TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 18 – 09 – 2024

BIKKI NEWS (SEP. 18) : TODAY NEWS IN TELUGU on 18th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 18th SEPTEMBER 2024

TELANGANA NEWS

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సీఎం పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పార్థసారధి కొనసాగారు

బుల్డోజర్ న్యాయం ఆపండి అంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు హైడ్రా కు వర్తించవు. – రంగనాథ్

రాష్ట్రంలో పాలనే లేదు.. సెప్టెంబర్‌ 17 ప్రజాపాలన దినం అట: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెచ్చి ఇంటర్నెట్‌ కనెక్షన్ల సదుపాయం కల్పిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు.

బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ 30 లక్షల వెయ్యి రూపాలయకు కొలను శంకర్‌ రెడ్డి బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు

ఏకంగా 1.87 కోట్లు.. రికార్డు ధర పలికిన కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌ గణపతి లడ్డూ

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)పై హైడ్రా ప్రభావం పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు.

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు

మేడిగడ్డ బరాజ్‌కు తగ్గిన వరద.. 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

న్యూఢిల్లీలో జరుగుతున్న ‘8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్’ సదస్సుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

ANDHRA PRADESH NEWS

విజయవాడ వరద బాధితులకు ప్రతి ఇంటికి రూ. 25 వేలు : ఏపీ సీఎం చంద్రబాబు

వివేకా హత్యకేసును సీఐడీతో విచారణ చేయించాలి.. చంద్రబాబును కోరిన వైఎస్‌ సునీత

తిరుమల శ్రీవారి పుష్కరిణిలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా చక్రస్నానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను బుధవారం(18)న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఏపీలో పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విజయవాడలో వరదలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్సీ, మండలి శాసనసభాపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

ఏపీలో గీతకార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10 శాతం రిజర్వేషన్లు

ముంబై సినీనటి కాదంబరి జత్వాని కేసులో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 30 మందికి తీవ్రగాయాలు.

NATIONAL NEWS

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు.

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సీఎంగా అతిషి పేరును కేజ్రీవాల్‌ ప్రతిపాదించారు.

డిల్లీ కి మూడో మహిళా సీఎంగా అతిశీ నిలిచారు. ఇంతకు ముందు బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్‌, కాంగ్రెస్‌ నుంచి షీలా దీక్షిత్‌ ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పని చేశారు.

అమెరికా పర్యటనకు మోడీ సెప్టెంబర్ 21 – 23 వరకు పర్యటన

వంట నూనెల ధరలు పెంచోద్దు. సరిపడా నిల్వలు ఉన్నాయి. కేంద్రం ప్రకటన.

పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు : ప్రహ్లాద్‌ జోషీ

అక్టోబర్‌ 1 వరకూ దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌గా మనోజ్‌ వర్మను నియమించిన బెంగాల్‌ ప్రభుత్వం

నైట్‌షిఫ్ట్‌లో మ‌హిళ‌లు ప‌నిచేయ‌కుండా వ‌ద్ద‌న‌లేమ‌ని సుప్రీంకోర్టు తెలిపింది. కోల్‌క‌తా డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసులో సుప్రీం ధ‌ర్మాస‌నం ఈ తీర్పు ఇచ్చింది

యూపీలోని ఫిరోజాబాద్‌లోని నౌషేరాలో బాణాసంచా ఫ్యాక్ట‌రీ గోడౌన్‌లో పేలుడు సంభ‌వించింది.. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఆరు మంది గాయ‌ప‌డ్డారు.

అవాస్తవాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్‌ నేతలు ఆరితేరారని అమిత్ షా ఆరోపించారు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ‘ఎమర్జెన్సీ’ షాక్‌…. విచారణకు కోర్టుకు రావాలని నోటీసులు.

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన కొలిక్కి వచ్చింది. కోల్‌కతాలో నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యుల డిమాండ్లు నెరవేర్చేందుకు దీదీ ప్రభుత్వం అంగీకరించింది

INTERNATIONAL NEWS

అమెరికాలో బీఏపీఎస్ స్వామినారాయ‌ణ్ ఆల‌యంపై దాడి జ‌రిగింది. ఆ దాడిని న్యూయార్క్‌లోని భార‌తీయ కౌన్సులేట్ ఖండించింది

నేడే ఆకాశంలో అద్భుతం.. ఒకే రోజు సూపర్‌మూన్‌, చంద్రగ్రహణం. ఇది భారత్ లో కనిపించదు.

గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్‌ చైనాను తాకింది. సోమవారం ఉదయం టైఫూన్‌ ‘బెబింకా’ చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో తీరాన్ని దాటింది. దాదాపు 2.5 కోట్ల జనాభా కలిగిన షాంఘై నగర జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇక్కడి జాతీయ రహదారుల్ని మూసేయించారు.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మార్జాలం రోజీ మరణించింది. యూకేలో నార్విచ్‌లోని ఆ పిల్లి యజమానురాలు లిలా బ్రిసెట్‌ ఇటీవల దానికి అంతిమ వీడ్కో లు పలికారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా భావించే ఈ పిల్లి వయసు 33 ఏండ్లు.

యాగీ తుఫాను కారణంగా మయన్మార్ లో 220 మందికి పైగా మృతి

BUSINESS NEWS

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు.

సెన్సెక్స్ : 83,080 (91)
నిఫ్టీ : 25,418 (35)

రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌.. జినోమ్‌ వ్యాలీలో నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌ అండ్‌ డీ) ప్రారంభించింది.

బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టులో రికార్డు స్థాయిలో 10.06 బిలియన్‌ డాలర్లకు చేరాయని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

SPORTS NEWS

భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీని నెగ్గింది. వరుసగా రెండోసారి టైటిల్‌ని నిలుబెట్టుకున్న టీమిండియా.. మొత్తం ఐదుసార్లు ట్రోఫీని నెగ్గింది. ఫైనల్‌ మ్యాచ్‌లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించింది.

వుమెన్స్‌ క్రికెటర్లకు ఐసీసీ గుడ్‌న్యూస్‌.. టీ20 వరల్డ్‌ కప్‌లో మెన్స్‌తో సమానంగా ప్రైజ్‌మనీ

ప్రతిష్ఠాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. అర్జున్‌ వరుసగా ఆరో విజయంతో సోమవారం జరిగిన పోరులో భారత్‌ 3-1తో రష్యాను ఓడించింది.

ఈ ఏడాది నవంబర్‌లో సింగపూర్‌ వేదికగా జరగాల్సి ఉన్న వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశే ఫేవరేట్‌ అని డిఫెండింగ్‌ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా) వ్యాఖ్యానించాడు.

అర్జున్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. కేఎస్సీఏ టోర్నీలో బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. గోవా త‌ర‌పున ఆడుతున్న అత‌ను.. క‌ర్నాట‌క‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 9 వికెట్లు తీసుకున్నాడు

EDUCATION & JOBS UPDATES

POSTAL GDS – 2వ మెరిట్ జాబితా విడుదల

CTET 2024 డిసెంబర్ నోటిఫికేషన్ విడుదల

నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకొరకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 23 వరకు పొడిగించారు.

నార్త్ సెంటర్ రైల్వే లో ఎలాంటి రాత పరీక్ష లేకుండా 1679 యాక్ట్ అప్రెంటీస్ ఖాళీలు

అణు పరిశోధన కేంద్రం (IGCAR) లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు వెబ్ ఆప్షన్స్ గడువు సెప్టెంబర్ 19.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు