయం ప్రపంచాన్ని మూడో ప్రపంచయుద్ధం వైపు నెట్టే చర్య : బూటినా

ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో భారత్‌ టాప్‌లో నిలిచింది.

యుద్ధం సంభవిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తమ దేశాల పౌరులకు స్వీడన్‌, ఫిన్‌లాండ్‌ సూచిస్తున్నాయి.

కోమా వార్తల నేపథ్యంలో బయటకు వచ్చిన ఇరాజ్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ

BUSINESS NEWS

నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 77,339 (-241)
నిఫ్టీ : 23,453 (-79)

గత 35 రోజుల్లో (ట్రేడింగ్‌ సెషన్లలో) ఏకంగా రూ.50 లక్షల కోట్లకుపైగా మార్కెట్‌ విలువ పడిపోయింది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ ధర రూ.660 ఎగబాకి రూ.76 వేల పైకి రూ.76,310కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్‌ గోల్డ్‌ ధర రూ.600 ఎగబాకి రూ.69,950 పలికింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ కొత్తగా 500 శాఖలను ప్రారంభించబోతున్నది

SPORTS NEWS

ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో సిన్నర్‌ 6-4, 6-4తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (యూఎస్‌ఏ)ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు

2024లో 76 మ్యాచ్‌లు ఆడిన సిన్నర్.. ఏకంగా 70 మ్యాచ్‌లలో గెలవడమే గాక ఈ ఏడాది ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకుతో సీజన్‌ను ముగించాడు.

వెస్టిండీస్‌ పర్యటనలో ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆ జట్టు 3-1తో గెలుచుకుంది.

న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ డగ్‌ బ్రాస్‌వెల్‌పై ఆ దేశ స్పోర్ట్‌ ఇంటిగ్రిటీ కమిషన్‌ నెల రోజుల నిషేధాన్ని విధించింది.

సొంతగడ్డపై పాకిస్థాన్‌ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా టీ20లలో మాత్రం క్లీన్ స్వీప్ చేసింది.

ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భాగంగా సోమవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో మలేషియాతో జరిగిన పోరును టీమ్‌ఇండియా 1-1తో డ్రాగా ముగిసింది.

EDUCATION & JOBS UPDATES

TGPSC గ్రూప్ – 3 పరీక్షలు పూర్తి. కేవలం 50% మంది మాత్రమే హజరు.

నేటి నుండి తెలంగాణ లో డిగ్రీ కళాశాలల నిరవధిక బంద్. సెమిస్టర్ పరీక్షలపై ప్రభావం.

JEE ADVANCED మూడు సార్లు కాదు. రెండు సార్లు మాత్రమే.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు