BIKKI NEWS (AUG 17) : TODAY NEWS IN TELUGU on 17th AUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 17th AUGUST 2024
TELANGANA NEWS
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది
సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో అందరికీ రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలు వదిలేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
రాష్ట్రంలో గతంలో ప్రతిపాదించిన నాలుగు జిల్లాలు విండ్ సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు అనువుకాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఆ నాలుగు జిల్లాల్లో ప్లాంట్లు పెట్టలేమని, ఆయా ప్రతిపాదనలను విరమించుకోవాలని కేంద్రాన్ని కోరనున్నది.
వరంగల్ వేదికగా ఈ నెల 24న రైతు కృతజ్ఞత సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది.
ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్
పార్టీ సమావేశంలో తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 60 శాతంపైగా యువత ఉండటం ఆందోళనకర విషయమని తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ వెల్లడించింది.
లే-అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) స్కీమ్ కింద ఇప్పటివరకు దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 4,28,832 దరఖాస్తులను ప్రాసెస్ చేసి, 60,213 దరఖాస్తులను ఆమోదించామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వెల్లడించారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదు. సరిహద్దున ఆంధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆలయ ఈవో, అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను ఈ విద్యాసంవత్సరం మొత్తం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లెక్చరర్లు శుక్రవారం నాంపల్లిలోని ఇంటర్ విద్యా కమిషనరేట్‌ను ముట్టడించారు. రూ. 42వేల వేతనాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలు, దవాఖానల్లో వసతుల కల్పనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌చోంగ్తు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. షాద్‌నగర్ డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు
ANDHRA PRADESH NEWS
ఏపీ ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌కు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేరళ వయనాడ్ బాధితుల కోసం రూ. 10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది.
NATIONAL NEWS
ఇస్రో శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపింది.
బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీల రక్షణ, భద్రతకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ కి ఫోన్ చేశారు.
క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొనే బాలలకు బెయిలును నిరాకరించరాదని సుప్రీంకోర్టు చెప్పింది.
మోటార్‌సైకిల్ రోడ్డు ప్రమాదానికి గురైనపుడు, ఆ ప్రమాదంలో ఆ బైక్‌ను నడిపిన వ్యక్తి తప్పు లేనపుడు, ఆ వ్యక్తి హెల్మెట్ ధరించలేదనే కారణాన్ని చూపుతూ, బీమా కంపెనీలు బీమా క్లెయిము సొమ్మును తగ్గించరాదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.
జమ్మూకాశ్మీర్ & హర్యానా రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
జమ్మూకాశ్మీర్ లో మొత్తం 90 సీట్లకు గానూ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 01 వరకు మూడు దశలలో పోలింగ్. అక్టోబర్ 4 న ఫలితాలు
హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 01న పోలింగ్.. 04న ఫలితాలు
మహారాష్ట్ర, జార్ఖండ్, డిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
పార్లమెంట్ భవనంలో భద్రతా లోపం మరోసారి బయటపడింది. 20 ఏండ్ల వయసున్న యువకుడొకరు గోడ ఎక్కి పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించాడు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పౌరసత్వాన్ని రద్దుచేయాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా అత్యవసరం కాని వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.
అత్యధికంగా మద్యపానం సేవిస్తున్న రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో (52.6%) ఉంది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ (43.4%) ఉంది.
కఠిన శిక్షలే దురాగతాల అడ్డుకట్టకు ఏకైక మార్గం.. వైద్యురాలి హత్యాచార ఘటనపై హృతిక్ రోషన్
INTERNATIONAL NEWS
మంకీపాక్స్ (ఎంపాక్స్) రూపంలో మరో ప్రమాదం పొంచి ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా జారీ చేసిన గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ద్వారా ప్రకటించింది.
థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా పెటోంగ్టార్న్ షినవత్ర (37)ను పార్లమెంటు శుక్రవారం ఎన్నుకుంది. ఆమె మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర కుమార్తె. రెండో మహిళా ప్రధానిగా రికార్డు
తుర్కియే పార్లమెంటులో శుక్రవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు
పాకిస్థాన్‌లో తొలి ఎంపాక్స్ కేసు నమోదు.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్
తైవాన్‌ను భారీ భూకంపం వణికించింది. తూర్పుతీరంలో శుక్రవారం తెల్లవారుజామున బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు సమాచారం.
BUSINESS NEWS
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు చూశాయి.
సెన్సెక్స్ : 80,437 (1330)
నిఫ్టీ : 24,531 (397)
నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.8 బిలియన్ డాలర్లు తగ్గి 670.119 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ అవతరిస్తుందని ఐఎంఎఫ్ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాధ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాను 7 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది.
బ్యాంకులు వరుసపెట్టి వడ్డీరేట్లను పెంచేస్తున్నాయి. ఈ నెల మొదలు ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన 8 బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచేశాయి.
SPORTS NEWS
రెండ్రోజులుగా జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలం విజయవంతంగా ముగిసింది. 11వ సీజన్ కోసం వేలాన్ని నిర్వహించగా రెండ్రోజుల్లో మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
గతేడాది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహానికి గురై బోర్డు కాంట్రాక్టుతో పాటు జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగాడు.
మహిళల టీ20 ప్రపంచకప్ నిర్వహణకు భారత్ విముఖత తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మిగతా ఆప్షన్లపై దృష్టి సారించింది. వరల్డ్ కప్‌ను నిర్వహించేందుకు ఎడారి దేశం యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆగస్టు మాసాంతం నుంచి మొదలుకాబోయే పారాలింపిక్స్‌లో ప్రారంభ వేడుకలకు భారత్ నుంచి పతాకధారులుగా సుమిత్ అంతిల్, భాగ్యశ్రీ జాదవ్ ఎంపికయ్యారు.
తాజాగా శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్‌వెల్లా డోప్ టెస్టులో ఫెయిల్ కావడంతో నిషేధానికి గురయ్యాడు.
శ్రీలంక మహిళా జట్టు ఓపెనర్ విశ్మీ గుణరత్నే చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తొలి శతకం కొట్టి. ఈ ఘనత సాధించిన లంక రెండో మహిళా క్రికెటర్‌గా విశ్మీ రికార్డు నెలకొల్పింది.
EDUCATION & JOBS UPDATES
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌లో స్వల్ప మార్పు.. అరగంట ముందే ఎగ్జామ్స్
ENTERTAINMENT UPDATES
జాతీయ చలన చిత్ర అవార్డులు 2024 ప్రకటన.
ఉత్తమ చిత్రం గా అట్టమ్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కాంతార.
జాతీయ ఉత్తమ నటీనటులు గా రిషభ్ శెట్టి, నిత్యా మీనన్.
జాతీయ తెలుగు ఉత్తమ చిత్రం గా కార్తికేయ – 2