BIKKI NEWS (DEC 19) : TODAY NEWS IN TELUGU on 19th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 19th DECEMBER 2024
TELANGANA NEWS
మోడీ, అదాని కలిసి దేశం ను తాకట్టు పెట్టారు అంటూ రోడ్ పై బైఠాయించి ధర్నా చేసిన సీఎం రేవంత్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చింద్దాం -కేటీఆర్
ధరణి స్థానంలో భూభారతి పోర్టల్. ఈమేరకు బిల్లు ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
జనవరి 02 నుండి టెట్ పరీక్షలు. షెడ్యూల్ విడుదల
అసెంబ్లీలో పలువురు నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, అలాకాకుండా ఇక పై అసెంబ్లీ వద్ద కూడా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది.
సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన ప్రభుత్వం తమను మరోసారి మోసం చేసిందని ఆటోడ్రైవర్ల జేఏసీ శుక్రవారం అసెంబ్లీ ముట్టడి
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు.
ANDHRA PRADESH NEWS
పెనుగొండ లక్ష్మీనారాయణను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగులో రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికిగానూ ఆయనను ఈ అవార్డును ప్రకటించింది
పరిటాల రవి హత్య కేసు.. 18 ఏండ్ల తర్వాత నిందితులకు బెయిల్
70 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు – పవన్ కళ్యాణ్
చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి – ఏపీ హైకోర్టు
ఏపీ బీసీ స్టడీ సర్కిళ్ళ లో సివిల్స్ ఉచిత శిక్షణ
ముడుపుల వ్యవహారంలో మోదీ, అదానీకి భయపడి చంద్రబాబు మౌనం : వైఎస్ షర్మిల
కలకలం.. నెల్లూరులో ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ అంటూ ప్రచారం.
మరో 48 గంటల్లో ఏపీలో వర్షాలు.. చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
హొంగార్డులను ప్రత్యేక కేటగిరీ గా పరిగణించాలి. – ఏపీ హైకోర్టు
NATIONAL NEWS
అంబేద్కర్‌ను కాదు ఆయనకు బదులుగా దేవుడిని స్మరిస్తే, స్వర్గానికైనా వెళ్లొచ్చంటూ అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా వ్యాఖ్యలపై టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.
పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి మంగళవారం సిఫారసు చేసింది.
జమిలి బిల్లుపై అధ్యయనానికి ఏర్పాటు చేయనున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో గరిష్ఠంగా 31 మంది ఎంపీలు ఉంటారు. వీరు 90 రోజుల్లో నివేదిక అందించాలి.
ముంబై తీర సమీపంలో ఓ ఫెర్రీపైకి నేవీ పడవ దూసుకెళ్లిన ఘటనలో 13 మంది మరణించారు. 99 మందిని కాపాడినట్లు భారతీయ నేవీ తెలిపింది.
రూ.22,280 కోట్ల విలువైన మాల్యా, చోక్సీ ప్రాపర్టీలు సీజ్
చట్టాలు ఉన్నది చెట్లను కాపాడటానికే కానీ, వాటిని నరికివేయడానికి కాదని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది.
ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని 2025 జనవరి నుంచి ఉత్తరాఖండ్‌లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ బుధవారం ప్రకటించారు
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల్లో కొందరికి నెలకు రూ.10,000-15,000 పింఛను ఇస్తుండటం పట్ల సుప్రీంకోర్టు బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది.
గురుగ్రామ్‌లోని అన్వి కుమార్ (17)కు ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు లభించింది
ఉత్తర కొరియాలో భారత దౌత్య కార్యాలయం పునరుద్ధరణ
INTERNATIONAL NEWS
ఇండియన్ అమెరికన్ టీనేజర్ కెయిట్లిన్ శాండ్రా నెయిల్ మిస్ ఇండియా యూఎస్‌ఏ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తాం – ట్రంప్
ఎలాన్ మస్క్ ‘గ్లోబల్ కింగ్ మేకర్’ గా మారుదామనుకుంటున్నారని టెలిగ్రాఫ్ పేర్కొంది.
క్యాన్సర్‌కు టీకా అభివృద్ధి చేసినట్టు రష్యా ప్రకటన చేసింది
శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధనల్ని మరింత కఠినతరం చేయనున్నట్టు కెనడా ప్రకటించింది.
సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం.. అప్పటి దాకా ఐఎస్‌ఎస్‌లోనే వ్యోమగాములు..!
చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజిన్ ఇకపై ఫ్రీ
BUSINESS NEWS
సెన్సెక్స్ : 80,684.45 (-1,064.12)
నిఫ్టీ : 24,336 (-332.25)
డిమార్ట్ దేశంలోనే స్వయంకృషితో ఎదిగిన సంస్థల్లో అత్యంత విలువైనదిగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా నివేదిక లో పేర్కొన్నాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా రామమోహన్‌రావు అమర నియమితులయ్యారు.
SPORTS NEWS
దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్..అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
గబ్బా టెస్ట్ డ్రా. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్..89-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అయితే భారత్ 8 పరుగులతో ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది.
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ టెట్ 2024 రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల
వాయుసేన అగ్నీవీర్ వాయు నియామకాలకు నోటిఫికేషన్ జారీ
ఏపీ కానిస్టేబుల్ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల కాల్ లెటర్స్ విడుదల
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్