TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 17 – 12 – 2024

BIKKI NEWS (DEC 17) : TODAY NEWS IN TELUGU on 17th DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 17th DECEMBER 2024

TELANGANA NEWS

సంక్రాంతి తర్వాత 10 లక్షల నూతన రేషన్ కార్డులు – మంత్రి ఉత్తమ్

త్వరలోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల – భట్టి

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు

ఇంటర్‌ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై 25తో ముగియనున్నాయి.

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెండు నెలల సమయం కావాలన్న నిందితుల విజ్ఞప్తిని నాంపల్లి ఈడీ కోర్టు జడ్జి రమేశ్‌ తిరస్కరించారు.

రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. 27 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ నమోదైంది. ఇక ఆరు జిల్లాల్లో 13 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని 16 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి, పోస్టింగ్‌ కల్పిస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

సర్పంచుల పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా.. అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

ANDHRA PRADESH NEWS

2027 డిసెంబర్ వరకు పోలవరం పూర్తి – బాబు

జనవరి 1 నుంచి నూతన రిజిస్ట్రేషన్ విలువలు అమలు

ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఎసీబీ కేసు నమోదు.

సమ్మెటీవ్ – 1 ప్రశ్నాపత్రం లీక్

NATIONAL NEWS

నేడు పార్లమెంటుకు జమిలి బిల్లు.. సంప్రదింపుల కోసం ఉభయసభల ఉమ్మడి కమిటీకి

అటవీమార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం

ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు పార్ట్‌ టైమ్‌గా కాని, ఫుల్‌టైంగా కాని ఏకకాలంలో జర్నలిస్టులుగా పనిచేయరాదని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) సోమవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది.

శ్రీలంకకు లిక్విడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌.. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన

అమిత్‌ షా పెద్ద వాషింగ్‌ మెషిన్‌ కొన్నడు.. అందులోకి ఎవరెళ్లినా పరిశుద్ధులైతరు : ఖర్గే

జాకీర్ హుస్సేన్ ఇకలేరు. జాకీర్ ఓ మ్యూజిక్ జీనియ‌స్‌: ప్ర‌ధాని మోదీ

INTERNATIONAL NEWS

జార్జియాలోని ఓ ఇండియన్‌ రెస్టారెంట్‌లో దారుణం జరిగింది. అందులో పనిచేస్తున్న 11 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని ఆ దేశంలోని భారతీయ దౌత్య కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కార్బ‌న్ మోనాక్సైడ్ పీల్చి.. జార్జియా స్కీయింగ్ రిసార్టులో 12 మంది మృతి.

2025 నుంచి భారతీయులకు ‘వీసా-ఫ్రీ-ఎంట్రీ’కి అవకాశం కల్పిస్తున్నట్టు రష్యా అధికారికంగా ప్రకటించింది.

కెనడా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ.

వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026లో ఎన్నికలు జరగనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ ప్రకటించారు

BUSINESS NEWS

స్టాక్‌ మార్కెట్లు మళ్లీ నష్టాలోకి

సెన్సెక్స్ : 81,748.57 (-384.55)
నిఫ్టీ : 24,668.25 (-100)

గత నెలలో ఎగుమతుల్లో వృద్ధి మైనస్‌ 4.85 శాతం తగ్గి 32.11 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

పదేండ్లలో రూ.12.3 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్‌ చేసిన బ్యాంకులు. ఒక్క ఏడాదిలోనే రూ.2.4 లక్షల కోట్ల లోన్లు తొలగింపు.
అగ్రస్థానంలో నిలిచిన సర్కారీ బ్యాంక్‌ ఎస్బీఐ. పార్లమెంట్‌లో వెల్లడించిన కేంద్రం.

డాలర్ తో రూపాయి 11 పైసలు పడిపోయి మునుపెన్నడూ లేనివిధంగా 84.91 స్థాయికి పతనమైంది.

దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.1,150 తగ్గి రూ.79 వేల దిగువకు పడిపోయి రూ.78, 350 వద్ద ముగిసింది.

SPORTS NEWS

పట్టుబిగించిన ఆసీస్. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 445 ఆలౌట్‌, భారత్ 51/4

బంగ్లా క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై ఐసీసీ నిషేధం.. ఇకపై బౌలింగ్‌ చేయొద్దని ఆర్డర్‌.

భారత్‌ వేదికగా తొలిసారి జరుగనున్న ఖో ఖో ప్రపంచకప్‌లో ఆడేందుకు అమెరికా, ఇంగ్లండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, న్యూజిలాండ్‌ తమ సంసిద్ధత తెలియజేశాయి.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025 షెడ్యూల్ విడుదల. మార్చి 05 నుంచి పరీక్షలు.

టామ్‌కామ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 20న దుబాయ్ లో ఉద్యోగాలకై హైదరాబాద్ లో జాబ్‌మేళా

SBI CLERK JOBS – 13735 క్లర్క్ ఉద్యోగాలకు ఎస్బీఐ నోటిఫికేషన్ జారీ.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు